-Advertisement-

గణపతి శోభాయాత్రలతో ఆధ్యాత్మిక పరిమళం: మాజీ మంత్రి జోగు రామన్న

గణపతి శోభాయాత్రలతో ఆధ్యాత్మిక పరిమళం: మాజీ మంత్రి జోగు రామన్న

చిత్రం న్యూస్, జైనథ్: గణపతి నవరాత్రుల సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న జైనథ్ మండలంలోని డబుల్ బెడ్‌రూమ్ కాలనీ, కేసీఆర్ కాలనీల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మండపాల నిర్వాహకులను అభినందిస్తూ, భక్తిశ్రద్ధలతో గణపతి ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. గణపతి శోభాయాత్రల ద్వారా ఆధ్యాత్మిక భావన మరింత పెంపొందుతుందని పేర్కొన్నారు. ప్రజలు ఐకమత్యంతో పండుగలను జరుపుకొని సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సర్సన్ లింగారెడ్డి, గణేష్ యాదవ్, డుమ్మాల దేవన్న, ఆడేళ్లు, బండి గణేష్, లచ్చిరెడ్డి, కొప్పుల దేవన్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments