విజయ డైరీ నూతన డిప్యూటీ డైరెక్టర్‌గా శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: విజయ డైరీ నూతన డిప్యూటీ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ గురువారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ రాజర్షిషాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.ఈ సందర్భంగా జిల్లాలో పాల ఉత్పత్తుల అభివృద్ధి, రైతులకు అందించే సేవలు, విజయ డైరీ చేపడుతున్న కార్యక్రమాలపై కలెక్టర్‌తో చర్చించారు. పాడి రైతుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలు, విజయ డైరీ ద్వారా అందించే సౌకర్యాలపై సమీక్షించారు.
