-Advertisement-

బీసీ సంఘం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఆవుల రాఘవేంద్రనాథ్ యాదవ్, అన్నదానం జగదీశ్వర్

బీసీ సంఘం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఆవుల రాఘవేంద్రనాథ్ యాదవ్, అన్నదానం జగదీశ్వర్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఆవుల రాఘవేంద్రనాథ్ యాదవ్, అన్నదానం జగదీశ్వర్ లను జాతీయ నాయకులు ఆర్. కృష్ణయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ లు మంగళవారం నియమించారు. నియామక పత్రాలను సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వేణుగోపాల్ యాదవ్ బుధవారం పట్టణంలోని యాదవ భవనం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారికి అందజేశారు. శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు వేణుగోపాల్ యాదవ్ మాట్లాడుతూ…రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగిన బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుందని తెలిపారు. అందుకు జాతీయ నాయకులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో సంఘాన్ని బలోపేతం చేసేందుకు జిల్లా నూతన కార్యవర్గంను నియామకం చేసుకోవడం జరిగిందని తెలిపారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాలపైన ఎప్పటికపుడు పోరాటాలు ఉదృతం చేయాలని కోరారు.

ఈ సందర్బంగా నూతనంగా నియామకమయిన బీసీ సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆవుల రాఘవేంద్రనాథ్ యాదవ్, అన్నదానం జగదీశ్వర్ లు మాట్లాడుతూ..జాతీయ బీసీ సంక్షేమ సంఘం ( National backward classes welfare Association Reg.No 2187/92 )  తమను నియామకం చేసినందుకు జాతీయ, రాష్ట్ర సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. జాతీయ నాయకులు ఆర్ కృష్ణయ్యకి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్ కుమార్ కు, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేణుగోపాల్ యాదవ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బీసీల సమస్యలపై ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ విద్యార్థుల, బీసీల అభ్యున్నతికి ఎల్లవేళలా పాటుపడతామని అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments