Home Blog Page 8

ఘనంగా అన్నాభావు సాఠే జయంతి

0

ఘనంగా అన్నాభావు సాఠే జయంతి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణం కేఆర్కే కాలనీలో డాక్టర్ అన్నాభావు సాఠే 106వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు,.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాలనీ కౌన్సిలర్ రజిత రాము హాజరై జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ డాక్టర్ అన్నాభావు సాఠే ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఛత్రపతి శివాజీ మహారాజ్ వంటి మహనీయుల ఆలోచనలు, ఆశయాలను ఆదర్శంగా తీసుకుని వారి అడుగుజాడల్లో నడవాలని సూచించారు. సమాజ అభ్యున్నతి కోసం మహనీయులు చూపిన మార్గంలో నడవడమే వారికి మనం అందించే నిజమైన నివాళి అని అన్నారు. మహనీయుల ఆశయాలు చిరస్మరణీయం.వారి బాటలోనే మన పయనం కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఉద్ధవ్ కాంబ్లే, నేతుల రేఖ, మేకల ఓం ప్రకాష్, గంగా, మహానంద, సురేఖ , సావిత్ర, పర్యాగ్, పంచపుల, కాలనీ కమిటీ తదితరులు పాల్గొన్నారు.

నీట్‌-పీజీ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్‌ రాజర్షి షా

0

నీట్‌-పీజీ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్‌ రాజర్షి షా

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని నలంద కళాశాలలో ఆదివారం నిర్వహించిన నీట్‌-పీజీ (NEET-PG) ప్రవేశ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణ తీరును, కేంద్రంలో అభ్యర్థులకు కల్పించిన మౌలిక వసతులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. పరీక్ష గదులను సందర్శించిన కలెక్టర్‌.. నిబంధనల మేరకు పరీక్ష సజావుగా జరిగేలా చూడాలని నిర్వాహకులకు స్పష్టం చేశారు. ఎలాంటి లోపాలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కేంద్రంలో మొత్తం 100 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని తెలిపారు.

అభ్యర్థుల ప్రవేశ ప్రక్రియ, బయోమెట్రిక్‌ తనిఖీలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేయాలన్నారు. ఈ తనిఖీల్లో కలెక్టర్‌ వెంట అదనపు ఎస్పీ బి. సురేందర్ రావు, డీఎస్పీ జీవన్ రెడ్డి, డీఐవో గణేశ్‌ జాదవ్‌, పరీక్షల లైజన్‌ అధికారి శ్రీధర్‌, తహసీల్దార్‌ వేణు, అధికారులు, కళాశాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ముదిరాజ్ లు అన్ని రంగాల్లో  రాణించాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: సమాజ శ్రేయస్సే ధ్యేయంగా జీవిస్తూ, ప్రకృతితో మమేకమై మనుగడ సాగిస్తున్న ముదిరాజ్ లు అన్ని రంగాల్లో  రాణించాల్సిన అవసరం ఉందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్  అన్నారు. ఆదివారం గాంధీ పార్కులో పెద్దమ్మ తల్లి, భీమన్న దేవుని ప్రతిష్టాపనను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు బస్టాండ్ ఎదుట పండుగ సాయన్న విగ్రహాన్ని ఎమ్మెల్యే పాయల శంకర్ ఆవిష్కరించారు. తొలుత పూజలు చేసి సంఘం జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ..ముదిరాజ్‌లు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. ముదిరాజ్ సంఘం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పెద్దమ్మ తల్లి, భీమన్న దేవుడి కృపాకటాక్షాలు ముదిరాజ్ సమాజంపై ఎళ్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ముదిరాజుల కోసం ఎల్లవేళలా తను ముందుండి పోరాడతానన్నారు.

ఆడే గజేందర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన దుర్గం శేఖర్

0

ఆడే గజేందర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన దుర్గం శేఖర్

చిత్రం న్యూస్, న్యూస్, నేరడిగొండ: బోథ్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆడే గజేందర్ జన్మదిన వేడుకలను ఆదివారం నేరడిగొండలోని సూర్య ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ స్టేట్ వైస్ చైర్మన్ దుర్గం శేఖర్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శాలువాతో సన్మానించి గౌతమ బుద్ధుడు, డా.బీ.ఆర్. అంబేద్కర్ చిత్రపటాలను అందజేసి అభినందించారు. ఆడే గజేందర్ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉంటూ ప్రజాసేవలో చురుకుగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని దుర్గం శేఖర్ ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గోపిడి రుక్మారెడ్డి, బోథ్ సర్పంచ్ కుర్మే మహేందర్, జిల్లా యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా అధ్యక్షులు శ్రీకర్ గౌడ్, బోథ్ మండల కన్వీనర్ భోజన్న, సర్పంచ్ సొంపల్లి లక్ష్మీకాంత్, నాగాపూర్ మాజీ ఉప సర్పంచ్ ఏరుకొండ విజయ్ సాగర్, మాధస్తూ మహేందర్, ఆడే రఘునాథ్, భీంరావ్, విజయ్ దానిపాల్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

లక్ష్యంపై పట్టు సాధిస్తే కొలువు ఖాయం: కలెక్టర్‌ రాజర్షి షా 

0

లక్ష్యంపై పట్టు సాధిస్తే కొలువు ఖాయం: కలెక్టర్‌ రాజర్షి షా 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: నిర్దిష్టమైన ప్రణాళిక, పట్టుదలతో చదివితే పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఉన్నత కొలువులు సాధించడం సులువవుతుందని జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణలో భాగంగా ఆదివారం స్థానిక రాంనగర్ కాలనీలోని ఎస్సీ స్టడీ సర్కిల్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ఉచితంగా పుస్తకాలు, నోట్‌బుక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన సివిల్స్ ప్రిపరేషన్ అనుభవాలను విద్యార్థులతో పంచుకుంటూ పోటీ పరీక్షల తయారీపై దిశానిర్దేశం చేశారు. పరీక్ష ఏదైనా ముందుగా సిలబస్‌పై సంపూర్ణ స్పష్టత ఉండాలని, పరిమిత ప్రామాణిక పుస్తకాలను మాత్రమే ఎంచుకోవాలని సూచించారు. వార్తాపత్రికలు, మేగజైన్ల నుంచి ముఖ్యమైన అంశాలను స్వయంగా నోట్స్ రాసుకుంటే చివరి సమయంలో రివిజన్ సులభమవుతుందని తెలిపారు. తక్కువ మంది మిత్రులతో గ్రూప్‌ స్టడీ చేయడం ద్వారా విషయ పరిజ్ఞానం పెరుగుతుందని, సందేహాలు నివృత్తి అవుతాయని చెప్పారు. మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు రాస్తూ తప్పులను విశ్లేషించుకోవాలని, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల్లో సరైన జవాబును గుర్తించేందుకు ఎలిమినేషన్ పద్ధతి ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. త్వరలోనే పలు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు రానున్నందున అభ్యర్థులు ఫోన్ వంటి ఆకర్షణలకు దూరంగా ఉండి క్రమశిక్షణతో చదవాలని పిలుపునిచ్చారు. స్టడీ సర్కిల్ భవన శాశ్వత నిర్మాణంతో పాటు డిజిటల్ బోధనకు ఐఎఫ్‌పీ ప్యానెల్స్, ఇతర మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ద్వారా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డా. కె.రమేష్, అధ్యాపకులు, ఉద్యోగార్థులు, తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి  నారాయణ్ రావు పటేల్ పరామర్శ 

0

బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి నారాయణ్ రావు పటేల్ పరామర్శ 

చిత్రం న్యూస్, భైంసా: భైంసా పట్టణానికి చెందిన చిన్న స్వామి తల్లి అనారోగ్యంతో మృతి చెందారు. బాధిత కుటుంబాన్ని మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి భోంస్లే నారాయణ్ రావు పటేల్ శనివారం  పరామర్శించారు. వారి ఇంటికి వెళ్లిన  ఆయన కుటుంబీకులను ఓదార్చారు. ఆయన వెంట నాయకులు శంకర్ చందే, శ్యామ్ రావు పటేల్, బొజారం పటేల్, సాయినాథ్, మాధవ్ పటేల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు ఏకాగ్రతతో చదువుకోవాలి 

0
Oplus_16908288

విద్యార్థులు ఏకాగ్రతతో చదువుకోవాలి 

చిత్రం న్యూస్, జైనథ్ : విద్యార్థులు విద్యార్జన పూర్తి అయ్యే వరకు సోషల్ మీడియా దుష్ప్రభావానికి గురికాకుండా ఏకాగ్రతతో చదువు కోవాలని, తల్లిదండ్రులు,ఉపాధ్యాయుల ఆశయాలకు అనుగుణంగా, కష్టపడి అధ్యయనం చేయాలని సామాజిక సమరసత వేదిక అఖిల భారత కళా విభాగం కన్వీనర్ అప్పాల ప్రసాద్ అన్నారు. జైనథ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ‘యూత్ ఫర్ సేవా ప్రాయోజకంతో’,సమరసత వేదిక ఆధ్వర్యంలో ఉమ్మడి జైనథ్ మండలంలోని 22 సమీప గ్రామాల విద్యార్థులకు నోట్ బుక్స్ (5), పెన్సిల్ పౌచ్,కంపాస్ / జామెట్రీ బాక్స్, స్కేల్, పెన్సిల్, పెన్ను, ఎరేజర్, షార్పనర్, DOMS వాటర్ కలర్ పెన్స్, లేబుల్స్ / స్టిక్కర్లతో కూడిన బ్యాగులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ZPSS జైనథ్ ప్రధానోపాధ్యాయులు  మద్ది లస్మన్న, ఉపాధ్యాయులు రావుత్ రవీందర్, పోరెడ్డి అశోక్, సమరసత వేదిక నిర్వాహకులు మెస్రం రాజేశ్వర్, సామ రమేశ్ రెడ్డి, కాసర్ల శ్రీనివాస్, లెనిన్ తదితరులు పాల్గొన్నారు.

 

కరంజిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

0

కరంజిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లా◊ జైనథ్ మండలం కరంజి గ్రామంలో శనివారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది.గ్రామ సర్పంచ్ శైలజ-పొచ్చన్న లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొత్త స్మార్ట్ కార్డుల ద్వారా ప్రజలకు రేషన్ సేవలు మరింత సులభంగా, పారదర్శకంగా అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఏనుగు సూర్యారెడ్డి, వార్డు సభ్యులు, రేషన్ డీలర్, గ్రామస్తులు పాల్గొన్నారు.

అవాల్‌పూర్‌లో కమ్యూనిటీ షెడ్‌కు భూమిపూజ

0

అవాల్‌పూర్‌లో కమ్యూనిటీ షెడ్‌కు భూమిపూజ

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం అవాల్‌పూర్ గ్రామంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ సహకారంతో రూ.5 లక్షల నిధులతో నిర్మించనున్న కమ్యూనిటీ షెడ్‌కు శనివారం సర్పంచ్ ఇరగోళ్ళ అనిల్, ఉప సర్పంచ్ దినేష్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామస్తుల సౌకర్యార్థం ఈ షెడ్ ఎంతగానో ఉపయోగపడుతుందని, నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్‌కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు ఘన స్వాగతం పలికిన దుర్గం శేఖర్

0

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు ఘన స్వాగతం పలికిన దుర్గం శేఖర్

చిత్రం న్యూస్,ఉట్నూర్: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌కు విచ్చేసిన రాష్ట్ర గిరిజన, సాంఘిక సంక్షేమ & దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ఎస్సీ డిపార్ట్‌మెంట్ స్టేట్ వైస్ చైర్మన్ శ్రీ దుర్గం శేఖర్ శనివారం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి సంక్షేమం, హక్కులు, అభివృద్ధికి సంబంధించిన అంశాలపై మంత్రి దృష్టికి తీసుకెళ్లి వినతి పత్రాలు అందజేశారు. జిల్లాలో దళిత వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. దళితుల సమస్యలను మంత్రి సానుకూలంగా విని ప్రతి అంశాన్ని పరిశీలించి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని, దళితుల సంక్షేమానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు రాజన్న, నక్క రామదాసు, భీంరావు, ఆదిలాబాద్ జిల్లా మీడియా కోఆర్డినేటర్ మేకల జితేందర్, ముక్కెర అశోక్ తదితరులు పాల్గొన్నారు.