Home Blog Page 78

శ్రీ శివ భక్త మార్కండేయ మందిరంలో  శ్రావణ మాసం ముగింపు కార్యక్రమం

శ్రీ శివ భక్త మార్కండేయ మందిరంలో  శ్రావణ మాసం ముగింపు కార్యక్రమం

చిత్రం న్యూస్, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా.బోథ్ పట్టణం కేంద్రం లోని శ్రీ శివ భక్త మార్కండేయ ఆలయం లో శ్రావణ మాసం ముగింపు కార్యక్రమం ఘనంగా  నిర్వహించారు. 30 రోజుల పాటు కలశం పెట్టి అఖండ దీపం వెలిగించారు. నిత్యం భోజన కార్యక్రమం నిర్వహించారు. రోజు వేముల చంద్రమోహన్ గారితో ప్రవచనాలు భక్తులుకి వినిపించారు. నిత్యం భజనలు చేసిన భక్తులకు, ప్రవచనం చేసిన చంద్రమోహన్ కు ఆలయ కమిటీ అధ్యక్షులు సిరిపురం చంద్ర మోహన ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఆలయంలో గల శివ విగ్రహానికి సేరె లక్ష్మీ ఆధ్వర్యం లో అన్న పూజ నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో పట్టణ పద్మశాలి గౌరవ అధ్యక్షుడు గంగుల మల్లేష్, అధ్యక్షుడు మెరుగు భోజన్న, ప్రధాన కార్యదర్శి మాసం అనిల్ కుమార్, భజన భక్తులు బారే హితిష్, బారే నారాయణ, దాసరి గంగయ్య, బింగి పురుషోత్తం, తాటికొండ రాజేశ్వర్, గొర్ల ప్రభాకర్, బొడ్డు సుశీల, సేరె లక్ష్మీ, బోనగిరి చంద్రకళ, బారె పద్మ, సోయం రాధ, జక్కుల లక్ష్మీ , పోసాని, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

అడానేశ్వర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోట్ బుక్స్ పంపిణీ

విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేస్తున్న అడానేశ్వర్ ఫౌండేషన్ ఛైర్మన్ సతీష్ పవార్

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని మసాలా (బి ) గ్రామంలో అడానేశ్వర్ ఫౌండేషన్ ఛైర్మన్ సతీష్ పవార్ ఆధ్వర్యంలో నోట్ బుక్స్ పంపిణీ చేశారు.  ఈ సందర్బంగా సతీష్ పవార్ మాట్లాడుతూ.. బేల మండలంలో ఎక్కడ విద్యార్థుల కోసం ఏ అవసరం ఉన్నా తన వంతు సహాయ సహకారాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కళ్లెం ప్రమోద్ రెడ్డి, సీనియర్ నాయకులు తేజ్రావు మస్కే, సుదర్శన్ బత్తుల, కిరణ్ గోడం, ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఉన్నారు.

వాట్సాప్ వేదికగా పొలిటికల్ వార్

వాట్సాప్ వేదికగా పొలిటికల్ వార్

చిత్రం న్యూస్, భీంపూర్:  స్ధానిక సంస్థల ఎన్నికలకు ముందే మండలంలో వాట్సప్ వేదికగా ఆయా పార్టీల యువకులు మాటల యుద్ధం మొదలుపెట్టారు . ప్రధాన సమస్య మారిన రోడ్డు అంశంపై వాడి వేడిగా చర్చకు తెరలేపారు. పదేళ్ళు అధికారంలో ఉండి రోడ్డు బాగు చేయించలేదని ఓ పార్టీ నాయకులు విమర్శిస్తే అధికారంలో ఉన్న మీరు చేయొచ్చుగా అని మరికొందరు వాదనకు దిగడం పొలిటికల్ వేడినీ పుట్టిస్తోంది. రాబోవు ఎన్నికల్లో రోడ్డు అంశమే ప్రధాన ప్రచార అస్త్రంగా మారనుంది. ఇదే అదనుగా యువకులు, విద్యావంతులు కొందరు అప్పుడే పరామర్శలు, ప్రచారంతో ఊపుతెస్తున్నారు. మండల వాసులను ప్రసన్నం చేసుకునేందుకు ముఖ్య నాయకుల వద్దకు పరుగులు పెడుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రేపో మాపో రానుందని,  రిజర్వేషన్  తమకే అనుకూలంగా వస్తుందని  మద్దతు తెలపాలని తమ చర్యలతో పరోక్షంగా తాము రంగంలో ఉన్నామని హల్ చల్ చేయడం పొలిటికల్ వార్ ని తలపిస్తోంది.

రాష్ట్ర లెక్చరర్ల సంఘం ప్రధాన కార్యదర్శి పరామర్శ

బాధిత కుటుంబీకులను  పరామర్శిస్తున్న బలిరాం జాదవ్

చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుమారి గ్రామానికి చెందిన పోతగంటి సురేందర్, రాకేష్ ల సోదరుడు లస్మన్న ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాష్ట లెక్చరర్ల సంఘం ప్రధాన కార్యదర్శి బలిరాం జాదవ్ మృతిని నివాసానికి వచ్చి వృత్తికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వీరి వెంట నేరడిగొండ మండలం బీజేపీ కన్వీనర్ ఆకుల రాజశేఖర్, ప్రశాంత్,  భోజన్న, సీతన్న, పార్ల సాయన్న తదితరులు ఉన్నారు.

ఎమ్మెల్యే. రామారావు పటేల్ ను సన్మానించిన గ్రామాభివృద్ధి కమిటీ

0

ఎమ్మెల్యే రామారావు పటేల్ ను సన్మానించిన గ్రామాభివృద్ధి కమిటీ

చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని వాలేగాం గ్రామ అభివృద్ధి కమిటీ నూతనంగా ఎన్నికైన వాలేగాం గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముథోల్  ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ని కలిసి శాలువా కప్పి పూలబొకేతో సభ్యులు సన్మానం చేశారు. అనంతరం గ్రామలోని హనుమాన్ మందిర్, పాఠశాల ప్రహరీ గోడ తదితర సమస్యలను చెప్పారు. దానికి ఎమ్మెల్యే సమస్యల పైన సానుకూలంగా స్పదించినారని  వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు పుండలిక్ పటేల్,క్యాషియర్ మహేష్ పటేల్,బాలు పటేల్, బీజేవైఎం భైంసా మండల ఉపాధ్యక్షులు,ఎస్ గంగాప్రసాద్, కమిటీ సభ్యులు సతీష్, శీను, పోతన్న, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

దేవిదాస్ ను సన్మానించిన మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ నాయకులు

దేవిదాస్ ను సన్మానిస్తున్న మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ నాయకులు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ బ్యూరో:  స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా తెలంగాణ రాష్ట్ర పోలీసు సేవా పథకం అవార్డు అందుకున్న ఆదిలాబాద్ పట్టణ ట్రాఫిక్ కానిస్టేబుల్ చిందం దేవిదాస్ ను మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ నాయకులు సన్మానించారు. ఆదివారం దేవిదాస్ స్వగ్రామం ఆదిలాబాద్ రూరల్ మండలం చందా (టీ) గ్రామానికి వెళ్లి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తు లో మరిన్ని అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు. సన్మానించిన వారిలో మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ అధ్యక్షులు తోట శివన్న, కోశాధికారి దంతుల మధు, సభ్యులు బొల్లు ఈశ్వర్ దాస్, జిమ్మా అడెల్లు, వడ్డి రవికాంత్, గ్రామ మున్నూరుకాపు సంఘం నాయకులు, గ్రామస్తులు గౌరు రమేష్, లంక సుదర్శన్, చిందం పెద్ద పోశెట్టి, చిందం నడిపి పోశెట్టి, అవినాష్, సాయిరాం తదితరులు ఉన్నారు.

బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ పరామర్శ

బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ పరామర్శ

         చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం చిన్న బుగ్గారం గ్రామానికి చెందిన రాథోడ్ రాజు కు హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో ఇటీవలే హార్డ్ సర్జరీ జరిగింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనిల్ జాధవ్ రాథోడ్ రాజు  ఇంటికి వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ సజన్, దేవేందర్ రెడ్డి, సురేందర్ రాథోడ్, స్థానిక మాజీ సర్పంచ్ విలాస్, ఉత్తం, మహేందర్, జక్కశ్రీధర్ రెడ్డి, అనిల్ యాదవ్, మండల నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు ఉన్నారు.

ఆదిలాబాద్ లో నామకరణ కార్యక్రమానికి హాజరైన కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి

*ఆదిలాబాద్ రూరల్ ఎస్సై విష్ణువర్ధన్ కుమార్తె నామకరణ కార్యక్రమంలో  పాల్గొన్న కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని మినీ తనీషా ఫంక్షన్ హాల్‌లో ఆదిలాబాద్ రూరల్ ఎస్సై విష్ణువర్ధన్_ హిమబిందు దంపతుల కుమార్తె నామకరణం కార్యక్రమం ఆదివారం ఘనంగా  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో హాజరై ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చిన్నారికి ఆశీస్సులు అందించి, తల్లితండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారికి దీర్ఘాయుష్షు, ఆరోగ్యంతో కూడిన సుఖసంతోషమయ జీవితాన్ని కలగాలని ఆకాంక్షించారు. శ్రీకాంత్ రెడ్డి వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నలిమేల నవీన్ రెడ్డి, పలువురు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

పంట నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చూడాలి

పంట నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చూడాలి

చిత్రం న్యూస్ నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుమారి గ్రామపంచాయతీలో గల గాంధారి శివారంలో కడెం వాగు కింద పంట కోతకు గురైన పత్తి, సోయా, మొక్కజొన్న తదితర పంటలను అసిస్టెంట్ టెక్నాలజీ మేనేజర్ శివకుమార్ పంట నష్టపోయిన  రైతులతో కలిసి సర్వే చేశారు. కుమారి వీడీసీ చైర్మన్ బిక్క గంగాధర్ అసిస్టెంట్ టెక్నాలజీ శివకుమార్ తో మాట్లాడుతూ..పంట నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. వీరి వెంట రైతులు అగ్గు రమేష్. మండల ప్రవీణ్, వొర్స వివేక్, బిక్క అడేళ్ళు, జడల అభిలాష్, తుమ్మ రాకేష్, బిక్క అశోక్  తదితరులు పాల్గొన్నారు

 

రెడ్డి హాస్టల్లో ఘనంగా రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి జయంతి వేడుకలు

0

రెడ్డి హాస్టల్లో రాజా బహదూర్ వెంకట రాంరెడ్డి చిత్ర పటానికి నివాళులర్పిస్తున్న రెడ్డి సంఘం నేతలు

        చిత్రం న్యూస్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రెడ్డి హాస్టల్ ప్రాంగణంలో రాజా బహదూర్ వెంకట రాం రెడ్డి (rbvrr) జయంతి వేడుకలను సంఘం నాయకులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి  నివాళులర్పించారు. ఈ సందర్భంగా రెడ్డి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి గోపిడి రాంరెడ్డి  మాట్లాడుతూ.. వంద సంవత్సరాల క్రితమే చదువు యొక్క ఆవశ్యకతను గుర్తించి చదువుతోనే పేదరికం పోతుందని ఉద్దేశంతో హైదరాబాద్ నడిబొడ్డున హాస్టల్ నెలకొల్పి ఎందరో రెడ్డి బంధువులకు విద్యను అందించడం జరుగుతోందన్నారు. రాజా బహదూర్ వెంకట్ రామ్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని ఈ సంవత్సరం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కూడా రెడ్డి హాస్టల్ ప్రారంభించి రెడ్డిలలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉచితంగా వసతి సౌకర్యంతో పాటు విద్యా సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుందని తెలిపారు. అదిలాబాద్ జిల్లాలోని రెడ్డి బంధువులు వచ్చే సంవత్సరం నుంచి మన రెడ్డి హాస్టల్ సేవలను రెడ్డి బంధువులు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రెడ్డి హాస్టల్ నిర్వాహక కమిటీ అధ్యక్షులు పొద్దుటూరు నారాయణ రెడ్డి మాట్లాడుతూ..రాజా బహదూర్ వెంకట్ రామ్ రెడ్డి గారి స్ఫూర్తితో ఈ సంవత్సరం ఆదిలాబాద్ లో కూడా రెడ్డి హాస్టల్ నెలకొల్పుకొని రెడ్డిలలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులను చేర్చుకొని వారందరికీ ఉచితంగా వసతి సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. దీనికి చేయూతనందిస్తున్న ఆదిలాబాద్ జిల్లాలోని రెడ్డి బంధువులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ. వచ్చే సంవత్సరం నుంచి ఆదిలాబాద్ జిల్లాలో గల రెడ్డి బంధువులు వారి వారి గ్రామాలలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులను హాస్టల్లో చేర్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నల్ల నారాయణరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపిడి రాంరెడ్డి, ఆర్థిక కార్యదర్శి ఎల్టి కిష్టారెడ్డి, రెడ్డి హాస్టల్ నిర్వాహక కమిటీ అధ్యక్షులు పొద్దుటూరు నారాయణరెడ్డి, ఉపాధ్యక్షులు సామ స్వామి రెడ్డి, రెడ్డి హాస్టల్ నిర్వహణ కమిటీ సభ్యులు అల్లూరి భూమారెడ్డి, గోపిడి సతీష్ రెడ్డి, మినక జలంధర్ రెడ్డి, గోక సాగర్ రెడ్డి, బద్దం దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.