Home Blog Page 79

అనారోగ్యంతో వైద్యుడు ఆశిష్ కేంద్రే మృతి

0

చిత్రం న్యూస్, ఇచ్చోడ:  వైద్యుడు డాక్టర్ ఆశిష్ కేంద్రే అనారోగ్యంతో శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. పిన్న వయస్సులో ఆయన మరణం కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, గ్రామస్తులకు తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. ఇచ్చోడలో స్థిరపడిన ప్రముఖ వైద్యుడు శంకర్ డాక్టర్ కుమారుడైన డాక్టర్ ఆశిష్ కేంద్రే, కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్స పొందుతున్నప్పటికీ, పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు.డాక్టర్.ఆశిష్ కేంద్రే తన వృత్తిలో నిబద్ధతతో, రోగుల పట్ల సేవా దృక్పథంతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన మరణం వైద్య రంగానికి కూడా తీరని లోటు. ఈ విషాద వార్తతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు శంకర్ డాక్టర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు

0

*ఇఫ్తార్  విందులో పాల్గొన్న డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ తో పాల్గొన్న బోరంచు శ్రీకాంత్ రెడ్డి 

చిత్రం న్యూస్, అదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డా నరేష్ జాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోథ్ ని యోజకవర్గ ఇంచార్జి ఆడే గజేందర్, మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, మాజీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ గండ్రత్ సుజాత , తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, ముస్లిం మత పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, మైనారిటీ సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ఖర్జూరం తినిపించి ఉపవాస దీక్ష విరమింపజేశారు రంజాన్ మాసం సామరస్యానికి సోదర భావానికి ప్రతిక ఆని ఈ సందర్భంగా ప్రజలందరూ ఐక్యమత్యంతో కలిసిమెలిసి పండుగ జరుపుకోవాలని ఈ సందర్భంగా నేతలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజ రెడ్డి, ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ రోహిత్, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఆసిఫ్ ఖాన్, ఎంఐఎం అధ్యక్షులు నజీర్,బోథ్ మా జీ మార్కెట్ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ, గుడిహత్నూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కరుణాకర్, తొడసం దౌలత్ రావు, చిట్యాల గంగన్న,సంతోష్, కాడే సంతోష్, కాంగ్రెస్ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నిర్మల్ లో వెన్నెల డ్యాన్స్ అకాడమీ

0

చిత్రం న్యూస్, నిర్మల్ : నిర్మల్ పట్టణంలో వెన్నెల డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా కవులు, కళాకారులను సన్మానించడంతో పాటు, ఆకట్టుకునే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వెన్నెల డ్యాన్స్ అకాడమీ నిర్వహించిన ఈ ఉగాది వేడుకలలో, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి ముఖ్య అతిథిగా హాజరై, అకాడమీ చేస్తున్న కృషిని అభినందించారు. ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆయన అన్నారు.అకాడమీ నిర్మల్ లో ఒక ప్రముఖ నృత్య సంస్థగా ఎదుగుతోందని, అనేక మంది యువతకు నృత్య శిక్షణ అందిస్తూ, వారిని కళాకారులుగా తీర్చిదిద్దుతోందని వైస్ చైర్మన్ తెలిపారు. తెలుగు నూతన సంవత్సరంలో అకాడమీ మరింత విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, కళాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి ఈ ఉత్సవాలు తెలుగు సంస్కృతి,సంప్రదాయాలను చాటి చెప్పడంతో పాటు, స్థానిక కళాకారులకు ప్రోత్సాహాన్ని అందించాయి.

TVTA ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా సయ్యద్ సబ్దర్ అజీజ్ 

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:TVTA (Technical Vocational Teachers Association) ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా మోడల్ స్కూల్ జైనథ్ కు చెందిన వొకేషనల్ టీచర్ సయ్యద్ సబ్దర్ అజీజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  జనరల్ సెక్రటరీగా మోడల్ స్కూల్ బోథ్‌కు చెందిన వొకేషనల్ టీచర్ పల్లికొండ సాయికృష్ణ ఎన్నికయ్యారు.ఈ ఎన్నికలు TVTA రాష్ట్ర ఎన్నికల కమిటీ ఆధ్వర్యంలో సాఫీగా నిర్వహించబడ్డాయి. జిల్లా స్థాయి నాయకత్వానికి ఈ ఇద్దరు నాయకులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సయ్యద్ సబ్దర్ అజీజ్ మాట్లాడుతూ.. తమపై ఉంచిన నమ్మకానికి సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వొకేషనల్ టీచర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, సంఘాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. జనరల్ సెక్రటరీగా ఎన్నికైన సాయికృష్ణ సభ్యుల సహకారంతో సంఘ అభివృద్ధికి పని చేస్తానని పేర్కొన్నారు.TVTA రాష్ట్ర ఎన్నికల కమిటీ సభ్యులు ఈ సందర్భంగా ఇద్దరు నాయకులను అభినందించారు.

చలో దిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

0

చిత్రం న్యూస్, ఉట్నూర్: మే 24న నిర్వహించే చలో దిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని  రాయిసెంటర్ జిల్లా అధ్యక్షులు మెస్రం దుర్గు పటేల్ పిలుపునిచ్చారు. మతం మారిన ఆదివాసులను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్‌తో గిరిజన సురక్ష మంచ్ ఆధ్వర్యంలో ఉట్నూర్‌లో “చలో దిల్లీ” పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మే 24న జరిగే “చలో డిల్లీ” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని 9 ఆదివాసీ తెగల పెద్దలు, రాయిసెంటర్ సార్మెడీలు, పటేల్, దేవరీ, మహాజన్, గ్రామ సర్పంచ్‌లు, అన్ని సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జిల్లా నుండి వేల సంఖ్యలో ఆదివాసీ బంధువులను దిల్లీకి తీసుకెళ్లాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నైతమ్ శంకర్, సట్ల అశోక్, జైవంత్రావు మహారాజ్, తెకం సంతోష్, మోహన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

అడెల్లి పోచమ్మ సన్నిధిలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు 

0

చిత్రం న్యూస్, సారంగాపూర్: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని అడెల్లి మహా పోచమ్మ సన్నిధిలో  పరాభవ నామ సంవత్సరం సందర్భంగా ఉగాది వేడుకలతో పాటు మండల జడ్పీటీసీ మాజీ సభ్యుడు పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హాజరై, శుభాకాంక్షలు తెలిపారు.ఉగాది పండుగను పురస్కరించుకుని ఆలయంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారి శ్రీనివాస్ శర్మ పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. జడ్పీటీసీ మాజీ సభ్యుడు పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కేక్ కట్ చేసి, రాజేశ్వర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

 

సిర్సన్న లో అహల్యాబాయి విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ

0

చిత్రం న్యూస్, బేల: సిర్సన్న గ్రామంలోని జై మల్హర్ యూత్ ఆధ్వర్యంలో పుణ్యశ్లోక అహల్యాబాయి హోల్కర్ విగ్రహ ప్రతిష్టాపన కోసం ఘనంగా భూమి పూజ నిర్వహించారు. గ్రామంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో యూత్ సభ్యులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు అముల్,సాహిల్, అంకిత్, గ్రామస్తులు సురేష్ రెడ్డి, దీపక్ గౌడ్, భూమన్న,సుభాష్, దేవేందర్ ,భూమరెడ్డి తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామాభివృద్ధిలో భాగంగా ఇటువంటి ఆధ్యాత్మిక,  స్ఫూర్తిదాయక కార్యక్రమాలు చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

భైంసా మున్సిపల్ నూతన కార్యవర్గానికి మున్నూరు కాపు సంఘం సన్మానం

0

చిత్రం న్యూస్ భైంసా: భైంసా పట్టణంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కార్యవర్గాన్ని మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహించారు.భైంసా పట్టణంలోని పిప్రి కాలనీలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన భైంసా మున్సిపల్ చైర్మన్ తూము దత్తాత్రేయతో పాటు వివిధ వార్డులకు ఎన్నికైన కౌన్సిలర్లను సంఘం ప్రతినిధులు పూలమాలలు, శాలువాలతో సత్కరించారు.ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. నూతన కార్యవర్గం పట్టణ అభివృద్ధికి పాటుపడాలని ఆకాంక్షించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించాలని కోరారు.

కవి వెంకట్ కు ఉగాది జాతీయ స్థాయి కళారత్న పురస్కారం 

0

చిత్రం న్యూస్ నిర్మల్ : నిర్మల్ కు చెందిన ప్రముఖ పద్యకవి, వ్యాఖ్యాత, సంస్కృతభాషా ప్రచార సమితి ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి  జిల్లాల వ్యవస్థాపక అధ్యక్షులు డా.బి.వెంకట్ వెన్నెల డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో పరాభవ నామ సంవత్సరం సందర్భంగా నిర్మల్ లో నిర్వహించిన ఉగాది జానపద జాతర కార్యక్రమంలో వెన్నెల డ్యాన్స్ అకాడమీ డైరెక్టర్ ఎక్కొండ ధన్ రాజ్ యూ ట్యూబ్ సింగర్స్ చాగటి రవి, సుమన్, హరీశ్, యాక్టర్స్ -స్పేహాశర్మ, కీర్తి, నాగలక్ష్మి, డింపుల్ మౌనిక, యమున, తారక్ చేతులమీదుగా ఉగాది జాతీయ స్థాయి కళారత్న పురస్కారాన్ని స్వీకరించారు. నిర్మల్ పురపాలక సంఘం చైర్మన్ అప్పాల కావ్య, వైస్ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, పారిశ్రామిక వేత్త అల్లోల మురళీధర్ రెడ్డి వెంకట్ ను  అభినందించారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సాహిత్య కళా సామాజిక సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును పొందినట్లు వెంకట్ చెప్పారు.

నందీశ్వరుడికి గ్రామస్తుల ప్రత్యేక పూజలు 

0

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో సవర్గం గ్రామంలో పరాభవ నామ సంవత్సరం పురస్కరించుకొని గోదావరి పుష్కర ఘాట్ వద్ద కొలువుదీరిన నందీశ్వరుడికి గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దల నాటినుండి సాంప్రదాయంగా వస్తున్న ఉగాది పండగ రోజున ఊరంతా కలిసి గోదావరి నది ఒడ్డున కొలువుదీరిన నందీశ్వరుడికి గ్రామస్తులందరూ వెళ్లి అభిషేకాలు చేసి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు.  సర్పంచ్ గదేకర్ ముత్తుభాయ్ మాట్లాడుతూ.. గోదావరి నది ఒడ్డున కొలువైన నందీశ్వర క్షేత్రం చాలా ఏళ్ళ కితం నాటిదన్నారు. ఈ గుడి అభివృద్ధికి పాటుపడాలన్నారు.  ఉప సర్పంచ్ మంజూష, వార్డ్ మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.