Home Blog Page 132

AADE GAJENDER: బాధిత కుటుంబానికి బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఆడే గజేందర్ పరామర్శ

0

AADE GAJENDER: బాధిత కుటుంబానికి బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఆడే గజేందర్ పరామర్శ

చిత్రం న్యూస్: ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన ఏనుగు కృష్ణారెడ్డి కుమారుడు నరసింహా రెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఆడే గజేందర్ శనివారం వారి ఇంటికెళ్ళి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి తెలిపారు. నరసింహా రెడ్డి  పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని కల్పించారు. ఆయన వెంట ఇచ్చోడ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ సత్యవతి కోటేశ్వర్, సీనియర్ నాయకులు ఇచ్చోడ పాక్స్ వైస్ చైర్మన్ బద్దం పురుషోత్తం రెడ్డి, నియోజకవర్గ మైనారిటీ చైర్మన్ ముస్తఫా, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొత్తూరి లక్ష్మణ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఆసిఫ్ ఖాన్, మాజీ ఎంపీటీసీ జాహిద్ మొహియుద్దీన్, కుర్మే మహేందర్, సీనియర్ నాయకులు మహబూబ్, హుస్సేన్, సాదిక్, బొజ్జా సాయన్న, విఠల్, దేవన్న, రమేష్, గణేష్, యండీ సద్దాం, సయ్యద్ సల్మాన్ తదితరులు ఉన్నారు.

Adilabad: టైలర్స్ కాలనీ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేత 

0

Adilabad: టైలర్స్ కాలనీ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేత 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని టైలర్స్ కాలనీలో నెలకొన్న సమస్యలపై కాలనీ వాసులు MLA పాయల్ శంకర్ ను శనివారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా కాలనీలో డ్రైనేజి వ్యవస్థ సరిగాలేక తీవ్ర ఇబ్బందికి గురవుతున్నామని తెలిపారు. చిన్నపాటి వర్షానికే  రోడ్డు మొత్తం వరద నీరుతో  నిండిపోతుందని, రోడ్డుపై రాకపోకలు సాగించాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్బంగా MLA పాయల్ శంకర్  మున్సిపల్ కమిషనర్ కు ఫోన్ ద్వారా సమస్య ను వివరించి పరిష్కారం కొరకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు గేడం మాధవ్, అక్షయ్, దశరథ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

BOATH MLA: మూవీ పోస్టర్ ను విడుదల చేసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

0

BOATH MLA: మూవీ పోస్టర్ ను విడుదల చేసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

*టీజర్ లాంచ్ కి ముఖ్యఅతిథిగా రావాలని ఆహ్వానం అందజేసిన నటుడు రౌడీ సింగర్

చిత్రం న్యూస్, నేరడిగొండ: నిర్మల్  జిల్లాకు చెందిన నటుడు రౌడీ సింగర్ నటిస్తున్న రంజిత్ కేర్ ఆఫ్ వెంకటాపురం సినిమా పోస్టర్ ను  శనివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నేరడిగొండ మండల కేంద్రంలో విడుదల చేశారు. ఈ నెల 15వ తేదీన నిర్మల్ జిల్లా కేంద్రంలోని RK ఫంక్షన్ హాలులో జరగబోయే టీజర్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరు కావాలని ఎమ్మెల్యే అనిల్ జాదవవ్ ని  నటుడు రౌడీ సింగర్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అనిల్ యాదవ్, రాథోడ్ సురేందర్ ఉన్నారు.

ADILABAD: ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు సన్మానం 

0

ADILABAD: ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు సన్మానం 

చిత్రం న్యూస్, జైనథ్: ఎస్సీ సబ్‌ప్లాన్ క్రింద ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలో సీసీ రోడ్లు నిర్మాణానికి రూ.46 లక్షల నిధులను మంజూరు చేసిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ను జైనథ్ గ్రామ బీజేపీ నాయకులు శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఆదిలాబాద్ అసెంబ్లీ కన్వీనర్ విజయ్ బోయర్, జిల్లా కార్యవర్గ సభ్యుడు సామ రమేష్ రెడ్డి, జైనథ్ మండల ఉపాధ్యక్షుడు ప్రతాప్ యాదవ్,  యువ మోర్చా మండల అధ్యక్షుడు తిప్పిరెడ్డి రాకేష్ రెడ్డి, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు గొడుగుల సత్యనారాయణ, నాయకులు చిల్కూరి లింగారెడ్డి,  చిల్క చిన్నన్న, సంతోష్ రెడ్డి, బిక్కి సంతోష్, రామన్న యాదవ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

బోథ్ లో  ఫొటో ట్రేడ్ ఎక్స్పో పోస్టర్ల ఆవిష్కరణ

0

బోథ్ లో  ఫొటో ట్రేడ్ ఎక్స్పో పోస్టర్ల ఆవిష్కరణ

చిత్రం న్యూస్, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో తెలంగాణ రాష్ట్ర  ఫొటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించనున్న ఫొటో ట్రేడ్ హైదరాబాద్ ఎక్స్పో 2025 పోస్టర్లను బోథ్ ఎస్ఐ శ్రీసాయి శనివారం  ఆవిష్కరించారు. ఈ నెల 19, 20, 21 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న ఈ ఎక్స్పోలో  ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ రంగంలో తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా బోథ్ ఎస్ఐ శ్రీసాయి మాట్లాడుతూ.. ఫొటోగ్రాఫర్లు వైవిద్యమైన ఫొటోలు తీస్తూ.. ప్రస్తుతం నడుస్తున్న (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అందిపుచ్చుకొని కస్టమర్లను సంతృప్తి పరచాలన్నారు. ఇలాంటి ఫొటో ఎక్స్పోలు వృత్తి అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తాయి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బోథ్,  సొనాల మండల గౌరవ అధ్యక్షులు జూకంటి సదాశివ్, అధ్యక్షులు బుస లక్ష్మణ్,  ఉపాధ్యక్షులు దండారి రంజిత్, ప్రధాన కార్యదర్శి ముప్కాల రాజేశ్వర్, కోశాధికారి కాడేరుగుల గణేష్ , యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

ADILABAD: బోథ్ CHC ఆసుపత్రిలో  నిలిచిన ఓపీ సేవలు

0

ADILABAD: బోథ్ CHC ఆసుపత్రిలో  నిలిచిన ఓపీ సేవలు

చిత్రం న్యూస్, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా  బోథ్ CHC ఆసుపత్రిలో ఓపీ సేవలు నిలిచిపోయాయి. తమపై దాడి జరిగిందంటూ ఆసుపత్రి సిబ్బంది విధులుబహిష్కరించి నిరసన తెలిపారు. ఆసుపత్రి సూపరిడెంట్ డా.రవి తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగిన ఓ మహిళను బంధువులు  ఆసుపత్రికి తీసుకొచ్చారు. చికిత్స అందించిన వైద్యులు పరిస్థితి విషమించడంతో ఆదిలాబాద్ రిమ్స్ కు రెఫర్ చేశారు. అయితే రిమ్స్ కు ఎందుకు రెఫర్ చేస్తున్నారని, ఇక్కడే వైద్యం అందించాలని రోగి బంధువులు గొడవ చేసి వైద్య సిబ్బంది పై భౌతిక దాడికి పాల్పడ్డారన్నారు. రాత్రుల్లో విధులు చేసే తమకు రక్షణ లేకుండా పోయిందని, దాడికి పాల్పడ్డ వారిని గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

 

 

 

 

 

 

 

విద్యుత్ సరఫరాలో అంతరాయం

0

విద్యుత్ సరఫరాలో అంతరాయం

చిత్రం న్యూస్, కడెం: నిర్మల్ జిల్లా కడెం, ఖానాపూర్ మండలాలలో ఈ నెల 13న శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ రాంసింగ్ తెలిపారు. 33/11KV సబ్ స్టేషన్  ఖానాపూర్, సుర్జాపూర్, పాత ఎల్లాపూర్, సత్తెనపల్లి, బీర్నంది, కడం, లింగాపూర్,  బిలాల్ నెలవారి మరమ్మత్తుల కోసం 33 కేవీ కడెం, పెంబి ఫీడర్ పైన చెట్ల కొమ్మలను తొలగించుటకు, విద్యుత్ లైన్లో ఉన్న మరమ్మతులను సరిచేయడం కోసం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ సబ్ స్టేషన్ పరిధిలో వచ్చే గ్రామాలన్నిటికీ విద్యుత్ అంతరాయం ఉంటుందని, విద్యుత్ వినియోగదారులు, రైతులు సహకరరించాలని కోరారు.

UTF: రణభేరి పోస్టర్ ఆవిష్కరణ

0

UTF: రణభేరి పోస్టర్ ఆవిష్కరణ

చిత్రం న్యూస్, పెద్దాపురం: ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిల సాధన, విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ సంఘం(AP UTF) రాష్ట్ర సంఘం ప్రకటించిన దశల వారి కార్యక్రమాల్లో భాగంగా పెద్దాపురం యూటీఎఫ్ పట్టణ శాఖ రణభేరి పోస్టర్ ను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులపై బోధనేతర పనుల భారాన్ని తగ్గించాలని, 12 వ  పీఆర్సీ కమిషన్ ను వెంటనే నియమించి త్వరితగతిన పీఆర్సీను ప్రకటించాలని, పెండింగ్ DA బకాయిలు విడుదల చేయడంతో పాటుగా కొత్త DA ను ప్రకటించాలన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాలలో భాగంగా ఈనెల 15 నుంచి 19 వరకు బైక్ జాతాలను నిర్వహించి 25వ తేదీన విజయవాడలో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో  యూటీఎఫ్ పట్టణ అధ్యక్షురాలు S.సత్యవేణి ,సహాధ్యక్షులు జీవీవీ సత్యనారాయణ, యూటీఎఫ్ సీనియర్ నాయకులు వెంకట్రావు, ప్రసాద్, శివప్రసాద్ ,ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

దుబార్ పేట్ లో మెడికల్ హెల్త్ క్యాంప్

0

దుబార్ పేట్ లో మెడికల్ హెల్త్ క్యాంప్

పీహెచ్ సీ వైద్యాధికారి డా. కిరణ్ కుమార్

చిత్రం న్యూస్, ఇచ్చోడ:  ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని  దుబార్ పేట్ గ్రామంలో  శుక్రవారం మెడికల్ హెల్త్ క్యాంపు నిర్వహించారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు జలుబు, దగ్గు, జ్వరము పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. అదేవిధంగా రక్తపోటు, మధుమేహం ,షుగర్ వ్యాధులను గుర్తించి మందులు అందజేశారు. గర్భిణులు సక్రమంగా మందులు వాడాలని తెలిపారు. ఈ వర్షాకాల నేపథ్యంలో ఇంటి చుట్టూ నీళ్లు, ట్యాంకులు, కొబ్బరి చిప్పలు పూల కుండీలలో నిల్వ ఉన్న నీటిలో దోమల లార్వాలను గుర్తించి పారబోశారు.  దోమల ద్వారా వచ్చే వ్యాధులు డెంగ్యూ, మలేరియా ,చికెన్ గున్యా లాంటి సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. మన ఇంటి చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  సీహెచ్ఓ బ్రహ్మానంద రెడ్డి,  హెల్త్ అసిస్టెంట్ రాథోడ్ కైలాష్, ఏఎన్ఎంలు సుధారాణి ,పద్మ, వసంత్, సుభాష్ ,ఆశ కార్యకర్తలు , గ్రామస్తులు పాల్గొన్నారు.

ఫొటో ట్రేడ్ హైదరాబాద్ ఎక్స్పో పోస్టర్ల ఆవిష్కరణ

0

ఫొటో ట్రేడ్ హైదరాబాద్ ఎక్స్పో  పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఎస్సై పురుషోత్తం

చిత్రం న్యూస్: ఇచ్చోడ: తెలంగాణ రాష్ట్ర ఫొటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ అసోషియేషన్ హైదరాబాద్ లో ఈ నెల 19, 20, 21 న నిర్వహిస్తున్న ఫొటో ట్రేడ్ హైదరాబాద్ ఎక్స్పో పోస్టర్లను ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో ఎస్సై పురుషోత్తం  శుక్రవారం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్సై పురుషోత్తం మాట్లాడుతూ.. మారుతున్న కాలాన్ని బట్టి నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇచ్చోడ మండల మాజీ ఎంపీపీ నిమ్మల ప్రీతం రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ లోక శిరీష్ రెడ్డి, మండల అధ్యక్షులు అజయ్ మచ్చ, జిల్లా ఫొటోగ్రాఫర్ల సంఘం అధ్యక్షులు దోడ అశోక్, ఉపాధ్యక్షులు ముప్కాల ప్రవీణ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాపాక విజయ్ కుమార్, మండల ఉపాధ్యాయ ఏరేకర్ దయాకర్, జనరల్ సెక్రటరీ రేలా రమేష్, సెక్రటరీ సుభాష్, మండల ఫోటోగ్రాఫర్స్ వారే రాజు, వంశీకృష్ణ, సతీష్, రాకేష్, విక్రమ్, రాము తదితరులు పాల్గొన్నారు.