Home Blog Page 77

ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలి

0

  ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలి

      ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మొక్కలు                        నాటే కార్యక్రమం

            చిత్రం న్యూస్, భైంసా: 

మండలకేంద్రంలో గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో హరితహారంలో భాగంగా కళాశాలలో వివిధ రకాలకు చెందిన దాదాపు 100 మొక్కలను అధ్యాపకులు, విద్యార్థులు కలిసి నాటారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ కరోల్ల బుచ్చయ్య మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. మొక్కలు నాటడం మూలంగా వర్షం కురవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పతుందన్నారు. ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ జాదవ్ ఓం ప్రకాష్ మాట్లాడుతూ.. మొక్కలు నాటడం ప్రతి ఒక్క విద్యార్థి విధిగా భావించాలని,  మొక్కలు ప్రాణాధారమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ రఘునాథ్, డాక్టర్ పి.గంగారెడ్డి, యూ.రవి కుమార్,డాక్టర్ శంకర్, డాక్టర్ భీమారావు , డాక్టర్ సంతోష్, దివ్య, అక్తర్, సాయినాథ్, రాజయ్య, రామ్మోహన్, సురేందర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా  పండగలు నిర్వహించాలి

ప్రశాంతంగా  పండగలు నిర్వహించాలి

*శాంతి సమావేశంలో సీఐ సాయినాథ్

              చిత్రం న్యూస్ బేల:

ప్రజలు ప్రశాంత వాతావరణంలో పండగలు నిర్వహించాలని సీఐ సాయినాథ్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ నెల 27న వినాయక చవితి, సెప్టెంబర్ 5న మిలాద్ ఉన్ నబీ పండుగలు ఉన్నట్లు తెలిపారు. పెద్ద విగ్ర హాలు పెట్టే మండపాల నిర్వాహకులు క్రేన్ల సహాయంతో ముందుకు సాగాలన్నారు. వర్షాలు కురుస్తున్న తరుణంలో కరెంట్ వైర్స్ తో జాగ్రత్తగా ఉండాలన్నారు. మండపంలో తప్పని సరిగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఫేక్ ప్రచారాలను ఎవరు నమ్మకూడదన్నారు. నిమజ్జన వేడుక అందరూ ఒకేరోజు నిర్వహించాలన్నారు. మండపాల నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న పోలీసులకు సమాచారమిస్తే పరిష్కరిస్తామని తెలిపారు. డీజేలకు ఎలాంటి అనుమతులు రాలేదన్నారు. మహారాష్ట్ర డీజేలకు ఎలాంటి అనుమతి లేదు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సమావేశంలో ఎస్సై మధు కృష్ణ,ఏఎస్ఐ జీవన్, కానిస్టేబుల్ లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు

Matti ganesh vigrahaala pampinee- మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ

Matti ganesh vigrahaala pampinee- మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ

ఉచితంగా పంపిణీ చేసిన సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి 

        చిత్రం న్యూస్, ఆదిలాబాద్:

పర్యావరణ పరిరక్షణ లో ప్రతి ఒక్కరు భాగస్వాములు అవ్వాలని సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి అన్నారు. వినాయక చవితిని పురస్కరించుకొని మంగళవారం మౌనిష్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని టీచర్స్ కాలనీలో, అంబేద్కర్ చౌక్ లో మట్టి గణేష్ విగ్రహాలను పంపిణీ చేశారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో పర్యావరణానికి  హాని కలుగుతుందన్నారు. మట్టి ప్రతిమలనే  వినియోగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రమోద్  కుమార్ ఖత్రి,   గేడం మాధవ్, మామిడి మల్లారెడ్డి, సురేందర్ రెడ్డి, ఆశన్నయాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Vinayaka chavithi vedukalu- పాఠశాలలో వినాయక చవితి వేడుకలు       

 Patashaalalo Vinayaka chavithi vedukalu- పాఠశాలలో వినాయక చవితి వేడుకలు  

మట్టి విగ్రహాలను తయారు చేసిన పాఠశాల విద్యార్థులు

             చిత్రం న్యూస్,భైంసా:

నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని వాలేగాం ప్రాథమిక పాఠశాల విద్యార్థులు వినాయక చవితి పురస్కరించుకొని మట్టితో వినాయకుడి ప్రతిమలను తయారు చేశారు. పీవోపీ(ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌)తో తయారు చేసిన విగ్రహాలతో పర్యావరణానికి హాని జరుగుతుందనే సందేశాన్ని ప్రజలకు ఇవ్వడానికే విద్యార్థులతో మట్టి వినాయక విగ్రహాలను తయారు చేయించామని స్కూల్ హెచ్ఎం రాధిక తెలిపారు. ఈ సందర్భంగా పర్యావరణానికి హాని చేయని మట్టి విగ్రహాలను పూజించాలని హెచ్ఎం రాధిక, విద్యార్థులకు సూచించారు.

గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి

ఉపాధ్యాయుడు కరీం అన్సారీ (ఫైల్ ఫొ టో)

గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి

చిత్రం న్యూస్, తాంసి: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం వడ్డాడి ప్రాథమికోన్నత పాఠశాల బయో సైన్స్ ఉపాధ్యాయుడు కరీం అన్సారీ సోమవారం సాయంత్రం  హఠాన్మరణం  చెందారు.  ఆదిలాబాద్ పట్టణంలోని విద్యానగర్ కాలనీకి చెందిన కరీం అన్సారీ పాఠశాల నుంచి సాయంత్రం ఇంటికి వచ్చారు. ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే  ఓ  ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.  గుండె నొప్పి ఎక్కువ కావడంతో అక్కడే కుప్పకూలిపోయారు. మృతుడికి భార్యతో పాటు ముగ్గురు కుమారులు ఉన్నారు.

ఆడే గజేందర్ ని కలిసిన నేరడిగొండ భగత్ సింగ్ కాలనీవాసులు

ఆడే గజేందర్ ని కలిసిన నేరడిగొండ భగత్ సింగ్ కాలనీవాసులు

చిత్రం న్యూస్ నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ  మండల కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ ని నేరడిగొండ భగత్ సింగ్ కాలనీవాసులు సోమవారం  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు కాలనీలో గల పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని ఆడే గజేందర్  తెలిపారు. ఈ కార్యక్రమంలో భగత్ సింగ్ కాలనీ సభ్యులు సంతోష్, మణి, అరుణ్, ప్రవీణ్, అనిల్, నాయకులు  ఎఎండీ సద్దాం, కపిల్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

*వరదలతో నష్టపోయిన రైతులకి వెంటనే నష్టపరిహారం చెల్లించాలి

*ధర్నా కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ 

చిత్రం న్యూస్, భోరజ్: కాంగ్రెస్ ప్రభుత్వం  ఇచ్చిన  హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ ఆధ్వర్యంలో ఉమ్మడి జైనథ్ మండల నాయకులు భోరజ్ మండల కేంద్రంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు.353 జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ రాజేశ్వరికి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ మట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రుణమాఫీ, తెలంగాణ ప్రజలకు ఆరు హామీలు అమలు ఇస్తామని హామీ ఇచ్చి, వాటిని అమలు చేయలేదని, రైతులను మోసం చేసిందని పేర్కొన్నారు. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు, పంట నష్టాలకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరగకపోతే ఇంక భారీ ఎత్తున నిరసనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపి జైనథ్, భోరజ్ మండలాల అధ్యక్షులు లోక కరుణాకర్ రెడ్డి, గాజుల సన్నీ, బీజేపి మాజీ జైనథ్ మండల అధ్యక్షులు కట్కం రాందాస్,  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అశోక్ రెడ్డి, నాయకులు సీతారాం, సూర్య రెడ్డి, రాకేష్ రెడ్డి, తోట రమేష్, మహేందర్, వెంకన్న, సురేష్, పలువురు నాయకులు పాల్గొన్నారు.

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేయాలి

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేయాలి

*కిసాన్ మోర్చా జైనథ్ మండల అధ్యక్షుడు ఏనుగు రాకేష్ రెడ్డి డిమాండ్

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేయాలని కిసాన్ మోర్చా జైనథ్ మండల అధ్యక్షుడు ఏనుగు రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని  జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెన్ గంగా పరీవాహక ప్రాంతాల్లో  అధికంగా సోయా, పత్తి, కంది పంటలు ముంపుకు గురయ్యాయని తెలిపారు. వరద ముంపుకు గురైన రైతులకు ఎకరానికి రూ.50 వేలు నష్ట పరిహారం అందజేయాలని కోరామన్నారు. వినతిపత్రం సమర్పించిన వారిలో సిడం రాకేష్, పొచ్చన్న, సూర్యరెడ్డి, రమేష్ అశోక్, భోగి ఊశన్న తదితరులు ఉన్నారు.

అనాధ ఆశ్రమంలో పేదలకు అన్నదానం

అనాధ ఆశ్రమంలో  ఉచితంగా ఫ్యాన్లు అందజేస్తున్న  బృహస్పతి-ధనలక్ష్మి దంపతులు

చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ కు చెందిన బృహస్పతి -ధనలక్ష్మి దంపతుల 25వ పెళ్లి రోజు సందర్భంగా అనాధ ఆశ్రమంలో పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. KNR కాలనీలోని వృద్ధులకు వారి అవసరాలు తెలుసుకొని ఉచితంగా ఫ్యాన్లు అందజేశారు. ప్రతి ఒక్కరూ తమ పెళ్లి రోజులు, పుట్టిన రోజులకు తమ వంతుగా సహాయ సహకారాలు అందించి పేదలకు తోడ్పడాలని వారు పేర్కొన్నారు.

 

విద్య నేర్పిన గురువు కుటుంబానికి ఆర్థిక చేయూత

విద్య నేర్పిన గురువు కుటుంబానికి ఆర్థిక చేయూత

చిత్రం న్యూస్, బోథ్ : విద్య నేర్పిన గురువు కుటుంబానికి ఆర్థిక చేయూతనందించారు ఆదిలాబాద్ జిల్లా బోథ్ మోడల్ స్కూల్ విద్యార్థులు.  ఇక్కడ గంటల ప్రాతిపదికన పనిచేస్తూ ఇటీవల మరణించిన ఎకనామిక్స్  ఉపాధ్యాయుడు అశోక్ కుటుంబానికి మోడల్ స్కూల్  ఉపాధ్యాయులు, విద్యార్థులు రూ.93,460 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ మొత్తాన్ని అశోక్  భార్య, పిల్లలకు ప్రిన్సిపాల్ Dr.అనురాధ సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.