Home Blog Page 78

ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ కు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సన్మానం 

0

చిత్రం న్యూస్, బాసర:నిర్మల్ జిల్లా ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామరావు పటేల్ అ సెంబ్లీలో బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలపై ప్రస్థావించినందుకు  విద్యార్థులు శాలువాతో సన్మానించారు. శనివారం భైంసాలోని ఎమ్మెల్యే నివాసంలో వారు కలిశారు. అసెంబ్లీ సాక్షిగా తమ సమస్యలను విన్నవించి, ప్రభుత్వ దృష్టికి తెచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ట్రిపుల్ ఐటీ అభివృద్ధి,కి, తమ సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేస్తున్న ఎమ్మెల్యే సేవలను ఎప్పటికి గుర్తించుకుంటామన్నారు. విద్యాభివృద్ధికి పాటు పడుతూ పేద విద్యార్థుల సంక్షేమానికి పాటు పడుతున్నారని, తమకు ఎల్లవేళలా అండగా ఉండాలని కోరారు.

అన్సార్ ఫౌండేషన్ ఛైర్మన్ అన్సార్ కు శుభాకాంక్షల వెల్లువ 

0

చిత్రం న్యూస్, అదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ప్యూర్ డెయిరీ  ఎండీ, అన్సార్ ఫౌండేషన్ ఛైర్మన్ అన్సార్ కు రంజాన్ పండగ సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఆయన స్వగృహనికి వచ్చిన నాయకులు, మిత్రులు ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో తలమడుగు, రుయ్యాడి సర్పంచులు ఎలుగు రాజన్న, గొడుగు రాకేష్, తలమడుగు పార్టీ మండల అధ్యక్షుడు సాయి, రుయ్యాడి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి, గాజుల సాంబశివ్, ప్యూర్ డెయిరీ, అన్సార్ ఫౌండేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కొండగట్టుకు కాలినడకన అంజన్న భక్తులు 

0

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలం బిదిరెల్లి గ్రామానికి చెందిన హనుమాన్ మాలదారులు శనివారం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కొండగట్టుకు పాదయాత్రగాబయలుదేరారు. తెలంగాణాలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రలో కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం ఒకటి. భక్తులు కోరిన కోరికలు తీరుస్తున్న కొండగట్టు ఆంజనేయస్వామి అయితే అక్కడ ప్రత్యేకత హనుమాన్ మాల దీక్ష తీసుకున్న వారు మండల కాలం దీక్షను కఠిన నియమాలు పాటిస్తూ ఉంటారు. మాల విరమణ చేయాలంటే అంజన్న భక్తులు తమ స్వ గ్రామం నుండి ఎక్కువగా పాదయాత్ర ద్వారా కొండగట్టుకు చేరుకొని అక్కడ స్వామి వారిని దర్శించుకుని మాల విరమణ చేస్తారు. అంజన్న మాల వేసుకున్న భక్తులు ఎక్కువగా కాలినడకన అంజన్నకు దర్శించుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే… హనుమంతుని అంత బలశాల కావాలని అంజన్న కరుణ మనపై ఉండాలంటే ఇలా నదక ద్వారా రావడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని ప్రజల నమ్మకం. 180 కిలోమీటర్ మారంలో ఉన్న కొండగట్టుకు మండేటి ఎండలో నడుచుకుంటూ వినోద్ గురుస్వామి ఆధ్వర్యంలో కొండగట్టుకు బయలుదేరారు.

ఘనంగా ఇఫ్తార్ విందు 

0

చిత్రం న్యూస్, అదిలాబాద్:రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని ఉపవాస దీక్షలు ఆచరిస్తున్న ముస్లింల కోసం శుక్రవారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని ఖానాపూర్ లోగల జోహరా మస్జీద్ లో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి డీసీసీ మాజీ  అధ్యక్షులు సాజిద్ ఖాన్ తో కలిసి తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి పాల్గొని ముస్లిం సోదరులకు పండ్లను తినిపించి పండగ శుభాకాంక్షలు తెలిపారు.ఇఫ్తార్ విందు ఆత్మీయత,మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రంజాన్ పండగను స్నేహ సంబంధాలతో జరుపుకోవాలని ముందస్తుగా ఈద్ ముబారక్ తెలిపారు. కార్యక్రమంలో ఫహీమ్ ,డాక్టర్ గౌస్, అలీమ్ ,అయూబ్, చోటూ, నజీజ్, ముర్తుజా, అజీజ్, అఫ్సర్ ఖాన్, శివాజీ కాంబ్లే తదితరులు ఉన్నారు.

ఆర్జీయూకేటీ బాసర విద్యార్థిని తేజస్విని మృతిపై వైద్య నివేదిక వెల్లడి

0

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో పి.యు.సి 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మల్లెపూడు తేజస్విని మరణానికి గల కారణాలను ప్రభుత్వ ఆసుపత్రి వైద్య నివేదికలు ధ్రువీకరించాయి. శుక్రవారం అందిన మెడికల్ రిపోర్ట్స్ ప్రకారం, తేజస్విని అక్యూట్ లుకేమియా బ్లాస్ట్ సెల్ (బ్లడ్ క్యాన్సర్ – 4వ స్టేజి) తో బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు.గత కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న తేజస్వినికి ఆర్జీయూకేటీ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి, తదుపరి చికిత్స కోసం ఆమెను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు, వెంటనే హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేశారు. దురదృష్టవశాత్తూ అప్పటికే క్యాన్సర్ చివరి దశకు చేరుకోవడంతో విద్యార్థిని మృతి చెందినట్లు నివేదికలు స్పష్టం చేటున్నాయి. ఒక ప్రతిభావంతురాలైన విద్యార్థినిని కోల్పోవడం పట్ల యూనివర్సిటీ యంత్రాంగం, తోటి విద్యార్థులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

గౌతమ బుద్ధుడు చూపిన మార్గంలో పయనించాలి:ప్రముఖ బౌద్ధ బిక్షువు ధమ్మ బోధి

0

చిత్రం న్యూస్ ముథోల్ : ప్రపంచానికి శాంతి, అహింసను బోధించిన గౌతమ బుద్ధుడు చూపిన మార్గంలో పయనిద్దామని ప్రముఖ బౌద్ధ భిక్షువు ధమ్మ బోధి అన్నారు. మండల కేంద్రమైన ముథోల్లోని నాగ్ సేన్ నగర్ లోని శీల్ శాంతి బుద్ధ విహార్ లో భారతీయ బౌద్ధ మహాసభ ఆధ్వర్యంలో ఖేర్ దాన్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా సమతా సైనిక్ దళ్ సైనికులు కవాతు నిర్వహించారు. అనంతరం గౌతమ బుద్ధుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు దీప దూప పూజలు చేసి పంచశీలాలు త్రిశరాన్ని అందించారు. ఉపాసకులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు స్నేహభావంతో ఉండాలని సూచించారు. అదేవిధంగా మూఢనమ్మకాలకు దూరంగా ఉంటూ వైజ్ఞానిక మార్గాన్ని అనుసరించాలన్నారు. పంచశీలాలు త్రిశరనాలు అష్టాంగ మార్గాన్ని ఆచరించడంతో జీవితాన్ని సుఖవంతం చేసుకోవచ్చని పేర్కొన్నారు. యువత ఉన్నతమైన ఆశయంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఉపాసకులు బుద్ధ దర్శన యాత్ర ద్వారా ప్రత్యక్షంగా ప్రముఖ బౌద్ధ క్షేత్రాలను సందర్శించి ఉన్నతమైన అనుభూతిని పొందారన్నారు. ఈ సందర్భంగా బుద్ధవందనకు సంబంధించిన పాకెట్ బుక్కును ఉపాసకులకు పంపింణి చేశారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బౌద్ధ ఉపాసక, ఉపాసికలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

సాంగిడి సర్పంచ్ మంచాల భూపతి రెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు

0

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి గ్రామంలో   ముస్లిం సోదరులకు గ్రామ సర్పంచ్ భూపతి రెడ్డి శుక్రవారం మజీద్ లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నెల రోజులుగా ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం సోదరులకు ఈ సందర్భంగా ఆయన పండ్లు తినిపించారు. వారికి ముందస్తు రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మజీద్ పెద్దలు, పలువురు ఆయనను శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తనయుడు మంచాల నిఖిల్ రెడ్డి, వార్డు సభ్యులు సునీల్ గోహార్కర్, నవగరే రణధీర్, సిద్రప్ సుభాష్, నందు గౌడ్, నాగపూరే మీలింద్, పాండురంగ్, ముస్లిం సోదరులు అజిజ్, షైక్ ఫరీద్, అఫ్రోజ్ ఉస్మాన్, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర బడ్జెట్‌ లో బీసీలకు మొండిచేయి..బీజేఎల్పీ ఉప నేత, ఎమ్మెల్యే పాయల్ శంకర్ 

0
PAYAL SHANKER
PAYAL SHANKER

చిత్రం న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీజేఎల్పీ ఉప నేత, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ పూర్తిగా బీసీ వర్గాలను మోసం చేసే విధంగా ఉందని, అణగారిన వర్గాల ప్రయోజనాలను ప్రభుత్వం విస్మరించిందని ఆయన మండిపడ్డారు.

బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం:

గత తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలోనూ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ బీసీలకు ఒరిగిందేమీ లేదని ఆయన విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో బీసీలకు కనీసం రూ.1 లక్ష వరకు సబ్సిడీ రుణాలు అందేవని, కానీ నేడు తెలంగాణలో బీసీ కార్పొరేషన్ ఉనికి లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. బీసీ సబ్ ప్లాన్ నిధుల వినియోగంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

అంకెల గారడీ.. అమలు శూన్యం:

బడ్జెట్‌లో కేటాయింపులకు, వాస్తవ ఖర్చులకు పొంతన లేదని పాయల్ శంకర్ విమర్శించారు. ఇళ్ల నిర్మాణానికి రూ.23,000 కోట్లు కేటాయించినట్లు చెబుతున్నా, వాస్తవానికి కేవలం రూ.3,000 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బడ్జెట్ నిధుల్లో కేవలం 25 శాతం మాత్రమే ఖర్చు చేయడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు.

రైతులు, ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం:

వ్యవసాయ రంగానికి సంబంధించి ‘ఫసల్ భీమా యోజన’ అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలను సకాలంలో అందించలేని ప్రభుత్వం, ఇతర అంశాలపై కోట్లు ప్రకటించడం ప్రజలను మభ్యపెట్టడమేనని విమర్శించారు.

పోరాటం తప్పదు:

విద్యారంగానికి తగిన నిధులు కేటాయించకపోవడం భవిష్యత్ తరాలను దెబ్బతీయడమేనని హెచ్చరించారు. ఈ ప్రజా వ్యతిరేక బడ్జెట్‌పై భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ లోపల, బయట గట్టిగా పోరాడుతుందని.. బీసీలు, రైతులు, ఉద్యోగుల హక్కుల కోసం వెనకడుగు వేయబోమని పాయల్ శంకర్ స్పష్టం చేశారు.

కరంజి (టి)లో భజన పోటీల కరపత్రాలు విడుదల

0

చిత్రం న్యూస్, భీంపూర్:ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం కరంజి (టి ) గ్రామంలో శ్రీరామ నవమి కళ్యాణోత్సవం సందర్భంగా నిర్వహించనున్న భజన పోటీల కరపత్రాన్ని తెలుగు భజన మండలి సభ్యులు విడుదల చేశారు. ప్రతి బృందంలో ఏడుగురు సభ్యులు ఉండాలని, ప్రదర్శనకు 30 నిమిషాల సమయం ఇస్తారని నిర్వాహకులు తెలిపారు.ఆసక్తి గల భజన బృందాల వారు మరిన్ని వివరాలకు 8985206209, 7083442773 నంబర్లకు సంప్రదించాలని తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ళును ప్రారంభించిన నేతలు 

0

చిత్రం న్యూస్, అదిలాబాద్:ఆదిలాబాద్ పట్టణంలోని వార్డు నెం 20 భాగ్యనగర్ కాలనీలోని వనిత రమేష్ దంపతుల ఇందిరమ్మ ఇళ్ళు గృహప్రవేశానికి ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ రావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి హాజరై ప్రారంభించారు. కంది శ్రీనన్న కానుకను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గూడు లేని పేదవారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించిన మహోన్నతమైన వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నియోజకవర్గం ఇంచార్జి కంది శ్రీనివాస్ రెడ్డి అని అన్నారు.కొత్త ఇంటిలో ఆనందం, ఐశ్వర్యం నిండాలని, కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తమ్మల చందు, భూపేందర్, సాయి, అజయ్, కాలనీవాసులు పాల్గొన్నారు.