Home Blog Page 76

COLLECTARLATHO MANTRI JOOPALLY KRISHANARAO-వర్షాలపై కలెక్టర్లతో మంత్రి జూపల్లి  కృష్ణారావు సమీక్ష

COLLECTARLATHO MANTRI JOOPALLY KRISHANARAO-వర్షాలపై కలెక్టర్లతో మంత్రి జూపల్లి  కృష్ణారావు సమీక్ష

చిత్రం న్యూస్, నేరడిగొండ: వర్షాలు ఎక్కువగా కురుస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లను మంత్రి జూపల్లి కృష్ణారావు అప్రమత్తం చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై ఆసిఫాబాద్, నిర్మల్,  ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లతో ఫోన్ లో మాట్లాడారు. ఎక్కడెక్కడ వర్షాలు అధికంగా కురుస్తున్నాయి? జిల్లాల్లో వరద పరిస్థితులు ఎలా ఉన్నాయని ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని దిశా నిర్దేశం చేశారు. ఒకవేళ అధిక వర్షాలు పడితే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. మరోవైపు రైతులకు యూరియా సరఫరా ఎలా చేస్తున్నారు? కొరత ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ , ప్రైవేట్ ఫెర్టిలైజర్ షాపు ల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా అధికారులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.

MUDHOLE MLA RAMARAO PATEL-భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

0

MUDHOLE MLA RAMARAO PATEL-భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

చిత్రం న్యూస్, ముథోల్ : నిర్మల్ జిల్లాలో  కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ముథోల్ ఎమ్మెల్యే రామారావ్ పటేల్ ప్రజలకు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ ఇంటి బయటకు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాల ప్రభావంతో కామారెడ్డి, నిర్మల్ జిల్లాలతో పాటు పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉన్నాయని ఆయన తెలిపారు. నియోజకవర్గంలోని వాగుల పరివాహక ప్రాంత ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే రామారావ్ పటేల్ సూచించారు.

BORANCHU SEEEKANTH REDDY-బోరంచు నివాసంలో గణనాథునికి పూజలు

BORANCHU SEEEKANTH REDDY-బోరంచు నివాసంలో గణనాథునికి పూజలు

చిత్రం న్యూస్, మావల: ఆదిలాబాద్ జిల్లా మావల మండల కేంద్రంలోని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి నివాసంలో కొలువు దీరిన వినాయకునికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు రచన- శ్రీకాంత్ రెడ్డి దంపతులు పూజాది కార్యక్రమంలో పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా వినాయకుడికి ప్రీతి పాత్రమైన 21 రకాల కూరగాయలతో తయారు చేసిన వంటకాలతో, ఉండ్రాల పాయసంతో నైవేద్యాన్ని సమర్పించారు.భక్తి శ్రద్ధలతో లంభోదరుడున్ని కొలిచారు. అనంతరం మావలలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ..గణనాథుడి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖశాoతులతో ఉండాలన్నారు. రైతులకు తమ పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నట్లు తెలిపారు. 11 రోజుల పాటు నిర్వహించే వినాయకుని పూజలు మొదలుకొని నిమజ్జనం వరకు శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు. కుటుంబ సభ్యులు నిఖిత-ప్రశాంత్ రెడ్డి, సాయి చందన రెడ్డిలు పాల్గొన్నారు.

AADE GAJENDER- బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఆడే గజేందర్ పరామర్శ చిత్రం న్యూస్, నేరడిగొండ

AADE GAJENDER- బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఆడే గజేందర్ పరామర్శ

చిత్రం న్యూస్, నేరడిగొండ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి  వ్యక్తిగత సహాయకుడు జైపాల్ రెడ్డి తండ్రి వెల్దండ రామచంద్రా రెడ్డి  ఇటీవల పరమపదించారు. బుధవారం ఉదయం టీపీసీసీ జనరల్ సెక్రటరీ విజయ్ కుమార్, బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఆడే గజేందర్ నేరడిగొండ నుండి బయలుదేరి జైపాల్ రెడ్డిని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రామచంద్రా రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

BOATH MLA -సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

BOATH MLA –సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

చిత్రం న్యూస్, నేరడిగొండ :ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బుధవారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. గుడిహత్నూర్ మండలంలోని తోషం గ్రామానికి చెందిన సోయం జంగు బాయికి మంజూరు అయిన రూ.21 వేలు, బోథ్ మండల కేంద్రానికి చెందిన తోట లక్ష్మికి మంజూరు అయిన రూ.12 వేలు విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను నేరడిగొండ మండల కేంద్రంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అందజేశారు. కార్యక్రమంలో బోథ్ మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్, నేరడిగొండ మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, నాయకుడు ఆడే రవీందర్ ఉన్నారు.

Bhoraj to bela road danger – భోరజ్ నుంచి బేల రోడ్డు డేంజర్

Bhoraj to bela road danger – భోరజ్ నుంచి బేల రోడ్డు డేంజర్

అధ్వానంగా 353 బీ జాతీయ రహదారి విస్తరణ పనులు

చిత్రం న్యూస్, జైనథ్:  ఆదిలాబాద్ జిల్లా భోరజ్ నుంచి  బేల  వరకు నూతనంగా చేపడుతున్న 353 బీ జాతీయ రహదారి విస్తరణ పనులు అధ్వాన్నంగా  మారాయి. భోరజ్ నుంచి మహారాష్ట్రకు వెళ్ళే ఈ రహదారి నిత్యం వాహనాల రాకపోకలతో బిజీగా ఉంటుంది. రోడ్డు విస్తరణలో భాగంగా  భోరజ్ నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు నూతనంగా రోడ్డు నిర్మాణం చేపట్టారు. కొంత వరకు రోడ్డు నిర్మాణం పూర్తయింది. అయితే నిర్మాణం పూర్తయిన కొన్ని రోజులకే  భోరజ్ నుండి బేల మధ్యలో ఉన్న రోడ్డుపై చాలా చోట్ల గుంతలు ఏర్పడ్డాయి. దీనితో నిర్మించిన కొద్ది రోజులకే రోడ్డుపై కంకర  తేలి గుంతలు ఏర్పడడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  కాంట్రాక్టర్ రోడ్డును నాసిరకంగా నిర్మాణం చేపట్టడంతో భారీ గుంతలు ఏర్పడి ప్రమాదాలు  చోటు చేసుకుంటున్నాయని వాహనదారులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు తమకేం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని  ఆరోపిస్తున్నారు. ఇప్పుడే రోడ్డు పరిస్థితి ఇలా ఉంటే భవిష్యత్తులో ఇంకా ఎలా ఉంటుందోనని వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. రోడ్డు మరమ్మతులు చేయించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

బోథ్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం పోతారెడ్డికి సన్మానం

బోథ్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం పోతారెడ్డికి సన్మానం

చిత్రం న్యూస్,నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని తేజాపూర్ గ్రామంలో  ఫ్రెండ్స్ యూత్, విలన్స్ యూత్ సభ్యులు బోథ్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం పోతారెడ్డికి మంగళవారం సన్మానం చేశారు.  గ్రామంలో   తన సొంత డబ్బులు వెచ్చించి వినాయక విగ్రహాన్ని కొనుగోలు చేసి అందజేశారు.  వినాయక ప్రతిష్టాపన పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రత్యేక పూజలు చేశారు.

 

వినాయక మండపాల దగ్గర ప్రజలు జాగ్రత్తలు పాటించాలి

వినాయక మండపాల దగ్గర ప్రజలు జాగ్రత్తలు పాటించాలి

చిత్రం న్యూస్, నేరడిగొండ :

వినాయక చవితి వస్తున్న సందర్భంగా మండలంలోని  వినాయక మండపాల గ్రామాల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఎంపీడీవో శేఖర్, తహసీల్దార్ కలీం ,ఎస్సై ఇమ్రాన్ ఖాన్ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో పలు విషయాలపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. గణపతి నవరాత్రి ఉత్సవాలలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని, ఏమైనా సమస్యలు ఉంటే అప్రమత్తంగా ఉంటూ పరిష్కరించాలన్నారు. మండపాలలో విద్యుత్ మరమ్మత్తులు జరిగేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, ఏమైనా సమస్యలు ఉంటే సంప్రదించాలని ఎస్సై ఇమ్రాన్ ఖాన్ అన్నారు. శాంతియుతంగా గణేష్ నిమజ్జనం జరుపుకోవాలని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో  వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్  నూతన కార్యవర్గం ఎన్నిక

 ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్  నూతన    కార్యవర్గం ఎన్ని

 నూతన కార్యవర్గంతో శిక్షణ కలెక్టర్ సలోని చాబ్రా 

చిత్రం న్యూస్,ఆదిలాబాద్ : సంఘటిత శక్తి తోనే అభివృద్ధి సాధ్య పడుతుందని జర్నలిస్టులు ఐక్యంగా ఉంటూ సంఘ అభివృధ్ధితో పాటు సమజాభివృద్ధికి తోడ్పాటునందించాలని శిక్షణ కలెక్టర్ సలోని చాబ్రా అన్నారు. మంగళవారం ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నికకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదిలాబాద్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఎన్నిక మంగళవారం ప్రశాంతంగా సాగింది. స్థానిక ప్రెస్ క్లబ్ లో ఉదయం నుండి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ చేపట్టారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు ఉపాధ్యక్షులు, కోశాధికారి పదవులకు నామినేషన్లను స్వీకరించగా…అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా అన్నొజుల శ్రీనివాస్, అవునూరి దత్తాత్రి, ఉపాధ్యక్షులుగా కిరణ్, కోశాధికారిగా అవునూరి శ్రీనివాస్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా ఏ.నవీన్ కుమార్, సహాయ ఎన్నికల అధికారిగా సంజయ్ వ్యవహరించారు. ఈమేరకు శిక్షణ కలెక్టర్ సలోని చాబ్రా మాట్లాడుతూ..ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ మీడియా ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తుందని అన్నారు. ప్రెస్ క్లబ్ అభివృద్ధికి నూతన కార్యవర్గం పాటుపడాలని అన్నారు. జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.

నూతన అధ్యక్షులు అన్నొజుల శ్రీనివాస్ మాట్లాడుతూ… ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు. రానున్న రోజుల్లో క్లబ్ ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, ఎన్నో ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న ఇండ్ల స్థలాల కేటాయింపుకు కృషి చేస్తామని తెలిపారు.

Accridation G.O lo marpulu cheyali -అక్రిడిటేషన్ జీఓలో మార్పులు చేయాలి 

0

Accridation G.O lo marpulu cheyali -అక్రిడిటేషన్ జీఓ లో మార్పులు చేయాలి 

ఐ అండ్ పీఆర్ఓ అధికారులకు ఏపీడబ్ల్యూజెఎఫ్ ఆధ్వర్యంలో వినతి 

     చిత్రం న్యూస్, విజయవాడ:

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన అక్రిడిటేషన్ జీఓలో మార్పులు చేయాలని కోరుతూ ఐఅండ్ పీఆర్ఓ అధికారులకు ఏపీడబ్ల్యూజెఎఫ్ ఆధ్వర్యంలో నాయకులు మంగళవారం వినతి పత్రం అందజేశారు. విజయవాడలోని బస్సు భవన్ లో సమాచార శాఖ ఆడిషనల్ డైరెక్టర్ స్వర్ణలత, జేడీ కిరణ్ కుమార్ లకు ఏపీడబ్ల్యూజెఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.వెంకట్రావు, జి. ఆంజనేయులు నాయకులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అక్రిడిటేషన్ జారీ చేసే రాష్ట్ర, జిల్లా కమిటీల్లో మహిళలకు కూడా అవకాశం కల్పించాలని కోరారు. చిన్న పత్రికల నుంచి ప్రాతినిధ్యం కల్పించడంపై సంతోషం వ్యక్తం చేశారు. 2016 నుంచి పత్రికల ఎంప్యానల్ పక్రియను నిలిపివేశారని, ఆ సమస్యను పరిష్కారం చేస్తే ఆ పత్రికల్లో పని చేసే వారికీ కూడా అక్రిడిటేషన్ పొందే అవకాశం ఉంటుందని ఆ దిశగా అధికారులు కృషి చేయాలని కోరారు. చిన్న పత్రికలకు అక్రిడిటేషన్ జారీ చేసే విషయం పై స్పష్టత ఇవ్వాలని కోరారు. అక్రిడిటేషన్ జారీలో విద్యార్హత విధానం తీసివేసి అనుభవాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు.