Home Blog Page 75

బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కు సన్మానం

బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ను  సన్మానిస్తున్న కుమ్మరి సంఘ సభ్యులు

చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కౌట గ్రామ కుమ్మరి సంఘ సభ్యులు  బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ను ఘనంగా సన్మానించారు. కమ్యూనిటీ షెడ్ నిర్మాణానికి రూ.3 లక్షలు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న ఎమ్మెల్యే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ స్వామి,  నాయకులు ప్రభాకర్ రెడ్డి, చిన్న రెడ్డి, రమేష్ రెడ్డి, భీం రెడ్డి, రామేల్లి ధర్మన్న. ఆశన్న. సాయన్న, భూమన్న, స్వామి తదితరులు ఉన్నారు.

వరద నీటిలో చిక్కుకుపోయిన ఎంజేపీ విద్యార్థులు

0

వరద నీటిలో చిక్కుకుపోయిన ఎంజేపీ విద్యార్థులు

చిత్రం న్యూస్, ముథోల్: నిర్మల్ జిల్లా ముథోల్  పట్టణంలో గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పట్టణం మొత్తం జలమయమైంది. మండల కేంద్రంలోని ప్రభుత్వ మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాల ప్రాంగణం వరద నీటిలో చిక్కుకుంది. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు వెంటనే పాఠశాలకు చేరుకొని, వరద నీటిలో ఉన్న తమ పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు. అదేవిధంగా పట్టణంలోని మహాలక్ష్మి ఆలయం, సాయి మాధవ్ నగర్ కాలనీలు వంటి లోతట్టు ప్రాంతాలు కూడా నీట మునిగాయి. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది.

డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా

0

డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా

చిత్రం న్యూస్, పెద్దాపురం: జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు పెద్దాపురం పట్టణంలో గణపతి నవరాత్రులు పురస్కరించుకొని డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా ఉంచినట్లు పెద్దాపురం ఎస్సై వి. మౌనిక తెలిపారు .ఈ మేరకు గురువారం పెద్దాపురం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో డ్రోన్ కెమెరా ద్వారా పర్యవేక్షణ చేపట్టారు. ఈ గణపతి నవరాతరులు పురస్కరించుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా చేపట్టినట్లు ఎస్సై వి. మౌనిక వెల్లడించారు.

బోథ్ సివిల్ కోర్టు జడ్జిగా న్యాయమూర్తి కుంభ సందీప్ కుమార్

బోథ్ సివిల్ కోర్టు జడ్జిగా న్యాయమూర్తి కుంభ సందీప్ కుమార్

చిత్రం న్యూస్, బోథ్ : బోథ్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జిగా న్యాయమూర్తి కుంభ సందీప్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన న్యాయమూర్తి కుంభ సందీప్ కుమార్ కు న్యాయవాదులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం బోథ్ బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, బోథ్ జూనియర్ సివిల్ కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ పంద్రం శంకర్ శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు వామన్ రావ్ దేశ్ పాండే, పీ పీ శ్రీధర్, ఏజీపీ పంద్రం శంకర్, ఉపాధ్యక్షులు దమ్మపాల్ అంగద్, ఆడెపు హరీష్, రూపేందర్ సింగ్, కుమ్మరి విజయ్ కుమార్, రాజు పాల్గొన్నారు

కల్లూర్–కుంటాల గ్రామాల నడుమ స్తంభించిన రాకపోకలు

0

కల్లూర్–కుంటాల గ్రామాల నడుమ స్తంభించిన రాకపోకలు

*పలుచోట్ల వరదకు కోతకు గురైన రోడ్లు

చిత్రం న్యూస్, భైంసా:ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నిర్మల్ జిల్లాలోని కుంటాల మండల పరిధిలోని కల్లూర్–కుంటాల రహదారి మార్గం ప్రమాదకరంగా మారింది. బుధవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాలతో రహదారి మార్గంలోని అందకూర్ అలుగు ఉధృతంగా ప్రవహించడం మూలంగా అక్కడి ప్రాంతంలోని రోడ్డు భారీ పరిమాణంతో కోతకు గురైంది. రోడ్డుకు ఒక వైపు అధిక భాగం కోతకు గురికావడం మూలంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది, అదిలాబాద్ నుంచి హైదరాబాద్ మార్గంలో వెళ్లే వాహనదారులకు నిర్మల్ పోలీసులు పలు సూచనలు చేశారు. ఆదిలాబాద్ నుంచి కామా రెడ్డి మీదుగా హైదరాబాద్ వెళ్లే వాహనదారులు నిర్మల్ సమీపంలోని కొండాపూర్ బ్రిడ్జి నుంచి ఎడమ వైపునకు తిరిగి యూటర్న్ తీసుకుని వెళ్లాలని సూచించారు. కొండాపూర్ నుంచి మామడ ఖానాపూర్ మెట్ పల్లి, జగిత్యాల, కరీంనగర్, మీదుగా హైదరాబాద్ వెళ్ళవలసి ఉంటుందని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు.వర్షం పరిస్థితి ఇలాగే కొనసాగితే కల్లూర్–కుంటాల రోడ్డు మార్గంలో పూర్తి స్థాయిలో రవాణాకు ఆటంకం కలిగే పరిస్థితులున్నాయి. అంతే కాకుండా ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. భారీ వర్షం కురవడంతో వెంకూర్ లోవెల్ వంతెన సైతం ఉధృతంగా ప్రవహిస్తుంది. పంటలు నీట మునిగిపోయాయి. సోయా పత్తి, వరి  పంటలు నీట మునిగాయి. భారీ వర్షానికి పంటలు దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

వాగులో  వ్యక్తి గల్లంతు..కాపాడిన అధికారులు, గ్రామస్తులు

వాగులో  వ్యక్తి గల్లంతు..కాపాడిన అధికారులు, గ్రామస్తులు

చిత్రం న్యూస్ నేరడిగొండ:  వాగులో చిక్కుకున్న వ్యక్తి గంట పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి కుప్టి, కుమారి మధ్యలో గల చిన్న వాగుపై భారీగా వరద నీరు రావడంతో బైక్ పై వెళ్తున్న వ్యక్తి వాగులో కొట్టుకుపోయాడు. పొదల్లో  ఇరుక్కున్న వ్యక్తిని గమనించిన ప్రజలు నేరడిగొండ ఎస్సై ఇమ్రాన్ ఖాన్ కి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన మండల సిబ్బందిని తీసుకొని ప్రమాద స్థలానికి వచ్చి కుప్టి, కుమారి యువకులు గ్రామ మల్టీపర్పస్ వర్కర్స్ తో కలిసి తాడు సహాయంతో వ్యక్తిని కాపాడారు. వాగులో  కొట్టుకుపోయిన వ్యక్తి సారంగాపూర్ మండలం దుప్పనాయక్ తండాకు చెందిన జాదవ్ సంజుగా గుర్తించారు ఎమ్మార్వో కలీంతో కుప్టి కుమారి గ్రామస్తులు మాట్లాడుతూ.. చిన్న వర్షానికి రాకపోకలకు అంతరాయం కలగడంతో ఇబ్బందులకు గురవుతున్నామని బోథ్ ఎక్స్ రోడ్ ప్రాంతంలో గల ఫారెస్ట్ వారు పార్కు చుట్టుపక్కల నుండి వస్తున్నటువంటి నీటిని కాలువల ద్వారా ఈ ప్రదేశానికి నీటిని వదలడంతో నీరు ఎక్కువగా వస్తుందని.. ఇదివరకే ఇదే ప్రదేశంలో కుచులపూర్ కు చెందిన వ్యక్తి స్వామి మూడు సంవత్సరాల క్రితం మరణించాడని గుర్తు చేశారు. ప్రతి సంవత్సరం చిన్నపాటి వర్షానికి రాకపోకలకు అంతరాయం కలగడంతో ప్రజలం ఇబ్బందులకు గురవుతున్నామని, ఇకనైనా అధికారులు ఈ యొక్క కల్వర్టుపై బ్రిడ్జి ఏర్పాటు చేయాలని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని గ్రామస్తులు కోరారు. ఇందులో ఎమ్మార్వో ఎండి కలీం ఎస్సై ఇమ్రాన్ ఖాన్ ఎంపీడీవో ఎస్. శేఖర్ ఆర్ఐ నాగోరావ్, కుమారి పంచాయతీ కార్యదర్శి  సిండే దత్తాద్రి, జూనియర్ అసిస్టెంట్,  కారోబార్ రాజు, కుప్టి కుమారి, యువకులు ఉన్నారు.

ఘనంగా ముథోల్ ఎమ్మెల్యే  జన్మదిన వేడుకలు

0

ఘనంగా ముథోల్ ఎమ్మెల్యే  జన్మదిన వేడుకలు

*ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ చిత్ర పటానికి పాలాభిషేకం చేస్తున్న నేతలు, రైతులు

చిత్రం న్యూస్, భైంసా: సిరాల ప్రాజెక్టు వద్ద ముథోల్ ఎమ్మెల్యే  జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు.  సంవత్సర కాలంలోనే ప్రభుత్వాన్ని మెప్పించి తొమ్మిది కోట్ల రూపాయల నిధులు తెచ్చి సిరాల ప్రాజెక్టు పూర్తి చేయించినందుకు కృతజ్ఞతా భావంగా ఎమ్మెల్యే జన్మదినోత్సవం సందర్భంగా ప్రాజెక్టు వద్ద ఆయన చిత్రపటానికి ఆయకట్టుదారులు, రైతులు, బీజేపీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే పటేల్ మూలంగా ఎన్నో సంవత్సరాల కల నెరవేరిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షురాలు సిరం సుష్మ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు భూమేష్, నాయకులు కిష్టయ్య, చంద్రకాంత్ పటేల్, బాలాజీ పటేల్, ఎల్లప్ప, భోజరాం పటేల్, బండు పటేల్, గంగారాం, గంగాధర్ మహిళా నాయకులు శారదా, విజయ లక్ష్మి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

,

బోథ్ ఎమ్మెల్యే పరామర్శ

0

బోథ్ ఎమ్మెల్యే పరామర్శ

చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని బోరిగామ గ్రామానికి చెందిన రాథోడ్ బిక్కు నాయక్  ఇటీవల మృతిచెందారు. విషయం తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గురువారం వారి కుటుంబాన్ని పరామర్శించారు. బిక్కు నాయక్ మరణానికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వీరి వెంట మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, మాజీ సర్పంచ్ పవన్,  నాయకులు నానక్ సింగ్, రవీందర్ రెడ్డి, రాథోడ్ సురేందర్, దేవేందర్ రెడ్డి, గులాబ్ తదితరులు ఉన్నారు.

ఆదిలాబాదు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులకు దారి మళ్లింపు

ఆదిలాబాదు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులకు దారి మళ్లింపు

చిత్రం న్యూస్, నేరడిగొండ :జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జల మయం అవ్వడం తో ఆదిలాబాద్ నుండి వయా కామారెడ్డి మీదుగా హైదరాబాద్ వెళ్లే వాహనదారులు నిర్మల్ లోని కొండాపూర్ బ్రిడ్జి నుండి ఎడమ వైపు కి దారి మళ్లింపు చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ డా.జి జానకి షర్మిల తెలిపారు. కొండాపూర్ నుండి వయా మామడ, ఖానాపూర్ మెట్ పల్లి, జగిత్యాల్, కరీంనగర్ మీదుగా హైదరాబాద్ వెళ్ళవచ్చని ఆమె తెలిపారు.

COLLECTARLATHO MANTRI JOOPALLY KRISHANARAO-వర్షాలపై కలెక్టర్లతో మంత్రి జూపల్లి  కృష్ణారావు సమీక్ష

COLLECTARLATHO MANTRI JOOPALLY KRISHANARAO-వర్షాలపై కలెక్టర్లతో మంత్రి జూపల్లి  కృష్ణారావు సమీక్ష

చిత్రం న్యూస్, నేరడిగొండ: వర్షాలు ఎక్కువగా కురుస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లను మంత్రి జూపల్లి కృష్ణారావు అప్రమత్తం చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై ఆసిఫాబాద్, నిర్మల్,  ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లతో ఫోన్ లో మాట్లాడారు. ఎక్కడెక్కడ వర్షాలు అధికంగా కురుస్తున్నాయి? జిల్లాల్లో వరద పరిస్థితులు ఎలా ఉన్నాయని ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని దిశా నిర్దేశం చేశారు. ఒకవేళ అధిక వర్షాలు పడితే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. మరోవైపు రైతులకు యూరియా సరఫరా ఎలా చేస్తున్నారు? కొరత ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ , ప్రైవేట్ ఫెర్టిలైజర్ షాపు ల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా అధికారులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.