Home Blog Page 74

రాష్ట్ర రెడ్ల సంఘాల ఆధ్వర్యంలో నూతన అడ్ హక్ కమిటీ ఎన్నిక 

0

*రాష్ట్ర అడ్ హక్ కమిటీ చైర్మన్ గా బద్దూరి వెంకటేశ్వర రెడ్డి 

*రాష్ట్ర కమిటీ కో కన్వీనర్ గా నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి 

చిత్రం న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ నాగోల్ ప్రాంతంలో పీఎంఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన రాష్ట్ర రెడ్డి సంఘాల ఆధ్వర్యంలో నూతన అడ్ హక్ కమిటీ ఏర్పాటు చేశారు. రెడ్ల భవిష్యత్తు, భద్రత, ఆర్థిక, రాజకీయ అసమానతలు ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా మంగళవారం అన్ని సంఘాలు కూడా ఏకవాక్య తీర్మానంతో ఒకే సంఘాన్ని రాష్ట్రంలో ఒకటే రెడ్డి సంఘం ఉండాలనే నినాదంతో అందరూ కలిసికట్టుగా ముందుకు వచ్చి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కోకన్వీనర్ గా నల్లవెల్లి కరుణాకర్ రెడ్డిని నియమించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద రెడ్లకు పేదరెడ్డి విద్యార్థులకు మేమున్నామని ఈ కమిటీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా భవిష్యత్తు కోసం వారికి భరోసా ఇవ్వడం జరుగుతుందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి పాలకవర్గంతో పాటు బడ్జెట్ కేటాయించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆయా సామాజిక వర్గ ప్రజలకి రాష్ట్ర స్థాయిలో ఏదైతే ప్రభుత్వాలు వారికి హైదరాబాద్ నడిబొడ్డున కుల భవనాలు నిర్మించిందో అదే విధంగా తెలంగాణ రాష్ట్ర రెడ్ల కోసం పది ఎకరాల స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.రాష్ట్ర అడ్ హక్ కమిటీ చైర్మన్ గా బద్దూరి వెంకటేశ్వర రెడ్డి, కన్వీనర్ గా బుట్టెంగారి మాధవరెడ్డి, కో కన్వీనర్లుగా నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి కొట్టం మధుసూదన్ రెడ్డి వసంత రెడ్డి, నూకల పద్మ రెడ్డి, గంగుల శ్రీలత రెడ్డి, నందికొండ గీతరెడ్డి, సభ్యులుగా ఎన్నేపల్లి లింగారెడ్డి,  ఎలిమినేటి సుమన్ రెడ్డి, సలహాదారులుగా ఏనుగు సంతోష్ రెడ్డి, పిట్టా శ్రీనివాస్ రెడ్డి, గోపు జైపాల్ రెడ్డి, నల్ల సంజీవరెడ్డి, నావల్గా సత్యనారాయణరెడ్డి, బొక్క భూపాల్ రెడ్డి, బొబ్బిలి దామోదర్ రెడ్డిని ఎన్నుకున్నారు. రాష్ట్ర కో కన్వీనర్ గా నా నియామకానికి సహకరించిన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఏనుగు సంతోష్ రెడ్డి,రాష్ట్ర అడ్ హక్ కమిటీ చైర్మన్ గా బద్దూరి వెంకటేశ్వర  రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.

దివ్యాంగుల సమస్యలపై అసెంబ్లీ ముట్టడి: బీజేపీ శాసనసభ పక్ష ఉపనేత పాయల్ శంకర్ నేతృత్వంలో భారీ ర్యాలీ

0

చిత్రం న్యూస్, హైదరాబాద్: తెలంగాణలోని దివ్యాంగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ శాసనసభ పక్ష ఉపనేత, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో మంగళవారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా సాగింది. ఎమ్మెల్యే క్వార్టర్స్ నుండి అసెంబ్లీ వరకు నిర్వహించిన ఈ భారీ పాదయాత్రలో రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన వేలాది మంది దివ్యాంగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ శాసనసభ పక్ష ఉపనేత, ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం దివ్యాంగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, వారి హక్కుల సాధన కోసం బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాయల్ శంకర్ తో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు రామారావు పాటిల్, హరీష్ బాబు, ధన్పాల్ సూర్యనారాయణ, పలు దివ్యాంగుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను అడ్డుకోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీఎన్జీవోస్ జైనథ్ యూనిట్ నూతన కమిటీ ఎన్నిక

0

చిత్రం న్యూస్, అదిలాబాద్:టీఎన్జీవోస్ జైనథ్ యూనిట్ నూతన కమిటీ ఎన్నికలను మంగళవారం టీఎన్జీవో సంఘ భవనం నందు నిర్వహించారు. ఎన్నికలు అధికారిగా జి. నితిన్ కుమార్ వ్యవహరించారు. ఈ సందర్భంగా జైనథ్యనిట్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కే. శ్రీనివాస్, కార్యదర్శి మమ్మద్ తౌసిఫ్ , ఉపాధ్యక్షులుగా డి. సుధాకర్, ముజీబ్ ఖాన్, తబస్సుం ఫాతిమా, జాయింట్ సెక్రెటరీలుగా బి. సురేందర్, జాదవ్ ఉల్లాస్, సి. జ్యోతి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ పి. ప్రకాష్, పబ్లిక్ సిటీ సెక్రెటరీ డి. ధీరజ్, కోశాధికారి సిహెచ్. చిన్నయ్య, కార్యనిర్వాహక సభ్యులు డి. నర్మద, డి. సాయి ప్రసాద్, కే. సాయి కృష్ణ, ఎస్. సుదర్శన్, ఎం. శ్రీకాంత్ ఎన్నికయ్యారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను శాలువాతో సత్కరించి.. ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా టీఎన్జీవో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.నవీన్ కుమార్ హాజరై నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను అభినందించారు. టీఎన్జీవోస్ యూనియన్ ఏర్పడి 80 సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నారు. అప్పటినుండి ఇప్పటివరకు ఉద్యోగుల సమస్యలతో పాటు వారి హక్కుల కోసం పోరాడుతున్నదన్నారు. నూతనంగా ఎన్నికైన సభ్యులు తోపాటు ఉద్యోగులు సంఘం బలపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తిరుమల్ రెడ్డి, రూరల్ యూనియన్ అధ్యక్షుడు ఏ.ప్రవీణ్ కుమార్, మాజీ టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు సంద అశోక్, ఉద్యోగులు రవికుమార్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

మ్యాదరిపేటలో ఘనంగా వారసంత వేలంపాట 

0

చిత్రం న్యూస్, దండేపల్లి: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని మ్యాదరిపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం వారసంత బహిరంగ వేలంపాట కార్యక్రమం సర్పంచ్ చొప్పదండి అనూష అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.ఈ వేలంపాటలో గ్రామానికి చెందిన కోటగిరి రామచందర్ రూ.3.36 లక్షలకు పాటను దక్కించుకున్నారు. మొత్తం తొమ్మిది మంది ఔత్సాహికులు ఈ వేలంపాటలో పాల్గొని పోటీ పడ్డారు. చివరికి రామచందర్ అత్యధిక ధర పలికి పాటను స్వాధీనం చేసుకున్నారు.వేలంపాట అనంతరం పాల్గొన్న వారిని గ్రామపంచాయతీ అధికారులు సన్మానించారు. ఈ కార్యక్రమానికి పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రావణ్ కుమార్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ సమ్మె సైరన్: రేపు ప్రభుత్వంతో కీలక చర్చలు!

0

చిత్రం న్యూస్, హైదరాబాద్: తమ డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆర్టీసీ జేఏసీ (JAC) సమ్మె నోటీసు ఇచ్చింది. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం, రేపు హైదరాబాద్‌లోని అంజయ్య భవన్‌లో చర్చలకు రావాలని కార్మిక సంఘాల ప్రతినిధులను ఆహ్వానించింది.

కార్మికుల ప్రధాన డిమాండ్లు ఇవే:

విలీన ప్రక్రియ: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను పూర్తిస్థాయిలో అమలు చేయాలి.

వేతన సవరణ: 2021 మరియు 2025కు సంబంధించిన పెండింగ్ జీతభత్యాల (PRC) సవరణ చేపట్టాలి.

యూనియన్ల పునరుద్ధరణ: సంస్థలో కార్మిక యూనియన్లకు తిరిగి అనుమతినివ్వాలి.

ఉద్యోగ భద్రత: డ్రైవర్లు, కండక్టర్ల ఉద్యోగ భద్రతపై స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయాలి.

బకాయిల విడుదల: కార్మికులకు రావాల్సిన పాత బకాయిలను వెంటనే చెల్లించాలి.

రేపు జరిగే చర్చల్లో ప్రభుత్వం ఇచ్చే హామీలపైనే సమ్మె భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఒకవేళ చర్చలు విఫలమైతే, 26వ తేదీ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా బస్సులు రోడ్డెక్కే అవకాశం లేదని తెలుస్తోంది.ఈ చర్చల అనంతరం జేఏసీ తమ తదుపరి కార్యాచరణను ప్రకటిస్తుందా లేదా ప్రభుత్వం సమ్మెను నివారిస్తుందో చూడాలి.

జైనథ్ లో ఈనెల 25 నుండి శనగ కొనుగోళ్లు ప్రారంభం 

0

చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని రైతుల సౌకర్యార్థం 2025-26 సంవత్సరానికి గాను శనగ పంట కొనుగోలు షెడ్యూల్‌ను మండల వ్యవసాయ అధికారి పూజ విడుదల చేశారు. ఈ ప్రణాళిక ప్రకారం మార్చి 25వ తేదీ నుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు వివిధ గ్రామాల నుండి కొనుగోళ్లు జరగనున్నాయి. రైతులు తమ పంటను షెడ్యూల్ చేసిన తేదీలలో కొనుగోలు కేంద్రనికి తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

బోరంచును మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి షేక్ ఇమామ్ 

0

చిత్రం న్యూస్, మావల: ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ లో జిల్లా సెక్రటరీగా నియమితులైన షేక్ఇమామ్ మావలలో తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా  శ్రీకాంత్ రెడ్డి షేక్ ఇమామ్ ను శాలువాతో సన్మానించి అభినందించారు.రానున్న రోజుల్లో మరింత కష్టపడి పనిచేసి మరిన్ని పదవులు పొందాలని ఆకాంక్షించారు. అలాగే ప్రజా ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేసి రైతుల కళ్ళలో సంతోషాలు నింపిందని, ఇందిరమ్మ ఇళ్ల తో పేదలకు సొంతింటి కలను సాకారం చేసిందని ఇలాంటి మరెన్నో సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి నిరంతరం తమకు ఇచ్చిన పదవికి న్యాయం చేకూర్చేలా పార్టీ పటిష్టతకు  కృషి చేయాలని పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులు అంతా కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇచ్చోడ AMC వైస్ చైర్మన్ శేషరావు, సిరికొండ సర్పంచ్ బొడ్డు దత్తు, సుంకిడి సర్పంచ్ రాథోడ్ గణపతి, సిరికొండ ఉప సర్పంచ్ తోకల రాజు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ ఇమామ్, RGPRS అధ్యక్షులు సదానందం,మాజీ సర్పంచ్ షేక్ బషీర్, ఈశ్వర్, సందీప్, రామారావు, అలాం,సీనియర్ నాయకులు శేబ్బీర్, అజగర్, లాస్స్మన్న, కంచం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

ఇంటింటా తిరుగుతూ..గ్రామ సమస్యలు అడిగి తెలుసుకుంటూ 

0

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ముథోల్ నియోజక వర్గంలో డాక్టర్ కిరణ్ కొమ్రెవార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రామ బాట కార్యక్రమంలో భాగంగా బాసర మండలంలోని బిద్రేల్లి,లాబ్ధి, దొడాపూర్,టాక్లీ గ్రామాల్లో పార్టీ నేతలు పర్యటించి గ్రామ పెద్దలను,రైతులను కలిసి వారి గ్రామ సమస్యలను  అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు  వాటి అమలు గురించి గ్రామ ప్రజలకు వివరించారు. ప్రభుత్వం రైతుల పంటలను సకాలంలో కొనుగోలు చేయక పోవటం వలన ప్రైవేట్ దళారులకు అమ్ముకోవాల్సి వస్తోందని, రైతులు నష్ట పోతున్నారన్నారు. అధికారంలోకి వచ్చాక ప్రతి పంట కొనుగోలు చేయకుండా ఆలస్యం చేస్తోందని విమర్శించారు.ఇది కేవలం దళారుల లబ్ధి కోసమేనని ఆరోపించారు. ఇప్పటికే నియోజకవర్గంలో శనగలు పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకున్న తరువాత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం సిగ్గుచేటన్నారు. ఇప్పుడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఏర్పాటుచేయాలని, తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మేలు చేయాలని కోరారు. మొక్కజొన్నకు ప్రతి క్వింటా కు ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేసి ప్రతి గింజ కొనేలా చూడాలని కోరారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలకు అన్యాయం చేసిందని ప్రజా పాలన లో పూర్తిగా విఫలం అయ్యారని విమర్శించారు. రాబోయే రోజుల్లో  బీఆర్ఎస్ గ్రామ ప్రజల తరఫున, రైతు పక్షాన నిలబడి పోరాటం చేస్తుందన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం 

0

చిత్రం న్యూస్, బాసర: రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా నిధులను విడుదల చేసి, అన్నదాతలకు అండగా నిలిచిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి నాయకులు ఘనంగా క్షీరాభిషేకం నిర్వహించారు. నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో నిర్వహించిన ఈద్ మిలాద్-ఉన్-నబి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్, బాసర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామ్మయి రమేష్, ఇతర ముఖ్య నాయకులకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు మామ్మయి రమేష్ మాట్లాడుతూ. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా నిధులు విడుదల చేయడం రేవంత్ రెడ్డి రైతు పక్షపాతి పాలనకు నిదర్శనం అని కొనియాడారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

నిరంతరాయంగా ‘కంది’ నిత్యాన్నదానం: పేదల ఆకలి తీరుస్తున్న ప్రజాసేవా భవన్

0
KANDI SRINIVASA REDDY
KANDI SRINIVASA REDDY

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ డెస్క్: ఆకలితో అలమటించే నిరుపేదల కడుపు నింపడమే పరమావధిగా ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జి కంది శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిత్యాన్నదాన కార్యక్రమం జిల్లాలో ఒక మహోద్యమంలా సాగుతోంది. పేద రైతు కుటుంబంలో పుట్టి, అమెరికాలో స్థిరపడి, మాతృభూమిపై ప్రేమతో తిరిగి వచ్చిన ఆయన.. తన సేవా గుణంతో వేలాది మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

మూడేళ్లుగా నిర్విరామంగా..

ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయం ‘ప్రజాసేవా భవన్’ గత మూడేళ్లుగా అన్నపూర్ణ నిలయంగా మారింది. జిల్లా నలుమూలల నుండి వివిధ పనుల నిమిత్తం పట్టణానికి వచ్చే పేదలు, కార్మికులు, విద్యార్థులు ఆకలితో ఇబ్బంది పడకూడదన్న లక్ష్యంతో శ్రీనివాస రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రతిరోజూ వందలాది మంది ఇక్కడ కడుపు నిండా భోజనం చేస్తున్నారు.

కె.ఎస్.ఆర్ (KSR) ఫౌండేషన్ ద్వారా సేవలు:

అమెరికా నుండి వచ్చిన తర్వాత తన తండ్రి పేరిట కె.ఎస్.ఆర్ ఫౌండేషన్ స్థాపించిన శ్రీనివాస రెడ్డి, దాని ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. “అన్ని దానాల్లో కల్లా అన్నదానం మిన్న” అనే ఉద్దేశంతో ఆయన చేపట్టిన ఈ నిత్యాన్నదాన కార్యక్రమంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కంది శ్రీనివాస రెడ్డి కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా, ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచే *’నిత్యాన్నదాత’* గా జిల్లా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. మండుటెండల్లో సైతం విరామం లేకుండా ఇంత పెద్ద ఎత్తున భోజన వసతి కల్పించడం అభినందనీయమని, శ్రీనివాస రెడ్డి సేవా దృక్పథం అందరికీ స్ఫూర్తిదాయకమని ప్రజలు కొనియాడుతున్నారు.