Home Blog Page 74

ఓటర్ లిస్టుపై అభ్యంతరాల స్వీకరణ

ఓటర్ లిస్టుపై అభ్యంతరాల స్వీకరణ

చిత్రం న్యూస్, నేరడిగొండ:  గ్రామ పంచాయతీ ఓటర్ లిస్టులో అభ్యంతరాలు, అనుమానాల నివృత్తి కోసం ఈరోజు నేరడిగొండ మండల పరిషత్తు అభివృద్ది అధికారి కార్యాలయంలో శనివారం అన్ని పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో నేరడిగొండ మండలంలోని పోలింగ్ కేంద్రాల జాబితాను పరిశీలించి, పలు అభ్యంతరాలు, సూచనలను వారి దృష్టికి తీసుకెళ్ళారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ శేఖర్, ఎంపీవో  లక్ష్మణ్, మండల పార్టీల నాయకులు, సబ్లె సంతోష్. ఆకుల రాజశేఖర్. ఆడే వసంత్. రాజు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చక్కగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలి

చక్కగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలి

చిత్రం న్యూస్, బేల: విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలని అడనేశ్వర ఫౌండేషన్ చైర్మన్ సతీష్ పవార్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం వరూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మండల బీఆర్ఎస్ నాయకులతో కలిసి నోటుబుక్కులను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు క్రమశిక్షణతో మెలిగి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. మా ఫౌండేషన్ తరపున ఎల్లవేళలా పేద విద్యార్థులకు, పేద ప్రజలకు సేవ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కళ్ళెం ప్రమోద్ రెడ్డి, సీనియర్ నాయకులు మస్కే తేజరావు, కొడప అరుణ్, విశాల్ గోడే,ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ యువకులు, తదితరులు పాల్గొన్నారు.

అన్నదాతకు అన్ని ‘ కష్టాలే ‘

0

 అన్నదాతకు అన్ని ‘కష్టాలే ‘

చేతికొచ్చిన పంట నీట పాలు 

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలం కీర్గుల్ (కె) గ్రామంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లడంతో నీట మునిగిన పంటలను చూసి రైతులు లబోదిబోమని అంటున్నారు. అతి భారీ వర్షాలతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహించడంతో గోదావరి నది ప్రవాహంతో పత్తి, సోయా,వరి, కూరగాయలు, వివిధ రకాల పంటలన్నీ చేతికొచ్చే సమాయానికి  గోదావరి వరదనీటితో నిండా మునిగిపోయాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసిన పంటలు నీట మునగడంతో అప్పులపాలై పోయామని అన్నదాతలు రావుల పోతన్న, నాగనాథ్, నవీన్,  మనోహర్, అగొల్ల పోతున్న, లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

 

గణనాథునికి కాంగ్రెస్ నాయకుడు లోక ప్రవీణ్ రెడ్డి పూజలు

 కాంగ్రెస్ నాయకుడు లోక ప్రవీణ్ రెడ్డిని సన్మానిస్తున్న బ్లూ భీం యూత్ సభ్యులు

చిత్రం న్యూస్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలో  శుక్రవారం సాయంత్రం బ్లూ బీం యూత్ ఆధ్వర్యంలో గణేష్ మండల్ వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ జిల్లా నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి  పాల్గొన్నారు. గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా లోక ప్రవీణ్ రెడ్డిని యూత్ సభ్యులు శాలువాతో సన్మానించారు. రోహిత్ షిండే, భూపేందర్, శ్రీకాంత్ రెడ్డి, ప్రేమేందర్ లోక, సంజీవ్, అఖిలేష్, అశోక్, జైపాల్ తదితరులు పాల్గొన్నారు.

 

ఉగ్రరూపం దాల్చిన బాసర “గోదావరి”

0

బాసరను సందర్శించిన జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల  

శాంతించమ్మ అంటూ గోదారమ్మకు ఆలయ అధికారులు, పూజారుల ప్రత్యేక పూజలు  

చిత్రం న్యూస్, బాసరనిర్మల్ జిల్లాలోని బాసర పవిత్రమైన పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతి. రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలు,  ఎగువన ఎడతెరిపిలేని వర్షాలకు బాసర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తుంది. ఇప్పటికే మొదటి ఘాట్ వద్ద ఉన్న పిండ ప్రధాన షెడ్డు వరదలతో మునిగిపోయింది. బాసర చరిత్రలో మొదటి సారి 1983లో వచ్చిన భారీ నుంచి అతి భారీ వర్షాల, వరదల కారణంగా గోదావరి ఘాట్లు మునిగినట్లు చరిత్రకారులు చెబుతుండగా అదే పరిస్థితి మళ్ళీ కనిపిస్తుందని అంటున్నారు.. గోదావరి ఇప్పటికే బ్యాక్ వాటర్ కారణంగా బాసరలో పలు కాలనీలు మునిగిపోయాయి. గత అర్ధ రాత్రి లోతట్టు ప్రాంతమైన హరిహర కాటేజ్‌లో వరదలో చిక్కుకున్న పది మందిని సంబంధిత అధికారులు, గ్రామస్తులు బయటకు తీసుకువచ్చారు. ప్రస్తుతం గోదావరి వరద ప్రవాహం ప్రధాన ఘాట్ మునగడానికి ఒక మెట్టు మాత్రమే మిగిలి ఉంది. బాసర చుట్టుప్రక్కల ప్రజలు గోదావరి వరదను చూడటానికి తరలివస్తున్నారు

శాంతించమ్మ గోదారమ్మ అంటూ ప్రత్యేక పూజలు

బాసరలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఆలయ అర్చకులు వైదిక బృందం ఆధ్వర్యంలో శుక్రవారం శాంతించమ్మా..! గోదారమ్మ అంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్ద నుంచి గోదావరి నది వరకు మేళతాళాల మధ్య చేరుకొని గోదావరి నదీమ తల్లికి పట్టుచీర, వాయినం, నైవేద్యాన్ని సమర్పించారు. గోదావరి నది శాంతించి దేశం, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించవద్దని వేడుకున్నారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరి నది ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తోంది. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికే కామారెడ్డి, నిజామాబాద్ మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. గత రెండు రోజుల వరదలలో చిక్కుకొని పది మంది మృతి చెందిన విషయం విదితమే..

బాసరలో ముంపు ప్రాంతాల్లో ట్రాక్టర్ పై ఎస్పీ పర్యటన

బాసరలో గోదావరి నది ఉధృతి పెరగడంతో తీర ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. గోదావరి నీరు ఎగసిపడడంతో పలు లాడ్జ్ లు, వ్యాపార సంస్థలు జలమయం కాగా, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల స్వయంగా ట్రాక్టర్‌పై ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ముంపు పరిస్థితులను సమీక్షించి, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలను చేపట్టారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, అధికార యంత్రాంగం అన్ని రకాల సహాయక చర్యలకు సిద్ధంగా ఉందని ఎస్పీ భరోసా ఇచ్చారు. రక్షణ చర్యల్లో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు భాగస్వామ్యమై సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయని వెల్లడించారు. గోదావరి ఉధృతి ఇంకా కొనసాగుతుండటంతో తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల సూచించారు.

ఎకరాకు రూ.30 వేలు అందించాలి  బాసరలో కురిసిన భారీ వర్షానికి గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కురిసిన భారీ వర్షానికి పంట పొలాలు నీట మునిగాయి. నివాస గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. జిల్లా ఎస్పీ జానకి షర్మిల పర్యటించి గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి  షర్మిల, ఏఎస్పీ అవినీష్ కుమార్, సీఐ మల్లేష్. బాసర ఎస్సై బి. శ్రీనివాస్ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం జిల్లా ఎస్పీని రాష్ట్ర బీజేపీ కౌన్సిలింగ్ మెంబర్ పోతుగంటి సతీశ్వర్ రావు కలిసి మండల కేంద్రంలో పంటలు వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారికి నష్టపరిహారం అందించేందుకు జిల్లా కలెక్టర్  ఇక్కడ సందర్శించాలని ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేల నష్టపరిహారం అందించాలని ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు.

సురక్షిత ప్రాంతాలకు తరలింపు  బాసరలో హరిహర కాటేజీ లో చిక్కుకున్న నలుగురు వరద బాధితులను బాసర గంగపుత్ర సంఘం సభ్యులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

అదుపుతప్పితే ప్రాణాలకే ముప్పు

అదుపుతప్పితే ప్రాణాలకే ముప్పు

చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ  మండలం కుప్టి గ్రామం నుంచి కౌట గ్రామం వరకు ఎనిమిది కిలోమీటర్ల పొడవున ఆర్ అండ్ బీ రోడ్డు ప్రమడకరంగా మారింది. స్కూల్ బస్సులు, ఇతరత్రా వాహనాలతో 24 గంటలు రద్దీగా ఉండే  ఈ రోడ్డుకు ఇరువైపులా చెట్లు కొమ్మలు ఏపుగా పెరిగి రోడ్లపైకి రావడంతో  ఎదురుగా వచ్చే వాహనాలు కనపడక ఇరుకైన రోడ్డుతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. రోజుకు ఒక ఆక్సిడెంట్ జరుగుతుండడoతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో కాలినడకన రైతులు పొలాలకు వెళ్లాలంటే ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలతో  ఎక్కడ ఏ ప్రమాదo జరుగుతుందోనని  వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు.  ఇకనైనా ఇరువైపులా పొదలను తొలగించాలని, ప్రమాదం జరుగుతున్న ప్రదేశంలో కల్వర్టు నిర్మాణం చేపట్టి, హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

బేల మండల విద్యాధికారిగా మహాలక్ష్మి బాధ్యతలు స్వీకరణ 

బేల మండల విద్యాధికారిగా మహాలక్ష్మి బాధ్యతలు స్వీకరణ 

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల  మండల విద్యాధికారి (FAC) గా మహాలక్ష్మి నియమితులయ్యారు. సిర్సన్న ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న ఆమెను meo గా నియమిస్తూ ఆర్జేడీ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు శుక్రవారం ఆమె ఎంఈఓగా  బాధ్యతలు స్వీకరించారు.. ఆమె మాట్లాడుతూ.. మండలంలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తామన్నారు. అందరి సహకారంతో మండలాన్ని విద్యాపరంగా అగ్రభాగంలో ఉంచుతామని పేర్కొన్నారు.. ఈ సందర్భంగా  పీఆర్టీయూ టీఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నితిన్, దేవరావు, నాయకులు రామచందర్ అరుణ, ఎమ్మార్సీ సిబ్బంది ఆమెను సన్మానించి అభినందనలు తెలిపారు.

మావలలో ప్రతిష్టించిన వినాయకుడికి బోరంచు శ్రీకాంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ప్రత్యేక పూజలు 

మావలలో ప్రతిష్టించిన వినాయకుడికి బోరంచు శ్రీకాంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ప్రత్యేక పూజలు 

చిత్రం న్యూస్, మావల: తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి స్వగ్రామం మావల లోని ఈశ్వర్ గణేష్ మండలి వారు ప్రతిష్టించిన గణనాథుడికి శుక్రవారం ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి ఆయన సోదరుడు ప్రశాంత్ రెడ్డి ఇరువురు దంపతులు స్వామివారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి, భారీ గరిక మాలతో స్వామివారిని అలంకరించారు. అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు.  కార్యక్రమంలో  కుటుంబ సభ్యులతో పాటు గణేష్ మండలి నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.

బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కు సన్మానం

బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ను  సన్మానిస్తున్న కుమ్మరి సంఘ సభ్యులు

చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కౌట గ్రామ కుమ్మరి సంఘ సభ్యులు  బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ను ఘనంగా సన్మానించారు. కమ్యూనిటీ షెడ్ నిర్మాణానికి రూ.3 లక్షలు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న ఎమ్మెల్యే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ స్వామి,  నాయకులు ప్రభాకర్ రెడ్డి, చిన్న రెడ్డి, రమేష్ రెడ్డి, భీం రెడ్డి, రామేల్లి ధర్మన్న. ఆశన్న. సాయన్న, భూమన్న, స్వామి తదితరులు ఉన్నారు.

వరద నీటిలో చిక్కుకుపోయిన ఎంజేపీ విద్యార్థులు

0

వరద నీటిలో చిక్కుకుపోయిన ఎంజేపీ విద్యార్థులు

చిత్రం న్యూస్, ముథోల్: నిర్మల్ జిల్లా ముథోల్  పట్టణంలో గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పట్టణం మొత్తం జలమయమైంది. మండల కేంద్రంలోని ప్రభుత్వ మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాల ప్రాంగణం వరద నీటిలో చిక్కుకుంది. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు వెంటనే పాఠశాలకు చేరుకొని, వరద నీటిలో ఉన్న తమ పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు. అదేవిధంగా పట్టణంలోని మహాలక్ష్మి ఆలయం, సాయి మాధవ్ నగర్ కాలనీలు వంటి లోతట్టు ప్రాంతాలు కూడా నీట మునిగాయి. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది.