Home Blog Page 73

ఆకట్టుకుంటున్న రెడ్డి బాలల గణేష్ మండలి గణేషుడు

ఆకట్టుకుంటున్న రెడ్డి బాలల గణేష్ మండలి గణేషుడు

సామూహికంగా మహిళల కుంకుమార్చన, ప్రత్యేక పూజలు

చిత్రం న్యూస్, ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని రెడ్డి బాలల గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణేషుని విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.  ప్రతి రోజు ఇక్కడ పూజా కార్యక్రమాలతో పాటు నిత్యాన్నదానం కొనసాగిస్తున్నారు. ఆదివారం మహిళలంతా కలిసి సామూహికంగా కుంకుమార్చన,  ప్రత్యేక పూజలు చేశారు. మహిళలంతా ఓకే చోట చేరి ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకున్నారు.  అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో  కాలనీవాసులు పాల్గొన్నారు.

 

తరోడలో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనం 

0

తరోడలో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనం 

చిత్రం న్యూస్, ముథోల్: నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలోని తరోడ గ్రామంలో గణేష్ నిమజ్జన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఐదు రోజుల పాటు గ్రామమంతా భక్తిశ్రద్ధలతో వినాయకుని పూజలు నిర్వహించి, ఆ తర్వాత నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు. డీజే చప్పుడు నడుమ, డోలు వాయిద్యాలు, బాణాసంచా కాంతులు, పూల వర్షం మధ్య గణపతి విగ్రహాలను ఊరేగింపుగా నిమజ్జనం చేశారు. “గణపతి బప్పా మోరియా” నినాదాలతో తరోడ గ్రామం మార్మోగింది.

పెద్దలు, యువత, మహిళలు, పిల్లలు అందరూ కలిసి ఒకే తాటిపై నడిచి పాల్గొనడం పండుగకు మరింత అందాన్ని తెచ్చింది. ఊరంతా ఒకే వేదికపై ఏకమై పండుగను జరుపుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.తరోడ గ్రామంలో గణేష్ నిమజ్జనం జాతర వాతావరణాన్ని తలపించగా, అందరి ముఖాల్లో ఆనందం, భక్తి, ఉత్సాహంతో ఘనంగా నిర్వహించారు. ఎస్సై బిట్ల పెర్సిస్ ను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.

అంకితభావం తో పనిచేస్తేనే గుర్తింపు 

అంకితభావంతో పనిచేస్తేనే గుర్తింపు 

చిత్రం న్యూస్, బేల: ఉపాధ్యాయ వృత్తిని అంకితభావంతో పనిచేసేవారికి సమాజంలో మంచి  గుర్తింపు వస్తుందని  ఎంపీ గోడo నగేష్ అన్నారు. మండలంలోని మారుతి గూడగిరిజన పాఠశాలలో పనిచేస్తున్న మెస్రం వాసుదేవ్ ఆదివారం ఉద్యోగ విరమణ పొందారు.  స్థానిక గణేష్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఎంపీ హాజరై ఆయన్ను సన్మానించారు. ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుడిగా పని చేస్తూనే ఆదివాసుల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని పేర్కొన్నాడు. ఈ సందర్భంగఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో రాజ్ గోండ్ సేవా సమితి నేతలు మాడవి రాజు, కోరంగే దౌలత్ రావు, చంపెల్లి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు నీలకంఠ, వివిధ పార్టీల నాయకులు,ఆదివాసీ నేతలు, విద్యార్థులు పాల్గొన్నారు.

భారీ వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి

0

శాసనసభ ప్రాంగణంలో మీడియాతో ఎమ్మెల్యే పీ.రామారావు పటేల్

చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా రైతుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వరదలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్ డిమాండ్ చేశారు. ఆదివారం శాసనసభ ప్రాంగణంలో బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. భారీ వర్షాలతో ప్రజలంతా కష్టాల్లో ఉంటే శాసనసభలో నష్టం పై చర్చించకుండా ఇతర బిల్లులపై చర్చించడం ఏంటని ప్రశ్నించారు. ముథోల్ నియోజకవర్గంలో గతంలో ఎన్నడు లేని విధంగా భారీ వరద వచ్చిందని, బాసర జ్ఞాన సరస్వతి క్షేత్రం గోదావరి నది ఉగ్రరూపంతో నిండా మునిగిందన్నారు. నియోజకవర్గంలో 16 గ్రామాలకు పైగా నదీ పరివాహక ప్రాంతాలేనని,  రైతాంగానికి ఎన్నడు లేనంత నష్టం జరిగిందన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో పంట నష్టం జరిగిందని రైతులకు తక్షణమే ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చర్చించి, రైతులకు పరిహారం ఇచ్చే విషయమై ప్రకటించాల్సిందిగా కోరారు. రైతే రాజు అని చెప్పుకునే ప్రభుత్వాలు రైతుల గురించి పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.

బాసర ఆలయ స్పెషల్ ఆఫీసర్ గా అజ్మీరా సంకేత్ కుమార్

0

బాసర ఆలయ స్పెషల్ ఆఫీసర్ గా అజ్మీరా సంకేత్ కుమార్

ఉత్తర్వులు జారీచేసిన నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ 

చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన జ్ఞాన సరస్వతి దేవస్థానం స్పెషల్ ఆఫీసర్ గా అజ్మీరా సంకేత్ కుమార్ ను నియమిస్తూ నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. గతం నుండి ఆలయ ఇంచార్జి ఈఓగా కీసర గుట్ట ఈఓ సుధాకర్ రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. ఇంచార్జి పాలనతో ఆలయ పర్యవేక్షణ లోపంతో  అభివృద్ధిపై ప్రభావం పడింది. పాలన కుడా గాడి తప్పిందన్న విమర్శలు లేకపోలేదు. దీంతో ఆలయ అభివృద్ధి కోసం స్పెషల్ ఆఫీసర్ గా ఐఏఎస్ అధికారిని నియమించాలన్న ప్రతిపాదన చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉండేది. జిల్లా కలెక్టర్ ఈ విషయంలో చొరవ చూపి ఆలయ అభివృద్ధి కోసం భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ ను బాసర ఆలయ స్పెషల్ ఆఫీసర్ గా నియమించారు. దీంతో బాసర ఆలయ అభివృద్ధి పారదర్శకంతో పాటు, ఆలయ ఉద్యోగుల విధి నిర్వహణపై నిఘాతో పాటు భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటారన్న ,అభిప్రాయం స్థానికులు, భక్తులు వ్యక్తం చేశారు. స్పెషల్ ఆఫీసర్ నియామకం పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.

ఆకట్టుకుంటున్న బాలల గణేష్ మండలి వినాయకుడు 

ఆకట్టుకుంటున్న బాలల గణేష్ మండలి వినాయకుడు 

రెడ్డి కాలనీలో సామూహికంగా మహిళల ప్రత్యేక పూజలు

చిత్రం న్యూస్, ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని బాలల గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన విఘ్నేశ్వరుని భారీ ప్రతిమ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రెడ్డి కాలనీలో  ఈ గణనాథుని ప్రతిమ కొలువుదీరింది.  ఆదివారం మహిళలంతా కలిసి సామూహికంగా కుంకుమార్చన  కార్యక్రమం  నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు.

ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకున్నారు. బాలల గణేష్ మండలి వినాయకుడు భక్తుల జయ జయ ధ్వానాల నడుమ విశేషంగా పూజలందుకుంటున్నాడు. భక్తుల పూజలతో మండపంలో ఆధ్యాత్మిక  శోభ సంతరించుకుంది. ప్రతి రోజూ వినాయకుని భజనలు, భక్తి గీతాలను ఆలపిస్తూ రోజుకో కొత్త కార్యక్రమాన్ని నిర్వాహకులు  కొనసాగిస్తున్నారు. దీంతో పండగ వాతావరణం నెలకొంది. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. భారీగా కాలనీవాసులు పాల్గొన్నారు.

బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్  పరామర్శ

బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్  పరామర్శ

చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని తేజాపూర్ మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డిని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరామర్శించారు. మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శనివారo రాత్రి పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకొన్నారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకుని ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. అనంతరం డాక్టర్లతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.

ఆకట్టుకుంటున్న శివశక్తి గణేషుడు

ఆకట్టుకుంటున్న శివశక్తి గణేషుడు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణం కుమార్ పేట్  లోని శివశక్తి మండలి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణేషుని భారీ ప్రతిమ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అశోక్ రోడ్డు పక్కన ఉన్న హనుమాన్ ఆలయ ప్రాంగణంలో ఈ విగ్రహం కొలువుదీరింది. నిత్యం భక్తుల పూజలతో  ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకొంది. సాంప్రదాయ భజనలు, భక్తి గీతాలు, గణేశునికి జై అంటున్నాయి.  శివశక్తి గణేష్ మండల్ కుమార్ పేట్ అధ్యక్షులు కందుల రవీందర్,  ప్రధాన కార్యదర్శులు సోమ తిరుపతి, ,అందే సతీష్ , జెట్టి సృజన్, నిర్వాహకులు కుర్మా దత్తు ,అందే కార్తీక్, మణికంఠ, శివ తదితరులు నిత్యం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

రైతులు యూరియా కోసం పెనుగులాట

రైతు సేవా కేంద్రం వద్ద తోపులాట

ముగ్గురు రైతులకు స్వల్ప గాయాలు

చిత్రం న్యూస్,పెద్దాపురం: కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం ఉలిమేశ్వరంలో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. యూరియా కోసం పెనుగులాట, రైతు సేవా కేంద్రం వద్ద రైతుల మధ్య తోపులాట శనివారము ఉలిమేశ్వరంలో జరిగింది. ఈ ఘటన స్థలంలో ముగ్గురు రైతులకు స్వల్ప గాయాలయ్యాయి .పెద్దాపురం మండలం ఆర్ బీ పట్నం సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. వ్యవసాయ అధికారులు, అధికారులు స్పందించి యూరియా రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలని కోరుతున్నారు.

శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నదానం

శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నదానం

చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లా  జైనథ్ మండలం కూర గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం రోజున అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు గుడిపాటి రామాంజనేయులు మట్లాడుతూ.. కూర శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రతి శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు స్వామి వారి మహాహారతి అయిన తరువాత అన్నదానం {అన్న ప్రసాద} వితరణ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు, భక్తులు సహకారం అందించి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు గుడిపాటి రామాంజనేయులుతో పాటు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు ఏనుగు రాకేష్ రెడ్డి, జక్కుల దశరథ్ తదితరులు పాల్గొన్నారు.