Home Blog Page 72

టిప్పర్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. మంటల్లో 10 మంది సజీవదహనం

0

చిత్రం న్యూస్, మార్కాపురం: ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం (మార్కాపురం) జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు.

వివరాల్లోక వెళితే.. రాయవరం సమీపంలోని క్వారీల వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, టిప్పర్ ఎదురెదురుగా ఢీకొనడంతో భారీ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాల్లోనూ ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో, బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులు బయటకు రాలేక సజీవదహనమయ్యారు.

క్షణాల్లోనే అంటుకున్న మంటలు

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా పామూరు వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, రాయవరం క్వారీల వద్ద వేగంగా వస్తున్న టిప్పర్‌ను బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న ధాటికి డీజిల్ ట్యాంక్ పగిలిపోవడంతో క్షణాల్లోనే మంటలు రెండు వాహనాలకు వ్యాపించాయి. మంటల తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే, ప్రయాణికులు తమ సీట్ల నుండి లేచి బయటకు వచ్చే లోపే బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో ఉలిక్కిపడ్డారు. కొందరు కిటికీలు పగులగొట్టుకుని ప్రాణాలతో బయటపడగా, లోపల చిక్కుకుపోయిన 10 మంది అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలు పూర్తిగా గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో వారిని గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది

సీతారాముల కల్యాణ మహోత్సవ ఏర్పాట్లు పరిశీలించిన ఆత్రం సుగుణ

0

చిత్రం న్యూస్, కుమురం భీం ఆసిఫాబాద్: పట్టణంలోని జన్కాపూర్ శ్రీ కోదండ రామాలయంలో ఈనెల 27న నిర్వహించనున్న సీతారాముల కల్యాణ మహోత్సవానికి సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ పరిశీలించారు. ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులతో కలిసి కార్యక్రమ స్థలాన్ని సందర్శించి, జరుగుతున్న ఏర్పాట్లపై వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై కమిటీ సభ్యులతో చర్చించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని సూచించారు. కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కొండ భారతి,కార్తీక్, వినోద్, నాయకులు జావిద్, తారిక్ బాయ్,ఆసిఫ్, చందు, భీం రావ్, శైలు, సాయి, రాము,తాజ్,తదితరులు పాల్గొన్నారు.

రైతుల సమస్యలు పరిష్కరించండి: కలెక్టర్ రాజర్షి షాకు వినతి

0

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: జిల్లాలోని రైతులు ఎదుర్కొంటున్న సాగు సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ జడ్పీ మాజీ చైర్ పర్సన్  చిట్యాల సుహాసిని రెడ్డి జిల్లా కలెక్టర్ రాజర్షి షాకు వినతిపత్రం సమర్పించారు. ఎకరాకు వస్తున్న 10-12 క్వింటాళ్ల దిగుబడికి అనుగుణంగా, ప్రస్తుతం ఉన్న 7 క్వింటాళ్ల కొనుగోలు పరిమితిని 10 క్వింటాళ్లకు, మార్కెట్‌కు రానున్న జొన్న, మొక్కజొన్న పంటల కోసం ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు.అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు బీమా పథకం అమలు చేయాలని, గత ఖరీఫ్ సీజన్ బాకీలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గోదాముల కొరత వల్ల రైతులు పంటను నిల్వ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు న్యాయం చేయాలని వారు కోరారు.

రాష్ట్ర నాయకత్వంపై పరోక్ష వ్యాఖ్యలు చేసిన జీవన్ రెడ్డి

0

చిత్రం న్యూస్, తెలంగాణ డెస్క్: రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ అంటూ రాజ్యాంగ విలువలను ముందుకు తీసుకెళ్తుంటే ఇక్కడ మాత్రం ఆ విలువలు కనిపించడం లేదు” అని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పార్టీలో అంతర్గత విభేదాలను బహిర్గతం చేసినట్లయ్యాయి.ఎమ్మెల్యే సంజయ్ వ్యవహారంపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. “ప్రభుత్వంతో సమన్వయం వేరు… కానీ పార్టీ వ్యవహారాల్లో జోక్యం ఎందుకు?” అని ప్రశ్నించారు.పార్టీ వ్యవస్థను దెబ్బతీసే చర్యలుజరుగుతున్నాయని పరోక్షంగా విమర్శించారు.తన అనుచరుడి హత్య జరిగిన సమయంలో కూడా ముఖ్యమంత్రి స్పందించకపోవడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆరోపించారు.”ఓపికకు కూడా హద్దు ఉంటుంది… గత 20 నెలలుగా ఎన్నో అవమానాలను భరిస్తూ వచ్చాను” అంటూ తీవ్ర మనోవేదన వ్యక్తం చేశారు.చివరగా, “గౌరవం లేని చోట ఎలా పని చేయగలం?” అని ప్రశ్నిస్తూ పార్టీకి గుడ్‌బై చెప్పారు. అయితే పార్టీని వీడినా ఇందిరా గాంధీ ఆశయాలను గౌరవిస్తూ ప్రజా సేవలో కొనసాగుతానని స్పష్టం చేశారు.జీవన్ రెడ్డి రాజీనామాతో జగిత్యాల జిల్లా కాంగ్రెస్‌లో గంభీర ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఆయన వెంట పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వెళ్లే అవకాశముండగా ఆయన తదుపరి రాజకీయ అడుగు ఏంటన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర అంశంగా మారింది.

కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి

0

*నాలుగు దశబ్దాల అనుబంధానికి ముగింపు

*జగిత్యాల రాజకీయాల్లో సంచలనం

చిత్రం న్యూస్, జగిత్యాల: జగిత్యాల జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.పార్టీకి దశాబ్దాలుగా కట్టుబడి పనిచేసిన మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.అభిమానులు, అనుచరులు, స్థానిక నాయకుల సమక్షంలో చేసిన ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.సుదీర్ఘ రాజకీయ ప్రయాణం, పార్టీతో అనుబంధం, కార్యకర్తల మద్దతు ఈ మూడు అంశాల మధ్యనే తన నిర్ణయం తీసుకున్నానని జీవన్ రెడ్డి తెలిపారు. సభలో మాట్లాడుతూనే పలుమార్లు భావోద్వేగానికి లోనైన ఆయన “నాలుగు దశాబ్దాలుగా పార్టీ కోసంఅహర్నిశలు శ్రమించాను… కానీ నాకు దక్కింది అవమానమే” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.పార్టీ ప్రస్తుత దిశపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడం ఎందుకని ప్రశ్నించారు. ఈ చర్యల వల్ల కష్టపడి పనిచేసిన అసలు కాంగ్రెస్ కార్యకర్తలే నిరుత్సాహానికి గురవుతున్నారని వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయింపులు మంచివి కాదని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని గుర్తుచేశారు.జగిత్యాల రాజకీయ పరిణామాలపై కూడా ఆయన ఘాటు విమర్శలు చేశారు. స్థానిక కార్యకర్తల అభిప్రాయాలను పక్కనబెట్టి జగిత్యాల ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకోవడం బాధాకరమని దీంతో స్థానిక నేతల మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.

ఆత్రం సమ్మక్క కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేసిన సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు

0

చిత్రం న్యూస్, పెంచికల్ పేట్: మండలంలోని కొండపల్లి గ్రామంలో ఇటీవల హత్యకు గురైన ఆత్రం సమ్మక్క కుటుంబాన్ని సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు పరామర్శించారు.ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిందితులు ఎవరినీ వదిలిపెట్టేది లేదని ఇప్పటికే ఒక వ్యక్తిని రిమాండ్ చేయడం జరిగిందని, ఈ హత్యలో పాత్ర ఉన్నావారందరిని చట్టం ముందు నిలబెడుతామని తెలిపారు. సమ్మక్క కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని, వారికి ఇందిరమ్మ ఇళ్లు కూడా మంజూరు చేస్తామని తెలిపారు.గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలను పెంచుకొని జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కుకిడే రాజేశ్వర్, సర్పంచ్లు అన్నం గణపతి, చప్పిడి రవీందర్, భాజపా నాయకులు ఘనపురం నగేష్, సిరిపురం భీమయ్య, అనంత్ రావు, కారు చంద్రు, రౌతు భుజంగ్ రావు, అలిశెట్టి ప్రసాద్, పళ్లెం పురుషోత్తం, బందరికంటి శేఖర్, ప్రభాకర్, రమేష్, బద్ధి శంకర్ గ్రామస్తులు పాల్గొన్నారు.

శనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు

0

చిత్రం న్యూస్, కాగజ్ నగర్:  పట్టణంలోని బీట్ మార్కెట్లో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో నిర్వహించే శనగల కొనుగోలు కేంద్రాన్ని సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.దహెగాం మండలం కర్జి, గిరివెల్లి ప్రాంతాల్లో దాదాపు వెయ్యి క్వింటాళ్ల శనగల ఉత్పత్తి జరిగిందని, రైతుల ద్వారా తెలుసుకొని తాను మార్క్ ఫెడ్ అధికారులతో మాట్లాడి శనగల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయించడం జరిగిందన్నారు.శనగలు పండించిన రైతులు ఈ కొనుగోలు కేంద్రాన్ని ఉపయోగించుకుని పూర్తి మద్దతు ధర పొందాలని కోరారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జిల్లా అధికారి వెంకటి, మార్కెట్ కమిటి చైర్మన్ సిద్ధల దేవయ్య, జిల్లా మార్కెటింగ్ అధికారి అష్ఫాక్, ఏడిఏ మనోహర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ సామ్యూల్, మండల వ్యవసాయ శాఖ అధికారులు ప్రేమలత, కార్తీష, ఏఈఓలు దుర్గా భవానీ, సృజన, శ్రీనివాస్, పీఏసీఎస్ కార్యదర్శి సతీష్ గౌడ్ రైతులు పాల్గొన్నారు.

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో వేమిరెడ్డి దంపతుల భేటీ

0

చిత్రం న్యూస్ నెల్లూరు: నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఢిల్లీలోని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో కేంద్ర హోం మంత్రి అమీత్ షా గారిని కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి.. వేమిరెడ్డి దంపతులను ఆప్యాయంగా పలకరించారు. పెన్నా నది కరకట్టల బలోపేతం మరియు చారిత్రక పినాకిని సత్యాగ్రహ ఆశ్రమ పరిరక్షణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక అందచేశారు. 2021 నవంబర్ నెలలో సోమశిల జలాశయం నుండి వరద నీరు పెన్నా నదిలోనికి విడుదల చేయడంతో కోవూరు నియోజకవర్గంలోని పెన్నా పొర్లు కట్టలు తెగిపోయి , బుచ్చిరెడ్డిపాలెం, కోవూరు, ఇందుకూరుపేట, విడవలూరు మండలాలు పూర్తిగా జలమయమయమై జనజీవనం స్తంభించిపోయిన సంఘటనలను వేమిరెడ్డి దంపతులు హోం మంత్రి అమిత్ షాకు వివరించారు.

నిజామాబాద్ జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత లేదు 

0

చిత్రం న్యూస్, నిజామాబాద్: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి సత్య స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వదంతుల కారణంగా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.ఒకేసారి పెద్ద సంఖ్యలో పెట్రోల్ బంకులకు వెళ్లి వాహనాలలో ఫుల్ ట్యాంక్ నింపుకోవడం వల్ల అనవసర రద్దీ అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకులో సరిపడా ఇందన నిల్వలు ఉన్నాయని సరఫరా కూడా నిరంతరంగా కొనసాగుతుందని పేర్కొన్నారు.  ప్రజలు అవసరానికి మించి ఇంధనం నిలువ చేసుకోవద్దని సూచించారు. అలా చేయడం వల్ల ఇతరులకు అసౌకర్యం కలుగుతుందని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మకూడదని, నిర్ధారించని సమాచారాన్ని షేర్బుమ్ చేయడం ద్వారా గందరగోళం సృష్టించవద్దని పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.  జిల్లాలో శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని వదంతులు వ్యాప్తి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే చర్యలు చేపడితే సంబంధించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు.

టమాటా ధరల పతనం: రైతుల ఆందోళన

0

చిత్రం న్యూస్, తానూర్ : గత ఏడాది టమాటా ధరలు ఆకాశాన్నంటడంతో ఈ సీజన్ లో అధిక విస్తీర్ణంలో సాగు చేసిన రైతులు, ప్రస్తుతం ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కూలీ ఖర్చులను కూడా భరించలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు.

నిర్మల్ జిల్లా తానూర్ మండలంలో ఈ ఏడాది టమాటా సాగు గణనీయంగా పెరిగింది. అధిక ధరల అంచనాతో రైతులు పెట్టుబడులు పెంచారు. అయితే, పంట చేతికొచ్చే సమయానికి మార్కెట్లో ధరలు గణనీయంగా పడిపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత ధరలతో పెట్టుబడి ఖర్చులు, కూలీల వేతనాలు కూడా చెల్లించడం కష్టంగా మారిందని రైతులు తెలిపారు. గత ఏడాది లాభాలు చూసి ఈ ఏడాది సాగు చేసిన తమకు, ఇప్పుడు తీవ్ర నిరాశ ఎదురైందని పేర్కొన్నారు.

నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని, వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. సరైన మద్దతు ధర లేకపోతే భవిష్యత్తులో టమాటా సాగుపైనే కాకుండా, ఇతర పంటల సాగుపై కూడా ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయమై స్థానిక అధికారులు స్పందించి, రైతులకు అండగా నిలవాలని, మార్కెట్ లో ధరల స్థిరీకరణకు కృషి చేయాలని కోరుతున్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.