Home Blog Page 71

మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి  పరామర్శ 

0

మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల చారి  పరామర్శ 

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం ధర్మోరా గ్రామానికి చెందిన మా అమ్మ నాన్న ఫౌండేషన్ ఛైర్మన్ యం.ఆంజనేయులు మాతృమూర్తి  గంగుబాయి అనారోగ్యంతో 4 రోజుల క్రితం  మృతిచెందింది. విషయం తెలుసుకున్న కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల చారి  దర్మోరలో ఆంజనేయులు మాతృ మూర్తి చిత్రపటానికి నివాళులర్పించారు.  మృతికి గల కారణాలను ఆంజనేయులును అడిగి తెలుసుకున్నారు. దైర్యం చెప్పారు. వారి వెంట ముథోల్ ఆత్మ ఛైర్మన్ గన్ను నర్సారెడ్డి,PACS చైర్మన్ రత్నాకర్ రావు, లోకేశ్వరం మండల మాజీ ఎంపీపీ మామిడి నారాయణ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ లోకేశ్వరం మండల అధ్యక్షులు శ్రీ గడ్డం సుదర్శన్ రెడ్డి, ముథోల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రావుల గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ యూత్ అద్యక్షులు షఫీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు రావుల శ్రీనివాస్,  ఆర్ష ప్రసాద్  తదితరులు ఉన్నారు.

గణేష్ నిమజ్జోత్సవానికి సర్వం సిద్ధం

0

బాసరలో ముమ్మరంగా కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులు 

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో గురువారం నిమజ్జనోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాట్లుచేశారు. నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక బాసర గోదావరి ఏర్పాట్లను గ్రామపంచాయతీ ఈవో ప్రసాద్ గౌడ్ పరిశీలించారు. అదేవిధంగా ప్రధాన రహదారులపై ఏర్పడ్డ గుంతలలో మొరం సైతం వేయించారు. బాసర పరిసరాల్లో పారిశుద్ధ్య సిబ్బంది చెత్తను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. గోదావరికి వెళ్లే రహదారుల్లో, ఆలయ పరిసర ప్రాంతాల్లో పడేసిన చెత్తను ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు.

దుర్వాసన రాకుండా, వ్యాధులు ప్రభలకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. దోమలు వృద్ధి చెందకుండా రాత్రి వేళలో దోమల మందు పిచికారి చేస్తున్నారు.  సేకరించిన చెత్తను ఎప్పటికప్పడు ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. గ్రామపంచాయతీ సిబ్బంది పనితీరును ప్రశంసిస్తున్న గ్రామస్తులు, వినాయక నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వాహకులకు పలు సలహాలు, సూచనలు చేశారు.  ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు గట్టి బందోబస్తును నిర్వహిస్తున్నారు. నిమజ్జనోత్సవ వేడుకలు ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

మాధవపట్నం  సందర్శించిన కాకినాడ జిల్లా  పంచాయతీ అధికారి రవి కుమార్

0

మాధవపట్నం  సందర్శించిన కాకినాడ జిల్లా  పంచాయతీ అధికారి రవి కుమార్

చిత్రం న్యూస్ ,సామర్లకోట : కాకినాడ జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్ మంగళవారం మాధవపట్నం  సందర్శించారు. SWPC ,IVRS కాల్స్ క్లోరినేషన్ రిపోర్ట్స్ ముఖ్యంగా సమిత్వ పై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో ఎం.భైరవమూర్తి, పంచాయతీ కార్యదర్శి టి.సత్యనారాయణ, ఇంజనీరింగ్ అసిస్టెంట్, DPRC టీం రాజా పాల్గొన్నారు.

ముథోల్‌లో ఘనంగా గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ప్రారంభం

0

ముథోల్‌లో ఘనంగా గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ప్రారంభం

*పూజ చేసి ప్రారంభించిన జిల్లా ఎస్పీ జానకీ షర్మిల

చిత్రం న్యూస్, ముథోల్‌: నిర్మల్ జిల్లా ముథోల్ పట్టణంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. శోభాయాత్రకు ప్రత్యేక ఆకర్షణగా సాంస్కృతిక ప్రదర్శనలు, డీజే  చప్పుళ్ళు, భక్తిగీతాలు ఉత్సవ వాతావరణాన్ని అలరించాయి. ఈ సందర్భంగా ఎస్పీ జానకీ షర్మిల, ఏఎస్పీ అవినాష్ కుమార్ గణనాథుడికి ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్రకు శ్రీకారం చుట్టారు. పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిర్వాహకులు సమయానికి నిమజ్జనం పూర్తి చేసి, పోలీసులు సూచించిన మార్గదర్శకాలకు సహకరించాలని ఎస్పీ కోరారు. కార్యక్రమంలో సీఐ మల్లేష్, ఎస్సై పెర్సిస్ బిట్ల, గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు, భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి

0

ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి

చిత్రం న్యూస్,బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ డిమాండ్‌ చేశారు. సోమవారం బేల మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో నిర్వహించిన ఆశా వర్కర్ల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని తెలిపారు. ఆశా వర్కర్లకు కనీస వేతనాన్ని రూ.18 వేలుగా నిర్ణయించి, ఉద్యోగ భద్రత కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పోచన్న, ఆశవర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి 

0

ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి 

చిత్రం న్యూస్, నేరడిగొండ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు ప్రజా జీవితాల్లో అమూల్యమైన మార్పులు తీసుకొచ్చాయని ఆడే గజేందర్ పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ,, ఉచిత విద్యుత్, జలయజ్ఞం, ఫీజు రీంబర్స్మెంట్ ఇలా ఎన్నో పథకాలతో, బడీడు పిల్లల నుండి పండు ముసలివారి వరకు సంక్షేమ సారధిగా పేదల ఎదుగుదలకు బాటలు వేసిన మహనీయుడు దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి అని, ఆయన భౌతికంగా మనకు దూరం ఉన్నా, వారి పథకాల ద్వారా లబ్ది పొందిన ప్రతి ఒక్కరి చిరునవ్వులో ఎప్పటికి కలకాలం నిలిచి ఉంటారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఏలేటి రాజశేఖర్ రెడ్డి, బోథ్ మాజీ ఎంపీటీసీ కుర్మా మహేందర్, ఇచ్చోడ మాజీ ఎంపీటీసీ జాహిద్, సీనియర్ నాయకులు బొజ్జా సాయన్న, ఆసిఫ్ ఖాన్, మురళి గౌడ్, రమేష్, భీమరాజ్ గౌడ్, యండి సద్దాం, మౌలానా, కేవల్, శ్రీనివాస్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ 

0

 బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ 

చిత్రం న్యూస్, నేరడిగొండ: BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  పిలుపు మేరకు బోథ్ ఎమ్మెల్యే శ్రీ అనిల్ జాదవ్ ఆదేశాల మేరకు  మంగళవారం  నేరడిగొండ మండల కేంద్రంలో BRS పార్టీ మండల కన్వీనర్ శివ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. కాళేశ్వరం అచ్చా హై అనే నినాదంతో  నేరడిగొండ మండలం దద్దరిల్లింది.   అనంతరం మండల కన్వీనర్ శివ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కాలేశ్వరం ప్రాజెక్టుపై విష ప్రచారం మానేసుకుని నిజాలు ఒప్పుకోవాలి అని అన్నారు. ఏదైతే జస్టిస్ ఘోష్ రిపోర్టు మొత్తం తప్పుల తడకగా ఉంది. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి ఒక వర ప్రదాయిని అని అన్నారు. మా నాయకుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కావాలనే బురద జల్లడానికే అసెంబ్లీ పెట్టారు. కానీ ప్రజలకు వరదల పట్ల ఈ ప్రభుత్వం ఏ మాత్రం భరోసా కల్పించలేదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, పార్టీ నాయకులు సాబ్లె సంతోష్.మాజీ జడ్పీటీసీ డాక్టర్ జహీర్, వైస్ ఎంపీపీ మహేందర్ రెడ్డి, VDC అధ్యక్షులు రవీందర్ రెడ్డి, అనిల్ అన్న యువ సైన్యం అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి, పాక్స్ చైర్మన్ సాబ్లే నానక్ సింగ్ ,ప్రతాప్ సింగ్, గులాబ్ సింగ్, EX MPTC రవీందర్, గోపు అనిల్ యాదవ్ ,విశాల్, ఆడేళ్ళు, లక్ష్మన్, బాబులాల్, శ్రీకాంత్ రెడ్డి, శ్రీకాంత్, రాజశేఖర్, శ్రీను, విలాస్, పాండు, రాజు యాదవ్, సుజిల్ జాదవ్, ఆడే కైలాష్, బంసి తదితరులు పాల్గొన్నారు.

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత వైఎస్ఆర్ 

0

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత వైఎస్ఆర్ 

మాజీ సీఎం వైఎస్ఆర్ సేవలు ఎన్నటికీ మరువలేనివి – బోరంచు శ్రీకాంత్ రెడ్డి

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ మహానేత వైఎస్  చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆనాడు అయన చేసిన సేవలను కొనియాడుతూ నినాదాలు చేశారు. అనంతరం బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. సంక్షేమానికి కొత్త నిర్వచనం ఇచ్చి, పేదవాడి జీవితానికి భరోసా ఇచ్చి తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని సంతకం చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సేవలు ఎన్నటికీ మరువలేనివని అన్నారు. ఆయన పాలనలో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ సరఫరా, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం, ఇందిరమ్మ గృహాలు వంటి పథకాలు ఆనాడు సమాజంలో సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ఒక బలమైన పునాది వేశాయని గుర్తుచేశారు. రైతు కోసం, పేదల కోసం, విద్యార్థుల కోసం జీవితాన్ని అంకితం చేసిన నాయకుడన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు ఉచిత వైద్య సేవలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా అనేక మంది నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చిందన్నారు. ఈ పథకాలు ఆయన ప్రజల పట్ల ఉన్న నిబద్ధతకు, సామాజిక న్యాయం పట్ల ఆయన దృష్టికి నిదర్శనమన్నారు. ఆయన ఆశయాలను నెరవేర్చడానికి మనం అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మావల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్, మాజీ వైస్ ఎంపీపీ అట్ల గోవర్ధన్ రెడ్డి, NSUI మండల అధ్యక్షులు మర్సకోళ్ల గౌతం, sk అలీమ్, సమీ ఉల్లా ఖాన్, md ఆఫ్సర్, మోర్తుజా, md వసీం, రెండ్ల రాజన్న, దేవాజీ, రహీమ్, sk అజిజ్, సంటెన్న , ప్రశాంత్, అక్షయ్, దినేష్, ప్రేమ్, దినేష్, అఫ్సర్ ఖాన్, అజిమ్ ఖాన్, రాకేష్, తరుణ్, శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు.

EX CM KCR- మాజీ సీఎం కేసీఆర్ ను బద్నాం చేసేందుకే  సీబీఐ ఎంక్వైరీ

0

 EX CM KCR- మాజీ సీఎం కేసీఆర్ ను బద్నాం చేసేందుకే  సీబీఐ ఎంక్వైరీ

*కాళేశ్వరంపై కాంగ్రెస్, బీజేపీల పొలిటికల్ డ్రామా

చిత్రం న్యూస్, భోరజ్  పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర రిపోర్ట్, మా సిల్వర్ జూబ్లీ అప్పుడు ఫైనల్ రిపోర్ట్, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు వచ్చేసరికి ఘోష్ రిపోర్ట్..ఇదంతా పొలిటికల్ డ్రామా అని సర్పంచుల సంఘం మాజీ మండల అధ్యక్షుడు మద్దుల ఊశన్న అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నేతలతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్, బీజేపీలు కలిసి NDSA రావడం నుంచి ఘోష్  కమిషన్  ఏర్పాటు, దాని డొల్ల రిపోర్టు, నిన్న అసెంబ్లీలో చర్చ, చివరికి సీబీఐ ఎంక్వైరీ వరకు ఇవన్నీ కూడా కేసీఆర్, కాళేశ్వరం, బీఆర్ఎస్ ను బద్నామ్ చేసే కుట్ర అని తేలిపోయిందన్నారు. సీబీఐ అంటే కాంగ్రెస్, బీజేపీ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్ గా మారిపోయిందని ఎద్దేవా చేశారు.

సీబీఐ, ఈడీలతో దేశ రాజకీయాల్లో  అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఉన్నదని పేర్కొన్నారు. ఎన్నికలు వస్తున్నాయంటే సిబీఐ, ఈడీ లతో దాడులు చేస్తూ రాజకీయ లబ్ది పొందుతున్నారని విమర్శించారు.  సీబీఐని వాడుకొని కేసీఆర్ ను బద్నాం చేసి కాళేశ్వరాన్ని విఫలయత్నంగా చూపించే ప్రయత్నం చేసున్నారని, ఆంధ్రా, బనకచర్లకు లైన్ క్లియర్ చేసేందుకు ప్రధాని, తెలుగు రాష్ట్రాల సీఎంలు  కలిసి పన్నిన పన్నాగం అని తేలిపోయిందన్నారు.  అపర భగీరథుడు  మాజీ సీఎం కేసీఆర్, కాళేశ్వరంపై విష ప్రచారం చేసి..ప్రాజెక్టును శాశ్వతంగా మూసివేసి గోదావరి నదీ జలాలను ఆంధ్రకు తరలించేందుకు రేవంత్‌ రెడ్డి చేస్తున్న కుట్ర అని అన్నారు. మీరెన్ని కక్ష రాజకీయాలు చేసినా ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్పడం ఖాయమని జోస్యం చెప్పారు

తర్నం బ్రిడ్జిని నిర్మించండి _ఏఎంసీ మాజీ  వైస్ ఛైర్మన్ వేణుగోపాల్ యాదవ్  

0

 తర్నం బ్రిడ్జిని నిర్మించండి _ఏఎంసీ మాజీ  వైస్ ఛైర్మన్ వేణుగోపాల్ యాదవ్

 చిత్రం న్యూస్, భోరజ్ :ఆదిలాబాద్ జిల్లా భోరజ్  మండలంలోని  తర్నం బ్రిడ్జిని నిర్మించకపోవడంతో 353బీ జాతీయ రహదారిపై వెల్లె ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని బీఆర్ఎస్ మండల నాయకులు మంగళవారం నిరసన తెలిపారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ ఛైర్మన్ వేణుగోపాల్ యాదవ్ మాట్లాడుతూ.. కొద్దిపాటి వర్షానికి నూతనంగా నిర్మించిన వంతెనపై వరద నీరు ప్రవహిస్తోందన్నారు. దీంతో తెలంగాణ_ మహారాష్ట్ర ప్రజలకు రాకపోకలు నిలిచి ఇబ్బందులకు గురవుతున్నారని, భారీ వాహనాలు గంటల తరబడి వేచి ఉంటున్నాయని అన్నారు. బైకులు సైతం వెళ్ళలేని పరిస్థితి ఏర్పడిందని, వెంటనే బ్రిడ్జిని నిర్మించాలని డిమాండ్ చేశారు. బ్రిడ్జి మీదుగా వెళ్లాల్సిన ప్రజలు ఆదిలాబాద్ రూరల్ మండలం లాండసాంగ్వి మీదుగా  తిరిగి వెళ్లాల్సి వస్తుందని, గతంలో ఉన్న పాత బ్రిడ్జిని కూల్చేసి మరింత ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు, బ్రిడ్జి పేరును వాడుకొని అధికారంలోకి వచ్చిన నాయకులు ఇప్పటికైనా కొత్త బ్రిడ్జిని నిర్మించాలని భోరజ్ మండల నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ పురుషోత్తం, సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు ఊ షన్న, జైనథ్ ఏఎంసీ మాజీ చైర్మన్ ప్రభాకర్, మాజీ డైరెక్టర్ సతీష్, మాజీ ఎంపీటీసీలు మహేందర్, కోల భోజన్న, బీఆర్ఎస్ నాయకులు అశోక్ రెడ్డి, రవి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.