Home Blog Page 70

వేద భారతి పీఠం ఆధ్వరంలో గోహారతి పూజ 

0

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర వేదభారతి పీఠం ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ వేద విద్యానంద స్వామీజీ సహకారంతో శనివారం రోజు సాయంత్రం గోపూజ, రుద్రాభిషేకం, త్రినాథ వ్రతం, గోహారతి పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. గోమాత అనుగ్రహంతో ఋణ బాధలు, సకల దోషాలు తొలగిపోయి, సత్సంతాన ప్రాప్తి, శీఘ్ర కళ్యాణం, అష్టైశ్వర్యాలు లభిస్తాయని వైదిక బృందం వెల్లడించారు.కార్యక్రమంలో పుర ప్రముఖులు, గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గోవులకు గోహారతులు ఇచ్చారు. అనంతరం, ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.

 

జీవ వైవిధ్య పరిరక్షణకు పరిశోధనలు కొనసాగాలి 

0

చిత్రం న్యూస్, బేల: ఇటీవల మహారాష్ట్ర, తెలంగాణ మొక్కల మధ్య సంబంధాలు, జీవ వైవిధ్యం మొదలైనవి వివరిస్తూ మహారాష్ట్ర నుండి డా సారిక నందకిశోర్ సంగెకర్ తెలంగాణ నుండి డా.వేముగంటి వరప్రసాద్ రావు రచించిన గ్రంథం ఎంతో స్ఫూర్తి దాయకమని మహారాష్ట్రలో ఒక సదస్సులో  డా. బాబా సాహెబ్ అంబేద్కర్ యూనివర్సిటీ పరిధిలోని శ్రీ యోగీశ్వరి మహావిద్యాలయ్ లో సీనియర్లు అభినందించారు. ఇది చాలా మంచి గ్రంథము అని భవిష్యత్తులో ఇంకా వీరు పరిశోధనలు కొనసాగించి జీవవైవిధ్య పరిరక్షణకు ముందుకుపోవాలన్నారు. ఈ కార్యక్రమంలో యోగేశ్వరి ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బర్దాపుర్కర్, వైస్ ప్రెసిడెంట్ జి.బి.వ్యాసుడు, డైరెక్టర్ అడ్వా కళ్యాణి విరాధే,, కార్యదర్శి కమలాకర్ చౌసల్కర్, జాయింట్ సెక్రటరీ భీమశంకర్ శేతే,  కళాశాల ఇంచార్జి L. K. గోలెగావ్కర్, ప్రిన్సిపాల్ డా. M.V. కనెట్కర్, వైస్ ప్రిన్సిపాల్ డా. R.V. కులకర్ణి, కార్యాలయ సూపరింటెండెంట్ అజయ్ చౌదరి పాల్గొన్నారు.

జైనథ్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో గిమ్మ సంతోష్ రావు దంపతుల పూజలు 

0

చిత్రం న్యూస్,జైనథ్:ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలోని చారిత్రాత్మక శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో శనివారం ఆదిలాబాద్ నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ రావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆలయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించారు. లోకకళ్యాణార్థం  నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ వ్రతాన్ని నిర్వహించినట్లు వారు తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ మాజీ చైర్మన్ అడ్డి రూకేష్ రెడ్డి  గిమ్మ సంతోష్ రావు దంపతులను శాలువాతో ఘనంగా సన్మానించి, తీర్థప్రసాదాలు అందజేశారు.

మంచాల పోతన్న చిత్రపటానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నేత లోక ప్రవీణ్ రెడ్డి 

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంచాల పోతన్న పెద్దకర్మ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు లోక ప్రవీణ్ రెడ్డి, డేరా కృష్ణారెడ్డి హాజరయ్యారు. శుక్రవారం ఆదిలాబాద్ రూరల్ మండలం అనుకుంట గ్రామంలోని స్వగృహనికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయనతో అనుబంధంగా ఉన్న రోజులను గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.

ఉచితంగా పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

0

ఉచితంగా పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండల కీర్గుల్ (కె ) గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను అందజేస్తుందని సర్పంచ్ మలేగాం మధు ప్రీతి అన్నారు. శనివారం మండలంలోని కీర్గుల్ కె గ్రామంలో సర్పంచ్, పశువైద్యాధికారి డాక్టర్ రాజేష్, డాక్టర్ వినాయక రావు, డాక్టర్ శివకుమార్ లు పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గాలికుంటు వ్యాధి పశువులకు వేగంగా వ్యాప్తి జరుగుతుందన్నారు. ప్రతి రైతు తప్పనిసరిగా పశువులకు టీకాలు వేయించాలని సూచించారు. టీకాలు వేయించుకోకపోతే పాల ఉత్పత్తి శాతం తగ్గిపోవడం తో పాటు పశువులు తినలేక బలహీనంగా మారుతాయన్నారు. దీంతో గ్రామంలో సుమారు 200 పైగా పశువులకు వ్యాధి నివారణ టీకాలను వేయడం జరిగిందని పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో, ఉప సర్పంచ్ కోప్లే నాగనాథ్, రైతులు, పశు వైద్య సిబ్బంది ఉన్నారు.

రైతుల భ‌రోసా నిధుల విడుద‌ల‌తో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల హ‌ర్షం

0

సీఎం, మంత్రుల ఫ్లెక్సీల‌కు ఆత్రం సుగుణ పాలాభిషేకం

చిత్రం న్యూస్, ఆసిఫాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను విడుదల చేయడంతో రైతులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ తెలిపారు. శుక్రవారం డీసీసీ కార్యాలయం ఆవరణలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఇరుకుల మంగ, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ అబ్దుల్లతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చిత్రాలతో ఉన్న ఫ్లెక్సీకి సుగుణ పాలాభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా సుగుణ  మాట్లాడుతూ..రైతు భరోసా నిధుల విడుదలతో రాష్ట్రంలోని రైతుల్లో ఆనంద వాతావరణం నెలకొన్నదన్నారు. ప్రజా పాలనలో భాగంగా ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, రైతు భరోసా పథకం ద్వారా రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నదని పేర్కొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది అన్నదాతల ఖాతాల్లో నిధులు జమ కావడం ప్రభుత్వ రైతు అనుకూల విధానాలకు నిదర్శనమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేష్, జిల్లా ఉపాధ్యక్షులు తారిఖ్,భీమ్ రావ్,కౌన్సిలర్ వినోద్,RGPRS ఇంచార్జి కోవా ఇందిరా,సిడాం తిరుపతి మాజీ ఎంపీటీసీ,నాయకులు పెందొర్ సుధాకర్, ఇమ్రాన్, నిజం,ఆత్రం భీం రావ్,హరీష్, రాము,AMC డైరెక్టర్ జకన్నా,మోహన్, శంకర్,తదితరులు పాల్గొన్నారు.

బాసరలో శ్రీ రామ నవమి సందర్భంగా భారీ శోభాయాత్ర 

0

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో శ్రీ జ్ఞాన సరస్వతి పుణ్యక్షేత్రంలో శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీరాముని ఉత్సవ విగ్రహం శోభాయాత్రలో యువకు ఉత్సాహంగా పాల్గొన్నారు. హరే రామ హరే రామ.. రామ రామ హరే హరే.. జై శ్రీరామ్ అంటూ నినాదాలతో ముందుకు సాగారు. పురవీధుల్లో మహిళలు మంగళ హారతులతో ఘనంగా స్వాగతం పలికారు. శోభాయాత్రలో అంజన్న స్వాములు. వేద పండితులు, గ్రామస్తులు, పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

బేలలో ఘనంగా సీతారాముల కల్యాణ వేడుకలు

0

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేలలో శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం అత్యంత వైభవోపేతంగా, రమణీయంగా జరిగింది. మండల కేంద్రంతో పాటు డోప్ఠాల, మసాల ( బి ) గ్రామాల్లో భక్తుల సమక్షంలో అభిజిత్ లగ్నంలో స్వామివారి కళ్యాణం కన్నుల పండువగా సాగింది.రామయ్య తండ్రి, సీతమ్మ తల్లికి ప్రత్యేక అలంకరణలు, అర్చనలు చేశారు. ఆయా గ్రామాల్లో భక్తుల జయ జయ ద్వానాలతో ఆలయ ప్రాంగణాలు శ్రీరామ నామస్మరణతో  మార్మోగింది..రాముడు పుట్టిన రోజు వేడుక, పట్టాభిషిక్తుడైన వేడుక ఒకే రోజున కావడంతో జన్మోత్సవం, కళ్యాణోత్సవం వేడుకలు నిర్వహిస్తామని పండితులు తెలిపారు. లోకంలో ఎవరికీ లేని 16 సుగుణాలన్నీ ఒక్క శ్రీరాముడికే ఉన్నాయని, ధర్మానికి ప్రతిరూపుడని, ఆయన పాలన రామరాజ్యంగా ప్రజ్వరిల్లిందని పేర్కొన్నారు. అందుకే రాముడిని సకల గుణ సంపన్నుడిగా అభివర్ణిస్తారని కొనియాడారు. భక్తులు స్వామి వారి కల్యాణం తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకటించారు. అనంతరం అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

భోరజ్ శ్రీరామనవమి వేడుకల్లో ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ రావు

0

చిత్రం న్యూస్, భోరజ్: శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భోరజ్ మండల కేంద్రంలోని శ్రీరామాలయంలో ఆదిలాబాద్ నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి కంది శ్రీనివాస రెడ్డి తరుపున విరాళం అందజేశారు. అనంతరం సంతోష్ రావును గ్రామస్థులు శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో రాజా రెడ్డి, శైలేష్ రెడ్డి, ప్రకాష్, వినోద్, శరత్, సాయి, నారాయణ, మల్లన్న, ప్రశాంత్, దర్శనాల అశోక్, కదరపు దేవిదాస్, అరికిల్ల అరవింద్, పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.

రామ మందిర నిర్మాణానికి భూమిపూజ చేసిన ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్

0

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలం కీర్గుల్( కె ) గ్రామంలో శ్రీరామ నవమి ఉత్సవాలు కనుల పండువగా, అంగరంగ వైభవంగా నిర్వహించారు. Mahilaluమంగళ హారతులతో తరలివచ్చారు. భారీ శోభాయాత్రను చేపట్టారు. ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కు గ్రామస్తులు ముందుగా స్వాగతం పలికారు.   రామ మందిరం నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆలయ నిర్మాణానికి వేద పండితులు, వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే శ్రీరామ నవమి రోజు వరకు ఆలయ నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో. సర్పంచ్ మధుప్రీతి, సురేష్,  గ్రామ పెద్దలు సగ్గుల్లా శ్రీనివాస్, బంటు రవి, వివిధ గ్రామాల సర్పంచులు,  మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, గ్రామస్తులు ఉన్నారు. అనంతరం ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.