Home Blog Page 70

గణనాథుడి సేవలో బోరంచు శ్రీకాంత్ రెడ్డి

0

గణనాథుడి సేవలో బోరంచు శ్రీకాంత్ రెడ్డి

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: వినాయక నవరాత్రులను పురస్కరించుకొని ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ ఆవరణలో ప్రతిష్టించిన గణనాథుడిని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచ శ్రీకాంత్ రెడ్డి మంగళవారం రాత్రి దర్శించుకున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం మండప నిర్వాహకులు ఆయనను శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆయన వెంట మావల మాజీ వైస్ ఎంపీపీ అట్ల గోవర్ధన్ రెడ్డి, గణేష్ మండప నిర్వాహకులు సుధాకర్, అభిలాష్ తదితరులు ఉన్నారు.

ఆడే గజేందర్ ని కలిసిన బోథ్ మాల సంఘ సభ్యులు

0

ఆడే గజేందర్ ని కలిసిన బోథ్ మాల సంఘ సభ్యులు

చిత్రం న్యూస్, నేరడిగొండ : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఆడే గజేందర్ ని బోథ్ మాల సంఘ సభ్యులు బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. శ్మశానవాటిక వద్ద రెండు రోజుల్లో బోరు వేయిస్తానని, కమ్యూనిటీ హాల్ కు రూ.5 లక్షలు, శ్మశానవాటికకు సీసీ రోడ్డు త్వరలో మంజూరు చేస్తాననన్నారు. ఏ సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని ఆడే గజేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల సంఘ పట్టణ అధ్యక్షుడు బత్తుల ఉషన్న, మాజీ అధ్యక్షులు బక్కువారి రామయ్య, అర్ష భూమన్న, ఏరోల్లా రమేష్, బక్కువారి నారాయణ, అర్ష రవి, కరుణాకర్, బోథ్ మాజీ ఎంపీటీసీ కుర్మే మహేందర్, సీనియర్ నాయకులు బొజ్జా సాయన్న తదితరులు పాల్గొన్నారు.

భక్తితో పాటు విద్యపై శ్రద్ధ వహించాలి

0

భక్తితో పాటు విద్యపై శ్రద్ధ వహించాలి

*పరుపుల పల్లె వినాయకుని దర్శనం

యువతకు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

_మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్

చిత్రం న్యూస్, సొనాల: ఆదిలాబాద్ జిల్లా సొనాల మండలంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం  మండలంలోని పరుపులపల్లె గ్రామంలోని వినాయకుని మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సహకారంతో  రూ.15 లక్షలతో రోడ్డు,  హైమాస్డ్ లైట్ ఏర్పాటు, సౌండ్ బాక్సులు గ్రామస్తుల కోరిక మేరకు దీపావళి కానుకగా అందజేస్తానన్నారు. యువతీ, యువకులు చదువుపై శ్రద్ధ వహించాలని, చదువే ఆయుధమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచుల  సంఘం అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ భీంరావు పాటిల్, యువ నాయకులు S.K ఆసిఫ్ , జాదవ్ కృష్ణ, తుల హరీష్, ప్రదీప్ నాయక్, రాథోడ్ విక్రమ్, పరుపులపల్లె గ్రామ పటేల్, మహిళలు, యువకులు పాల్గొన్నారు.

ఉద్యోగం సాధించిన సరస్వతి అందరికీ స్ఫూర్తి – ఆడే గజేందర్

0

ఉద్యోగం సాధించిన సరస్వతి అందరికీ స్ఫూర్తి – ఆడే గజేందర్

*BSF (Army)లో ఉద్యోగం సాధించిన రాంనగర్ గ్రామానికి చెందిన సరస్వతిని సన్మానించిన బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్

చిత్రం న్యూస్,బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని రాంనగర్ గ్రామానికి చెందిన బనియా సరస్వతి BSF (Army)లో ఉద్యోగం సాధించినందుకు ఆమెను బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఆడే గజేందర్ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ..బోథ్ నియోజకవర్గంలో సరస్వతిని స్పూర్తిగా తీసుకుని యువతీ, యువకులు ముందుకు వెళ్లాలని, BSFలో ఉద్యోగం సాధించడం గొప్ప విషయం అని అన్నారు.

పంట నష్ట పరిహారం అందజేయాలి

0

పంట నష్ట పరిహారం అందజేయాలి

చిత్రం న్యూస్, నేరడిగొండ : పంట నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం అందజేయాలని  రైతులు కోరారు. గత యాసంగి ఫిబ్రవరిలో కురిసిన అకాల వర్షాల వల్ల 24, 25 తేదీల్లో మొక్కజొన్న నువ్వులు, జొన్న పంట గాలివానకు నేల మట్టం కాగా నేరడిగొండ వ్యవసాయ అధికారిణి( AO)  కృష్ణవేణి,  ఏఈవో రాథోడ్ వినోద్ లు పంట నష్టం అంచనాలను నమోదు చేసుకొని ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఇప్పటికి నష్టపరిహారం రాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరదకు గురైనటువంటి నష్ట పరిహారంతోపాటు యాసంగి పంట మొక్కజొన్న, నువ్వులు, జొన్న పంటకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. రైతులు బాద వెంకటరమణ, సుమిత్ రెడ్డి, రాజశేఖర్, లింగేష్,  ప్రమోద్, వినోద్, సంతోష్ ఉన్నారు.

బాసరలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

0

బాసరలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా మంగళవారం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పవన్ కళ్యాణ్ యువతకు ఆదర్శమని, సినిమాలో ఉన్నత స్థాయిలో ఉండి కూడా, ప్రజలకు సేవ చేయడానికి రాజకీయంలోకి వచ్చి , రాజకీయంలో కూడా కష్టపడి ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగాడని, నేటి యువతకు పవన్ కళ్యాణ్ ఆదర్శం అని పవన్ కళ్యాణ్ వీరాభిమాని అంబకంటి రాజు అన్నారు.. ఈ వేడుకలో బాసర మండల పవన్ కళ్యాణ్ అభిమానులు భాషెట్టి రాకేష్, ,దావు రాజు, సాయి, సతీష్, యోగేష్ , శివ, ఆకాశ్, అనిల్, పవన్, ఫణి, రిషి, హరీష్, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు.

ఘనంగా బాలల గణేష్ మండలి  గణనాథునికి పూజలు

0

ఘనంగా బాలల గణేష్ మండలి  గణనాథునికి పూజలు

*51రకాల ప్రసాదాలతో  రెడ్డి కాలనీ గణపతికి నైవేద్యాలు

 

చిత్రం న్యూస్, ఇచ్చోడ: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని బాలల గణేష్ మండలి ఆధ్వర్యంలో రెడ్డి కాలనీలో ఏర్పాటు చేసిన గణేషుని ప్రతిమకు భక్తులు, కాలనీవాసులు పూజలు నిర్వహించారు.  గత ఏడు రోజులుగా లంబోదరుడు ఇక్కడ విశేషంగా  పూజలు అందుకుంటున్నాడు. మంగళవారం భక్తులు 51 రకాల ప్రసాదాలతో  బొజ్జ గణపయ్యకు నైవేద్యాలు సమర్పించారు.  అగ్రజుడైన గణపతికి ప్రత్యేక పూజలు  నిర్వహించారు.  గం గణపతయే నమః అంటూ సల్లంగా చూడాలంటూ ఆ దేవ దేవుని కొలిచారు.  చిన్నపిల్లలు, మహిళలు, యువతీ యువకులతో మండప ప్రాంగణం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి కలిసిన బేల మండల నాయకులు

0

ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి కలిసిన నాయకులు

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా ఇం ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును మంగళవారం హైదరాబాద్ లో మాజీ జడ్పీటీసీ రాందాస్ నాక్లే ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ నాయకులు కలిశారు. మండలంలో చేపట్టవలసిన పలు ముఖ్యమైన అభివృద్ధి పనులకు నిధుల మంజూరు విషయమై మంత్రిని కలిసినట్లు రాందాస్ నాక్లే తెలిపారు. ఆయన వెంట నాయకులు మినక సుధాంరెడ్డి, భేదొడ్కర్ అవినాష్, వైద్య జ్ఞానేశ్వర్,ఠాక్రె సాగర్ తదితరులు ఉన్నారు.

మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి  పరామర్శ 

0

మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల చారి  పరామర్శ 

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం ధర్మోరా గ్రామానికి చెందిన మా అమ్మ నాన్న ఫౌండేషన్ ఛైర్మన్ యం.ఆంజనేయులు మాతృమూర్తి  గంగుబాయి అనారోగ్యంతో 4 రోజుల క్రితం  మృతిచెందింది. విషయం తెలుసుకున్న కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల చారి  దర్మోరలో ఆంజనేయులు మాతృ మూర్తి చిత్రపటానికి నివాళులర్పించారు.  మృతికి గల కారణాలను ఆంజనేయులును అడిగి తెలుసుకున్నారు. దైర్యం చెప్పారు. వారి వెంట ముథోల్ ఆత్మ ఛైర్మన్ గన్ను నర్సారెడ్డి,PACS చైర్మన్ రత్నాకర్ రావు, లోకేశ్వరం మండల మాజీ ఎంపీపీ మామిడి నారాయణ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ లోకేశ్వరం మండల అధ్యక్షులు శ్రీ గడ్డం సుదర్శన్ రెడ్డి, ముథోల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రావుల గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ యూత్ అద్యక్షులు షఫీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు రావుల శ్రీనివాస్,  ఆర్ష ప్రసాద్  తదితరులు ఉన్నారు.

గణేష్ నిమజ్జోత్సవానికి సర్వం సిద్ధం

0

బాసరలో ముమ్మరంగా కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులు 

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో గురువారం నిమజ్జనోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాట్లుచేశారు. నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక బాసర గోదావరి ఏర్పాట్లను గ్రామపంచాయతీ ఈవో ప్రసాద్ గౌడ్ పరిశీలించారు. అదేవిధంగా ప్రధాన రహదారులపై ఏర్పడ్డ గుంతలలో మొరం సైతం వేయించారు. బాసర పరిసరాల్లో పారిశుద్ధ్య సిబ్బంది చెత్తను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. గోదావరికి వెళ్లే రహదారుల్లో, ఆలయ పరిసర ప్రాంతాల్లో పడేసిన చెత్తను ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు.

దుర్వాసన రాకుండా, వ్యాధులు ప్రభలకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. దోమలు వృద్ధి చెందకుండా రాత్రి వేళలో దోమల మందు పిచికారి చేస్తున్నారు.  సేకరించిన చెత్తను ఎప్పటికప్పడు ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. గ్రామపంచాయతీ సిబ్బంది పనితీరును ప్రశంసిస్తున్న గ్రామస్తులు, వినాయక నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వాహకులకు పలు సలహాలు, సూచనలు చేశారు.  ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు గట్టి బందోబస్తును నిర్వహిస్తున్నారు. నిమజ్జనోత్సవ వేడుకలు ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.