Home Blog Page 69

రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

0

చిత్రం న్యూస్, దండేపల్లి: మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట సమీపంలో ఉత్కూర్ చౌరస్తా వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అల్లంపల్లి సంతోష్ తీవ్రంగా గాయపడ్డాడు.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై బాధితుడిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు అతనిని మంచిర్యాలకు తరలించారు. హనుమాన్ మాల దారణలో ఉన్న సంతోష్ తోటి స్వాములతో కలిసి నెన్నెల నుండి కొండగట్టుకు పాదయాత్ర కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

 

 

 

ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న ‘మీసేవ’ ఛార్జీలు

0

చిత్రం న్యూస్,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మీసేవ (MeeSeva) కేంద్రాల ద్వారా వివిధ ప్రభుత్వ సేవలు పొందే పౌరులపై అదనపు భారం పడనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీసేవ కేంద్రాల్లో సర్వీసు ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పెంచిన కొత్త ధరలు వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి.

కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, ఇతర రెవెన్యూ, పౌర సేవలకు ఈ ధరల పెంపు వర్తించనుంది. నిర్వహణ వ్యయం పెరగడం మరియు మీసేవ కేంద్రాల నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

గత కొన్నాళ్లుగా మీసేవ కేంద్రాల నిర్వాహకులు తమ కమీషన్ పెంచాలని, సర్వీసు ఛార్జీలను సవరించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేసింది. ఏప్రిల్ 1 నుంచి మీసేవకు వెళ్లేవారు కొత్త ధరల పట్టికను గమనించి, ఆ మేరకు చెల్లింపులు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

డిజిటల్ సేవలను మరింత బలోపేతం చేసే క్రమంలో ప్రభుత్వం ఇటీవల వాట్సాప్ మీసేవ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చింది. అయినప్పటికీ, నేరుగా మీసేవ కేంద్రాలకు వెళ్లే సామాన్య ప్రజలకు ఈ ఛార్జీల పెంపు కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది

గోదావరి పుష్కర ఏర్పాట్లపై ముఖ్యమంత్రితో సమావేశమైన ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్

0

చిత్రం న్యూస్, బాసర : ఏప్రిల్ 6న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే పవర్ రామరావ్ పటేల్ సీఎంతో సమావేశమయ్యారు. గోదావరి పుష్కరాలు ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చర్చించగా ఆ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రూ.100 కోట్ల  నిధులతో బాసర ఆలయ పునర్నిర్మాణం, మాస్టర్ ప్లాన్ అమలు, అదేవిధంగా రూ.200 కోట్ల నిధులతో ముథోల్ లో ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవన నిర్మాణానికి భూమి పూజ చేయనున్న సందర్భంగా ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ పలు విషయాలు వెల్లడించారు.. శంకుస్థాపన కార్యక్రమానికి మీరు రావడం సంతోషమని, ఆయన ముఖ్యమంత్రికి తెలియజేశారు. గతంలో బాసర అభివృద్ధికి నోచుకోలేదని, మీ హయాంలో ఆలయ పునర్నిర్మాణం జరగడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే చెప్పారు. దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయపున నిర్మాణ శంకుస్థాపనకు సీఎం వస్తున్న సందర్భంగా ముధోల్ నియోజక వర్గ ప్రజలతో పాటు భక్తులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు 

0

లక్ష్మయ్య కుటుంబానికి రూ.5వేలు ఆర్థిక సాయం అందజేసిన అమ్మానాన్న పౌండేషన్ ఛైర్మన్ యం.ఆంజనేయులు

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా ముథోల్ మండలం ఎడ్ బిడ్ గ్రామానికి చెందిన లక్ష్మయ్య కుటుంబానికి అమ్మానాన్న పౌండేషన్ ఛైర్మన్ యం.ఆంజనేయులు రూ.5 వేలు ఆర్థిక సాయం అందజేశారు. లక్ష్మయ్యకు రెండు కిడ్నీలు చెడిపోవడంతో ఆయన ఐదు రోజుల క్రితం మృతిచెందారు. అతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబం. ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మా అమ్మానాన్న పౌండేషన్ ఛైర్మన్ యం.ఆంజనేయులు కుమారుడు సుకుమార్ పుట్టినరోజు సందర్భంగా ఆ నిరుపేద కుటుంబానికి రూ.5 వేలు అందజేసి ఉదరాత చాటారు. ఈ కార్యక్రమంలో సాయం రెడ్డి, రాములు (వార్డ్ మెంబర్), మొడం సాయన్న, సుమిద్ కుమార్, ఎల్లన్న, సతీష్, ముత్తన్న, తదితరులు పాల్గొన్నారు.

ఏప్రిల్ 5న మాండగడలో  శ్రీ మురళీకృష్ణ ఆలయ ద్వితీయ వార్షికోత్సవం

0

చిత్రం న్యూస్, భోరజ్ : అదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం  మాండగడ గ్రామంలో శ్రీ మురళీకృష్ణ ఆలయ ద్వితీయ వార్షికోత్సవం, 26వ సుందర సత్సంగ వార్షికోత్సవం ఏప్రిల్ 5 న ఆదివారం రోజు ఘనంగా నిర్వహించనున్నారు. శ్రీశ్రీశ్రీ స్వామి సుందర చైతన్యానంద సరస్వతి వారి దివ్య ఆశీస్సులతో ఈ కార్యక్రమం జరగనుంది.ఉదయం 8:00 గంటలకు నగర సంకీర్తన,అనంతరం భజన కార్యక్రమం, ‘తత్వ బోధ’ అంశంపై క్విజ్ పోటీలు, మహా ప్రసాద వితరణ కార్యక్రమానికి సుందర సత్సంగ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని గ్రామస్తులు తెలిపారు.

ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉచితంగా టీటీసీ, పాలిటెక్నిక్ శిక్షణ తరగతులు

0

చిత్రం న్యూస్,ఆదిలాబాద్:అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఆదిలాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఇంటర్, పదవ తరగతి పూర్తయిన విద్యార్థుల కోసం ఉచిత టీటీసీ (TTC),  పాలిటెక్నిక్ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. ఆసక్తిగల విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. ఏప్రిల్ 1, 2026 నుండి తరగతులు ప్రారంభమం కానున్నాయి.తెలుగు మీడియం (T/M),  ఇంగ్లీష్ మీడియం (E/M) వారికి వేర్వేరుగా తరగతులు నిర్వహించనున్నారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన,ప్రతి రోజు పరీక్షల నిర్వహణ,విషయాల వారీగా ప్రత్యేక పరీక్షలు, గ్రాండ్ టెస్ట్‌ల నిర్వహణ ఉంటుంది అన్నారు వివరాల కోసం అదిలాబాద్ పట్టణంలోని వినాయక్ చౌక్ శ్రీ సరస్వతి శిశు మందిర్ లో సంప్రదించాలన్నారు.

ఐపీఎల్ 2026: వంఖెడే స్టేడియంలో ముంబై వర్సెస్ కోల్‌కతా – రసవత్తర పోరుకు సర్వం సిద్ధం!

0
CRICKET
CRICKET

చిత్రం న్యూస్,ముంబై: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఆదివారం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ముంబై ఇండియన్స్ (MI) మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్ల మధ్య కీలక సమరం జరగనుంది. ముంబై జట్టుకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తుండగా, కేకేఆర్ జట్టును అజింక్యా రహానే నడిపిస్తున్నారు. ఈ మ్యాచ్ ముంబైలోని ఐకానిక్ వంఖెడే స్టేడియంలో జరగనుంది. ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఇప్పటికే తమ గత మ్యాచుల్లో మంచి జోరును కనబరిచింది. ముంబై జట్టు స్వదేశీ గడ్డపై తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని చూస్తోంది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటి స్టార్ ప్లేయర్ల ఫామ్ జట్టుకు చాలా కీలకం.కొత్త ప్లేయర్ల రాకతో కేకేఆర్ క్యాంప్ చాలా బలంగా కనిపిస్తోంది. రహానే నాయకత్వంలో జట్టు సమతూకంగా ఉంది.

హెడ్-టు-హెడ్ (Head-to-Head):

గత రికార్డులను పరిశీలిస్తే, ముంబై ఇండియన్స్‌కు కేకేఆర్‌పై మెరుగైన రికార్డు ఉంది. అయితే, ఇటీవలి కాలంలో కోల్‌కతా జట్టు ముంబైకి గట్టి పోటీనిస్తోంది. నేటి మ్యాచ్ ఫలితం ఇరు జట్ల ప్లేఆఫ్ అవకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది.CRICKET

చిన్నస్వామిలో కోహ్లీ విశ్వరూపం.. ఆరంభ మ్యాచ్‌లో హైదరాబాద్‌కు ఘోర పరాజయం

0

చిత్రం న్యూస్: బెంగళూరు: ఐపీఎల్ 19వ సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లోనే ఆర్‌సీబీ తన ప్రతాపాన్ని చూపించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ పోరులో టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది.

మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. స్టాండ్-ఇన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ 38 బంతుల్లో 80 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.చివరలో అనికేత్ వర్మ (18 బంతుల్లో 43) వేగంగా ఆడటంతో హైదరాబాద్ భారీ స్కోరు సాధించింది. ఆర్‌సీబీ బౌలర్లలో డెబ్యూటెంట్ జాకబ్ డఫీ 3 వికెట్లతో రాణించాడు.

202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీకి ఆరంభంలోనే ఫిలిప్ సాల్ట్ వికెట్ కోల్పోయినప్పటికీ, ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. దేవ్‌దత్ పడిక్కల్ కేవలం 26 బంతుల్లోనే 61 పరుగులు చేసి ఆర్‌సీబీకి గట్టి పునాది వేశాడు.విరాట్ కోహ్లీ తన క్లాస్ ఆటతో 38 బంతుల్లో 69 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.చివరలో రజత్ పాటిదార్ (31) మెరుపులు మెరిపించడంతో ఆర్‌సీబీ కేవలం 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆర్‌సీబీ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ జాకబ్ డఫీ (RCB)

టాప్ స్కోరర్ (SRH) ఇషాన్ కిషన్ (80 రన్స్)

టాప్ స్కోరర్ (RCB) విరాట్ కోహ్లీ (69* రన్స్)

ఈ విజయంతో డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఆర్‌సీబీ తన ప్రయాణాన్ని ఘనంగా చాటుకుంది. సన్‌రైజర్స్ తదుపరి మ్యాచ్‌లో పుంజుకోవాలని ఆశిస్తోంది.

ఆదివాసీ మహిళా ఉత్పత్తులను ప్రోత్సహించాలి: జడ్పీ మాజీ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి

0

చిత్రం న్యూస్,ఆదిలాబాద్:జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసిన మహిళా మార్ట్ ను జడ్పీ మాజీ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా మార్ట్‌లోని వివిధ విభాగాలను కలియతిరిగిన ఆమె, ఆదివాసీ మహిళలు స్వయంగా తయారు చేసిన ఉత్పత్తులను ఆసక్తిగా పరిశీలించారు. ఆదివాసీ మహిళలు పండించిన సేంద్రియ ఆహార పదార్థాలు, పోషక విలువలు కలిగిన చిరుధాన్యాలు మరియు అటవీ ఉత్పత్తుల నాణ్యతను ఆమె అభినందించారు. మహిళలు రూపొందించిన వినూత్న హస్తకళా వస్తువులను చూసి, వారిలోని నైపుణ్యాన్ని సుహాసిని రెడ్డి కొనియాడారు. స్థానిక మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఇలాంటి వేదికలు ఎంతో అవసరమని ఆమె పేర్కొన్నారు. “ఆదివాసీ మహిళల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలంటే ప్రతి ఒక్కరూ ఈ మహిళా మార్ట్‌ను సందర్శించి, ఇక్కడ లభించే నాణ్యమైన, స్వచ్ఛమైన వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా మన ప్రాంత మహిళల ఆర్థిక స్వావలంబనకు, వారి కుటుంబాల అభివృద్ధికి అండగా నిలవాలి” అని సుహాసిని రెడ్డి ఈ సందర్భంగా కోరారు.

వార్డు సభ్యులకు శిక్షణ పత్రాలు అందజేత

0

చిత్రం న్యూస్, బాసర:వార్డుల అభివృద్ధికి వార్డు సభ్యులు కీలక పాత్ర పోషిస్తారని  డీఎల్‌పీఓ లక్ష్మణ్ అన్నారు. నిర్మల్ జిల్లా బాసర రైతు వేదికలో పది గ్రామపంచాయతీలకు చెందిన నూతనంగా ఎన్నికైన 90 మంది వార్డు సభ్యులకు ఐదు రోజుల పాటు నిర్వహించిన శిక్షణా తరగతులు శనివారం విజయవంతంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి డీఎల్‌పీఓ లక్ష్మణ్ హాజరై ప్రసంగించారు. గ్రామాల అభివృద్ధిలో ప్రజా ప్రతినిధులు ముఖ్యమైన పాత్ర పోషిస్తారని తెలిపారు. పంచాయతీ రాజ్ చట్టం, వార్డు సభ్యుల విధులు, బాధ్యతలు, గ్రామాభివృద్ధి, గ్రామ సభల నిర్వహణ, పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాల నిర్వహణ, నిధుల వినియోగం వంటి అంశాలపై వార్డు సభ్యులు శిక్షణను సద్వినియోగం చేసుకున్నారని పేర్కొన్నారు.శిక్షణ పూర్తి చేసుకున్న వార్డు సభ్యులకు అధికారులు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో దేవేందర్ రెడ్డి, ఎంపీఓ గంగా సింగ్, ఈఓ ప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.