Home Blog Page 71

శ్రీరామ నవమి సందర్భంగా పలు ఆలయాలను దర్శించుకున్న డీసీసీ ఉపాధ్యక్షుడు దీపక్ రావు

0

చిత్రం న్యూస్, భోరజ్: శ్రీరామనవమి సందర్భంగా భోరజ్ మండలంలోని పలు ఆలయాల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ దీపక్ రావు, రాష్ట్ర కార్యదర్శి శాంతన్ రావు నాయకులతో కలిసి పూజలు నిర్వహించారు. పెండల్వాడ ఆలయానికి వచ్చిన డీసీసీ వైస్ ప్రెసిడెంట్ దీపక్ రావు ను స్థానిక నేతలు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. స్వామి ప్రతిమను అందజేశారు. వారి వెంట నాయకులు అల్లూరి భూమారెడ్డి, మామిడి మల్లారెడ్డి, దయాకర్ రెడ్డి ఉష్కమ్ శంకర్, ముడుపు ప్రశాంత్ రెడ్డి, శైలేష్ రెడ్డి, రాజారెడ్డి, పొట్ట అశోక్, సంతోష్ రెడ్డి, పూండ్రు రవికిరణ్ రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు.

సహకార శాఖ సీనియర్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ ప్రసన్నకు ఘనంగా సన్మానం 

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లా సహకార కార్యాలయం అదిలాబాద్ లో గత కొంతకాలంగా సీనియర్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న యస్. లక్ష్మీ ప్రసన్న ను తెలంగాణ సహకార యూనియన్ హైదరాబాద్ కు బదిలీ చేస్తూ సహకార శాఖ రాష్ట్ర అడిషనల్ రిజిస్టర్ (సర్వీసెస్) ఉత్తర్యులు జారీచేశారు. ఈ సందర్భంగా టీఎన్జీవో యూనియన్ అదిలాబాద్ జిల్లా పక్షాన బదిలీ పై వెళ్తున్న అధికారికి జిల్లా సహకార శాఖ కార్యాలయంలో శాలువాతో సత్కరించి వీడ్కోలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో యూనియన్ అదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.నవీన్ కుమార్ , జిల్లా సహకార కార్యాలయం పర్యవేక్షకులు డి.ఆత్మారం, జూనియర్ ఇన్స్పెక్టర్ జి.నితిన్ కుమార్ , నయీం, నరేష్ కృష్ణ రెడ్డి, దేవు బాయి తదితరులు పాల్గొన్నారు.

తుది దశకు భూభారతి పోర్టల్: మంత్రి పొంగులేటి కీలక సమీక్ష

0

చిత్రం న్యూస్, హైదరాబాద్: భూభారతి పోర్టల్ తుది దశకు చేరుకుంది. రైతులకు పారదర్శకమైన సేవలందించడమే లక్ష్యంగా ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ రూపొందించినట్లు తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఐదు మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేయనున్నట్లు ప్రకటించారు. భూసర్వే నుంచి రిజిస్ట్రేషన్ వరకు.. అంతా ఒకే గొడుగు కిందకు తీసుకురానున్నట్లు ఆయన ప్రకటించారు. స‌చివాల‌యంలో రెవెన్యూ, సర్వే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్, ఎన్ఐసీ అధికారుల‌తో మంత్రి పొంగులేటి బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

రామగుండం ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష 

0

చిత్రం న్యూస్, రామగుండం: రామగుండం జనరల్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి అవసరమైన పరికరాల ప్రతిపాదనలు పంపించాలని సూచించారు.ఆసుపత్రిలోని అవుట్ పేషెంట్ విభాగాలను, క్రిటికల్ కేర్ సెంటర్, ఎస్.ఎన్.సి.యూ, ఎక్స్ రే ఏరియా, అల్ట్రా సౌండ్, చిన్న పిల్లల విభాగం, ఫిజియోథెరపీ విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆసుపత్రికి అవసరమైన పరికరాల కోసం ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఆసుపత్రిలో అదనంగా ఒక ఎక్స్ రే మేషిన్, అల్ట్రా సౌండ్ ఏర్పాటు చేయాలని, ఫిజియోథెరపీ నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియామక చేపట్టాలని అన్నారు.సదరం విభాగంలో చేసిన ఏర్పాట్ల పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రి న్యూ బ్లాక్ లో అవుట్ పేషంట్ రూమ్ లను కలెక్టర్ పరిశీలించారు. వైద్యులు సకాలంలో విడుదలకు హాజరవుతూ రోగులకు మంచి సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు.అనంతరం కలెక్టర్ ఎన్టీపీసీ సీఎస్ఆర్ నిధులతో గోదావరిఖని లో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ షెడ్యూల్ కులాల బాలికల వసతి గృహాన్ని పరిశీలించారు.ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట వైద్య అధికారులు డాక్టర్ అరుణ ,డాక్టర్ కృపా భాయ్, డాక్టర్ రాజు, నర్సింగ్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఔట్సోర్సింగ్ ఉద్యోగుల హైదరాబాద్ మహాగర్జనను విజయవంతం చేయండి

0

చిత్రం న్యూస్, వనపర్తి:ఈ నెల 29న హైదరాబాదులో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబోయే మహా ధర్నా పోస్టర్ ను అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు భరత్, ఉపాధ్యక్షులు మహేందర్ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు భరత్ మాట్లాడుతూరాష్ట్ర  వ్యాప్త అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఏజెన్సీలను రద్దుచేసి వారి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, గత రెండు సంవత్సరాల నుండి ప్రభుత్వానికి విన్నవిస్తున్న స్పందించడం లేదని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకే మహా ధర్నా నిర్వహించడం జరుగుతుందని ఈ ధర్నాకు జిల్లాలోని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో శివం, గోవిందు, రవి, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధం

0

* శ్రీ సీతారామ దేవాలయ కమిటీ ఆష్ఠ 

చిత్రం న్యూస్, బాసర:నిర్మల్ జిల్లా ముథోల్ మండలం ఆష్ఠ గ్రామంలో శ్రీ సీతారామ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం కార్యక్రమానికి సర్వం సిద్ధమైనట్లు ఆలయ కమిటీ తెలియజేశారు. మూడు రోజులపాటు జరిగేటటువంటి ఉత్సవాల్లో పెళ్లి పందిరి పూజ మొదలుకొని అభిషేక అర్చనలు, తలంబ్రాలు, అభిషేకాలు, భజన కీర్తనల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం అనంతరం చివరి రోజు అయిన మూడో రోజు మహా అన్నదాన ప్రసాదం ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి భక్తులు వస్తున్నట్లు ఆలయ సిబ్బంది పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. భక్తులందరూ ఎక్కువ మొత్తంలో హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి రాముని సేవకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ వారు కోరారు.

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని వినతి 

0

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలంలో మొక్క జొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంల బాసర తహసీల్దార్ పవన్ చంద్రకు గురువారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను త్వరితగతిన ఏర్పాటు చేస్తే రైతులకు మద్దతు ధర లభిస్తుందన్నారు. రైతులు దళారులకు పంటలను అమ్మి మోస పోతున్నారన్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. కిసాన్ సంఘ్ అ ధ్యక్షులు బండారి ఆనంద్,  సంఘ్ నేతలు, రైతులు ఉన్నారు.

గుంతలమయంగా జాతీయ రహదారి..పట్టించుకోరేం.?

0

చిత్రం న్యూస్, బాసర:నిర్మల్ జిల్లాలోని బాసర మండలం బిదిరెల్లి గ్రామం నుండి ధర్మాబాద్ వెళ్లి జాతీయ రహదారి రోడ్డు గుంతలమయంగా మారి వాహనదారులకు శాపంగా మారింది. రోడ్డు మధ్య భాగంలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి తెలియని వాహనదారులు గుంతలో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. నిత్యం వాహనదారులు సుమారు వందల వాహనాలు రాకపోకలు కొనసాగుతాయి.  బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శించుకోవడానికి వెళ్లాలంటే నానా అవస్థలు పడాల్సి వస్తుంది. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతు చేయాలని వాహన చోదకులు కోరుతున్నారు.

ఏప్రిల్ 10 వరకు టీజీపీఎస్సీ ఓటీఆర్ అప్డేట్‌కు చాన్స్

0

చిత్రం న్యూస్, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) వివరాల అప్డేట్‌కు గడువును మరోసారి పొడిగించింది. అభ్యర్థులు తమ వివరాలను సవరించుకునేందుకు ఏప్రిల్ 10 వరకు అవకాశం కల్పించినట్లు కమిషన్ సెక్రటరీ హరిత ప్రకటనలో తెలిపారు. మార్చి 25తో గడువు ముగియాల్సి ఉండగా, అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు పొడిగించారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు వ్యక్తిగత వివరాల అప్డేట్‌తోపాటు, విద్యార్హతల ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను పూర్తి చేసిన అభ్యర్థులకే భవిష్యత్తులో విడుదలయ్యే ఉద్యోగ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకునే అర్హత ఉంటుందని పేర్కొన్నారు. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి గడువు ముగిసిన తర్వాత కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, అయితే, ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న వారు మాత్రం నిర్ణీత గడువులోగా తమ వివరాలను తప్పనిసరిగా అప్డేట్ చేయాలని వెల్లడించారు. ఒకే అభ్యర్థి పలుమార్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడం లేదా డేటాను తారుమారు చేయడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అభ్యర్థులు ఏప్రిల్ 10 లోపు తమ ఓటీఆర్ వివరాలను అధికారిక వెబ్‌సైట్ www.tgpsc.gov.in ద్వారా సరిచేసుకోవాలని సూచించారు.

భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొత్త కోర్సులు ప్రారంభం 

0

చిత్రం న్యూస్, బైంసా : భైంసాలోని గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ విద్యా సంవత్సరంనుంచి నూతన కోర్సులు ప్రారంభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ కర్రోళ్ల బుచ్చయ్య తెలిపారు. బి.కామ్‌లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్,  ఇన్సూరెన్స్ ( బిఎఫ్ ఎస్ ఐ ) అదేవిధంగా బీఎస్సీ కోర్సులో డెయిరీ, పౌల్ట్రీ సైన్స్ విభాగంలో అప్రెంటిస్‌షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ (ఏఈడీపీ ) కోర్స్ప్రా లు  ప్రారంభించగా ఈ కోర్సు 3 సంవత్సరాలపాటు కొనసాగుతూ, యూజీసీ, ఎన్ ఈ పి 2020 మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటుంది. ఇందులో 2 సంవత్సరాల తరగతి బోధనతో పాటు 1 సంవత్సరo తప్పనిసరి వేతనంతో కూడిన ఉద్యోగ శిక్షణ (ఓజెటి ) ఇవ్వబడుతుందన్నారు. ఈ విధానం విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందించి, ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కీలక కోర్సులు అని ఈ కోర్సులో ప్రవేశం పొందాలని ప్రిన్సిపాల్  కర్రోళ్ల బుచ్చయ్య తెలిపారు.