Home Blog Page 41

అజయ్ సింగ్ ను కలిసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లోక ప్రవీణ్ రెడ్డి

0

అజయ్ సింగ్ ను కలిసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లోక ప్రవీణ్ రెడ్డి

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: కర్ణాటక రాష్ట్రం జేవర్గి ఎమ్మెల్యే, కర్ణాటక మాజీ సీఎం కుమారుడు, ఆదిలాబాద్ డీసీసీ అబ్సర్వర్  అజయ్ సింగ్ ను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లోక ప్రవీణ్ రెడ్డి శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు.  ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్ష పదవి  కోసం  పరిశీలనకు వచ్చిన  ఆయనతో  చర్చించారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి, మాజీ కౌన్సిలర్స్ రాంకుమార్, ఇమ్రాన్,  భూమన్న,  నాయకులు శ్రీకాంత్, భూపేందర్ తదితరులు ఉన్నారు.

రహదారి సమస్య పరిష్కారం తీరేనా!

0

రహదారి సమస్య పరిష్కారం తీరేనా!

చిత్రం న్యూస్, జైనథ్: మహరాష్ట్ర సరిహద్దు నుంచి అదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కూర గ్రామం మీదుగా కాఫ్రి వరకు R&B ద్వార రహదారి నిర్మించారు. రోడ్డు ట్రాఫిక్ అసౌకర్యానికి, ప్రమాదాలకు సంబంధించి కూర గ్రామస్తులు ప్రజవాణి ఫిర్యాదులో దాదాపుగా సంవత్సరం క్రితం వినతి పత్రం అందించారు. గ్రామం మీద నుంచి వెళ్లే వాహనాలు వేగంగా వెళ్లడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, R&B అధికారుల రోడ్లపై స్పీడ్ బ్రేకర్లు అనుమతించబడనప్పటికీ, సమస్యను పరిష్కరించడానికి తగిన రంబుల్ స్ట్రిప్‌లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా గ్రీవెన్స్ లో R&B అధికారులకు సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. సంవత్సరం గడుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో సమస్య పరిష్కారం కాక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సోలార్ షాక్ తో గుర్తు తెలియని వ్యక్తి మృతి

0

సోలార్ షాక్ తో గుర్తు తెలియని వ్యక్తి మృతి

చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం బుద్ధికొండ గ్రామ శివారులో గల వ్యవసాయ క్షేత్రంలో అడవి పందుల రక్షణ కోసం అమర్చిన సోలార్ వైరుకు తగిలి గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతి చేసినట్లు ఎస్సై ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..మృతుడు తెల్లటి చొక్కా, జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నాడు. వయస్సు దాదాపు 50 ఉన్నట్లుగా గుర్తించామన్నారు. మృతుని వివరాలు ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు. అనంతరం మృతదేహాన్ని రిమ్స్ ఆసుపత్రికిలోని మార్చురీ గదికి  తరలించామన్నారు. మృతుడి వివరాలు  తెలిసినవారు 8712659947 నంబర్ ను సంప్రదించాలని ఎస్ఐ సూచించారు.

విధుల్లో చేర్చుకోండి..లడ్డు ప్యాకేజ్ దినసరి కూలీలు 

0

విధుల్లో చేర్చుకోండి..లడ్డు ప్యాకేజ్ దినసరి కూలీలు 

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో లడ్డు తయారీ కేంద్రంలో లడ్డు ప్యాకేజ్ గా విధులు నిర్వహించిన సుమారు పదిమంది రోజువారి దినసరి కూలీలకు ఉద్యోగ భద్రత లేక వీధిన పడ్డారు. గత 20 సంవత్సరాల నుండి ఆలయంలో విధులు నిర్వహిస్తున్నాం . ఈ సంవత్సరం జనవరి 28వ తేదీన దేవస్థానం అధికారులు వీరిని విధుల నుంచి  తొలగించడంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. తిరిగి విధుల్లో చేర్చుకోవాలని లడ్డు ప్యాకేజ్ దినసరి కూలీలు పలుమార్లు ఆలయానికి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు,కలెక్టర్ తో పాటు హైదరాబాదులోని దేవదాయ శాఖ కమిషనర్ కు కలసి తమ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం ఇచ్చామన్నారు. ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదని తమను పట్టించుకునే నాథుడు కరువయ్యారని ఆరోపిస్తున్నారు. తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని దినసరి కూలీలు దేవస్థానం కార్యనిర్వణాధికారి అంజనాదేవిని  కోరుతున్నారు.

పత్తి, సోయాబీన్ సేకరణను వేగవంతం చేయాలి:ఎమ్మెల్యే పాయల్ శంకర్

0

పత్తి, సోయాబీన్ సేకరణను వేగవంతం చేయాలి:ఎమ్మెల్యే పాయల్ శంకర్

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: రైతుల నుండి పత్తి, సోయాబీన్ పంటలను వెంటనే  కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా ఛైర్మన్ మల్లెపూల నర్సయ్య, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో శంకర్ మాట్లాడుతూ..సేకరణ ప్రక్రియను ఆలస్యం చేయకుండా ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ “కపాస్ కిసాన్ యాప్” గురించి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. దీనిని రైతులు ఉపయోగించుకోవాలని కోరారు. సేకరణ ప్రక్రియలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడానికి ఈ యాప్ సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు. రైతులకు సజావుగా ప్రక్రియ జరిగేలా మార్కెట్ యార్డులలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని శంకర్ అధికారులను ఆదేశించారు. రైతులు తమ ఉత్పత్తులకు న్యాయమైన మద్దతు ధర పొందేలా చూసేందుకు సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సహకారంతో త్వరలో సేకరణ ప్రారంభమవుతుందని కూడా ఆయన పేర్కొన్నారు.

MLA PAYAL SHANKAR: పెరుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

0

MLA PAYAL SHANKAR: పెరుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

చిత్రం న్యూస్: జైనథ్: మారుతున్న కాలంతో పాటు పెరుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుంటూ  ముందుకు సాగాలని ఎమ్మెల్యే  పాయల్ శంకర్ అన్నారు. జైనథ్ మండలంలోని  అడ జడ్పీ ఉన్నత  పాఠశాలలో ఆశా ఫర్ ఎడ్యుకేషన్ సహకారంతో ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1.80 లక్షలు విలువగల స్మార్ట్ కంప్యూటర్ ల్యాబ్ ను బుధవారం ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్   మాట్లాడుతూ.. ప్రస్తుతం స్మార్ట్ యుగం కొనసాగుతుందని దానికి అనుగుణంగా విద్యార్థులు కంప్యూటర్ శిక్షణలు తీసుకోవాలన్నారు. వారికి ఉపయోగపడేలా ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్మార్ట్ కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పుస్తకాలంలో ప్రతి పోటీ పరీక్ష ఆన్లైన్లోనే కొనసాగుతుందన్నారు. అదే దిశగా విద్యార్థులు ఇప్పటినుంచే ఎదగాలన్నారు. పాఠశాలలో ఏర్పాటుచేసిన స్మార్ట్ ల్యాబ్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా పాఠశాలలో మౌలిక వసతులు కల్పనకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్, పాఠశాల హెచ్ఎం గుణవంత్, ఏకలవ్య ఫౌండేషన్ కోశాధికారి సతీష్ దేశ్పాండే, ప్రోగ్రాం మేనేజర్ ప్రశాంత్, ట్రస్టీలు దిగంబర్, రామ్ రెడ్డి, బీజేపీ నాయకులు లాలా మున్నా, కోరెడ్డి వెంకటేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.

తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు  

0

తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు  

తండ్రిని చంపి పొలంలో పాతిపెట్టిన కొడుకు.

రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళను పరామర్శించిన రూపేష్ రెడ్డి

0

రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళను పరామర్శించిన రూపేష్ రెడ్డి

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సదల్ పూర్ గ్రామానికి చెందిన టేకం పోతుబాయి అనే మహిళను మంగళవారం యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు సామ రుపేష్ రెడ్డి ఆధ్వర్యంలో చికిత్స నిమిత్తం అదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.ఈ సందర్భంగా టేకం పోతుబాయి పరిస్థితిని రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్ కు వివరించారు. దీంతో వెంటనే స్పందించిన ఆయన ఆమెకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సంబంధిత వైద్యులకు ఆదేశించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న టేకం పోతుబాయి పరిస్థితిని కుటుంబ సభ్యులు ముందుగా యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.దీంతో వారి కుటుంబ సభ్యులను కలిసి టేకం పోతుబాయిని ఆసుపత్రికి తరలించడంతో కుటుంబ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

 

 

ఓని గ్రామంలో అంత్యక్రియల్లో పాల్గొన్న భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావ్ పటేల్

0

ఓని గ్రామంలో అంత్యక్రియల్లో పాల్గొన్న భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావ్ పటేల్

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలంలోని ఓని గ్రామంలో నిర్వహించిన మాజీ సర్పంచ్ ఆనందరావు పటేల్  తల్లి నాగబాయ్ అంత్యక్రియల్లో భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సిందే ఆనందరావ్ పటేల్ పాల్గొన్నారు. గ్రామానికి చేరుకున్న ఆయన మృతుని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యుల బాధలో భాగస్వామ్యం అవుతూ, ఆపదలో ధైర్యంగా నిలబడాలని సూచించారు. మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

సోయా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతుల పాదయాత్ర 

0

సోయా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతుల పాదయాత్ర 

భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో బాసర అమ్మవారికి రైతుల పూజలు

చిత్రం న్యూస్, బాసర:ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని నిరసిస్తూ  భారతీయ కిసాన్ సంఘ్ (BKS) ఆధ్వర్యంలో బాసర, ముథోల్, తానూర్, బైంసా మండలాల రైతులు ప్రభుత్వ తీరుకు నిరసనగా ర్యాలీ చేపట్టారు. వరదలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని,  సోయా పంట చేతికి వచ్చిందని, సరైన మద్దతు ధర ఇవ్వకుండా ప్రతి పంటకు రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని, రైతులను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, అధికారులకు ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా చలనం లేదని మండిపడ్డారు. మంగళ వారం ముథోల్ లోని పశుపతినాత్ శివాలయంలో బసచేసి బుధవారం ఉదయం భైంసా సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలుపనున్నారు.ప్రభుత్వం స్పందించకపోతే రైతులందరినీ ఏకం చేసి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనను చేపడతామని భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు హెచ్చరించారు. అంతకుముందు నిర్మల్ జిల్లా బాసర  అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.