Home Blog Page 125

ఘనంగా దేవి నవరాత్రుల మహోత్సవాలు  

0

ఘనంగా దేవి నవరాత్రుల మహోత్సవాలు  

* శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం  

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలం కీర్గుల్ (కె) గ్రామంలో కొలువుదీరిన దుర్గామాత శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారంలో గ్రామస్తులకు దర్శనం ఇచ్చారు. గ్రామస్తులు దేవీ నవరాత్రులు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేద పండితులు, వేద మంత్రోచ్ఛారణాలతో అమ్మవారిని కొలిచారు. నైవేద్యంగా  పొంగలి సమర్పించారు. ఊరు వాడా తరలివచ్చి అమ్మవారికి హారతులు ఇచ్చారు. యువకులు భవాని దీక్షను చేపట్టారు. నియమ నిష్ఠలతో దీక్షను బూని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రాత్రివేళ నిర్వహిస్తున్న సంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి.

ఘనంగా బతుకమ్మ సంబరాలు

0

ఘనంగా బతుకమ్మ సంబరాలు

చిత్రం న్యూస్, భైంసా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల traditions కు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండగ సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా కొనసాగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు తెలంగాణ వీధుల్లో సందడి చేసే ఈ పూల పండగ తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటలాడుతూ భైంసా మండలంలోని వాలేగాం గ్రామంలో ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ పండుగను ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్దలు పాల్గొని నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మగా పూజించారు. తంగేడు, గునుగు వంటి పూలతో నాలుగంతరాల బతుకమ్మను అందంగా పేర్చారు. పీఠంపై గౌరమ్మను నిలిపి పూజించారు. నానబియ్యం నైవేద్యం బతుకమ్మకు సమర్పించారు. “బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు తల్లి బతుకమ్మ ఉయ్యాలో ” అంటూ పాటలకు నృత్యాలు చేశారు. తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింభించేలా నృత్యాలు చేస్తూ బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

చప్రాల గ్రామంలో TGB బ్యాంకు అధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ, ఆర్ధిక అక్షరాస్యతపై అవగాహన

0

చప్రాల గ్రామంలో TGB బ్యాంకు అధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ, ఆర్ధిక అక్షరాస్యతపై అవగాహన

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని చప్రాల గ్రామంలో TGB బ్యాంకు అధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ, ఆర్ధిక అక్షరాస్యతపై అధికారులు బుధవారం అవగాహన  కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో TGB RO  అరుణ్ కుమార్  మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు బ్యాంకులో ఖాతా కలిగి ఉండాలన్నారు. ప్రతి ఒక్కరు సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్  PMSBY, PMJJBY, అటల్ పెన్షన్ యోజన కలిగి ఉండాలని వివరించారు. ఆడ బిడ్డలకు సుకన్య సమృద్ది యోజన చేసుకోవాలని సూచించారు. బ్యాంకులో తీసుకొన్న లోన్స్ సకాలంలో కట్టుకోవాలని,  సైబర్ క్రైమ్ గురించి కళా ప్రదర్శన ద్వారా అందరికీ స్వచ్ఛత గురించి, చెట్ల యొక్క ఉపయోగాలు, ప్రాధాన్యత గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో TGB చప్రాల బ్రాంచ్ మేనేజర్ M.శివకుమార్ ,క్యాషియర్ ప్రభాకర్, SERP APM, CC, VOA మంజుశ, బేల CFL కౌన్సిలర్స్ అజయ్, అనికేత్, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ని కలిసిన సామ రూపేష్ రెడ్డి

0

టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ని కలిసిన సామ రూపేష్ రెడ్డి

చిత్రం న్యూస్, బేల: టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మకంటి మహేష్ కుమార్ గౌడ్ ను ఆదిలాబాద్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి మర్యాద పూర్వకంగా బుధవారం ఆయనను కలిశారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఆయన్ను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులపై  ఆయన ఆరా తీయగా సామ రూపేష్ రెడ్డి పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఆశావాహులు ఎదురుచూస్తున్నారని ఈ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం ఖాయమని తెలిపారు. అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ నాయకులకు అవకాశం కల్పించాలని ఆయనను కోరారు. అయితే ఆయన సానుకూలంగా స్పందించి తప్పకుండా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారని రూపేష్ రెడ్డి తెలిపారు.

చంద్రఘంటా అలంకారంలో భక్తులకు దర్శనం 

0

చంద్రఘంటా అలంకారంలో భక్తులకు దర్శనం 

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర సరస్వతీ ఆలయంలో  బుధవారం చంద్రఘంటా అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు అమ్మవారు చంద్రఘంటా అలంకారంలో పులి వాహనంపై జపమాల, కమండలం, విల్లంబులు, ఖడ్గం ధరించి భక్తులకు కనిపించారు. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారినీ  భక్తిశ్రద్ధలతో  కొలిస్తే కోరిన కోర్కెలు తీరడంతో పాటు తమ చిన్నారులకు అక్షరభ్యాసం పూజలు నిర్వహిస్తే విద్యావంతులుగా రాణిస్తారని భక్తుల నమ్మకం. ఆలయ వేద పండితులు, అర్చకులు మంగళ వాయిద్యాలతో వేద మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల నుండి భక్తుల తాకిడి అధికంగా ఉండటంతో, ఆలయ అధికారులు ప్రత్యేక సదుపాయాలను కల్పించారు.

ఆర్ కే మాస్టర్ హీరోగా “మా ఊరి బావి” 

0

ఆర్ కే మాస్టర్ హీరోగా “మా ఊరి బావి” 

చిత్రం న్యూస్, ఫిల్మ్ నగర్: ఆర్ కే  మాస్టర్ హీరోగా “మా ఊరి బావి” అనే మరో సినిమా తెరకెక్కుతోంది. అచ్చమైన పల్లెటూరి వాతవరణంలో కొనసాగే హార్రర్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. నటీ, నటులపై  హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ దృశ్యాలను ఈ మధ్యే తెరకెక్కించారు. సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్  పూర్తిచేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్స్  కార్యక్రమాల వైపు దూసుకెళుతోంది.  ప్రేక్షకుల ముందుకు త్వరలో సినిమాను తీసుకొచ్చేందుకు  చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.

అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన నర్సూరి నరేష్ దంపతులు 

0

అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన నర్సూరి నరేష్ దంపతులు 

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర లో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బాసర సామాజిక  కార్యకర్త, వ్యాపార వేత్త నర్సూరి నరేష్, దంపతులు కుటుంబ సమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు  నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆలయం వద్ద తన తల్లిదండ్రుల చేతుల మీదుగా భక్తులకు ప్రసాదాన్ని అందజేశారు. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని, అందరిపై అమ్మవారి కరుణ కటాక్షాలు కలగాలని అమ్మవారిని వేడుకున్నట్టు నర్సూరి నరేష్ తెలిపారు.

బాసరలో వరద బీభత్సం   

0

బాసరలో వరద బీభత్సం   

*వచ్చే భక్తులకు తప్పని కష్టాలు

*గోదారమ్మ శాంతించమ్మ అంటూ ప్రజల వేడుకోలు

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లాలోని  పవిత్రమైన పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతి   బాసరలో  గోదారమ్మ వరద బీభత్సం   సృష్టిస్తోంది. శాంతించామ్మ అంటూ బాసర మండలంలోని గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. బాసరలో ఒకపక్క శారదియా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతుండడం మరోపక్క రైతులు, వ్యాపారుల కష్టాలు మొదలయ్యాయి. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు 3వ రోజుకు చేరాయి. ఉత్సవాలను పురస్కరించుకొని గోదావరి నది స్నానానికి వచ్చే భక్తులు నది బ్యాక్ వాటర్ వల్ల రహదారి వెళ్లే మార్గాలు, పుష్కర ఘాట్లు నీట మునిగాయి. గంట గంటకు గోదావరి నది ప్రవాహం పెరగడంతో అధికారులు ముందు జాగ్రత్తగా ఎవరు అటువైపు వెళ్ళకుండా నది బ్యాక్ వాటర్ వల్ల రహదారులకు అడ్డుకట్టుగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పోలీసు, రెవెన్యూ శాఖ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గోదావరి నది లోతట్టు ప్రాంత రైతులు, ఆలయ పరిధిలో ఉన్న దుకాణ యజమానులు నీటి ప్రవాహంతో వ్యాపార కొనుగోలు లేక తీవ్రంగా నష్టపోయామని అంటున్నారు. మండల పరిధిలోని పలు గ్రామాల ప్రజలు తమ అవసరాల కోసం ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు వచ్చేందుకు గత 15 రోజుల నుండి ఐదు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికైనా గోదారమ్మ తల్లి శాంతించమ్మ అని గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు.

బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరామర్శ

0

బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరామర్శ

చిత్రం న్యూస్,నేరడిగొండ : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని వాంకిడి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ యువ నాయకులు అనిల్ యాదవ్ తండ్రి శంకర్ యాదవ్ అనారోగ్యంతో గత కొన్నిరోజులుగా నిర్మల్ లో గల ఆదిత్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మంగళవారం ఆయన్ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుంటావని అధైర్యపడద్దని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదిత్య హాస్పిటల్ డాక్టర్స్ తో మాట్లాడారు. శంకర్ యాదవ్ అనారోగ్యానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. వీరి వెంట నాయకులు తదితరులు ఉన్నారు.

అడిగిన వారంలో రోజుల్లో షెడ్ వేయించిన ఆడే గజేందర్

0

అడిగిన వారంలో రోజుల్లో షెడ్ వేయించిన ఆడే గజేందర్

చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని బుద్ధికొండ గ్రామంలో నూతనంగా నిర్మించిన  హనుమాన్ మందిరం వద్ద షెడ్ ను  కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇంఛార్జి ఆడే గజేందర్ మంగళవారం ప్రారంభించారు. గత వారం రోజుల ముందు బుద్ధికొండ గ్రామస్తులు, యువకులు అందరూ కలిసి నూతన హనుమాన్ మందిర్ వద్ద రేకుల షెడ్డు అవసరం ఉందని ఆడే గజేందర్ దృష్టికి తీసుకెళ్లారు. అడిగిన వారం రోజుల్లోనే షెడ్ నిర్మించిన ఆడే గజేందర్ కి గ్రామస్తులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆడే గజేందర్ మాట్లాడుతూ.. మీకు ఎలాంటి అవసరం ఉన్నా ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, ఏ అవసరం ఉన్న తన దృష్టికి తీసుకొస్తే తప్పకుండా పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు, గ్రామ యువకులు, కుమారి పీఏసీఎస్ చైర్మన్ మందుల రమేష్, ఏలేటి రాజశేఖర్ రెడ్డి, దుర్కి మురళి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.