Home Blog Page 39

పోలీసుల త్యాగం స్ఫూర్తిదాయకం

0

*పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: పోలీసుల త్యాగం స్పూర్తిదాయకమని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్ లో సోమవారం  పోలీసు అమరవీరుల స్థూపానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో కలిసి పాల్గొన్నారు. అమర వీరుల స్తూపం వద్ద జ్యోతి వెలిగించారు. పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు.

కలెక్టర్  రాజర్షి షాకు శుభాకాంక్షల వెల్లువ

0

కలెక్టర్ రాజర్షి షాకు శుభాకాంక్షలు తెలుపుతున్న సంఘ ప్రతినిధులు

చిత్రం న్యూస్, కలెక్టరేట్: టీఎన్జీవో, గజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ రాజర్షి షా జన్మదిన వేడుకలను క్యాంపు కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ఆయన చేత కేకు కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రజలకు ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీజీవో జిల్లా అధ్యక్షుడు శివకుమార్, కార్యదర్శులు రామారావు, శ్రీనివాస్ రెడ్డి, టీఎన్జీవో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల నవీన్ కుమార్, మాజీ జిల్లా అధ్యక్షుడు సంద అశోక్, సంఘ ప్రతినిధులు తిరుమల్ రెడ్డి, అరుణ్, రాజేశ్వర్, సోగల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

బాసర అమ్మవారి అన్నదాన సత్రంకు రూ.లక్ష  విరాళం అందజేత 

0

బాసర ఆలయ ఈవో అంజనీదేవికి రూ.లక్ష  విరాళం అందజేస్తున్న మినుమనూరి శేఖర్ పుష్పలత దంపతులు

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని  పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి శాశ్వత అన్నదాన సత్రం నిమిత్తం ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన మినుమనూరి శేఖర్ పుష్పలత దంపతులు రూ.లక్ష విరాళం అందజేశారు. ఆలయ కార్యాలయంలో ఆలయ ఈవో అంజనీదేవికి సోమవారం ఈ న‌గ‌దును విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా విరాళం అందజేసిన దంపతులచే ఆలయంలో ప్రత్యేక పూజ‌లు జరిపించి, ఆశీర్వచన మండపంలో వేద పండితులచే ఆశీర్వచనం అందించారు. అనంతరం వారికి అమ్మవారి ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, వైదిక బృందం తదితరులు పాల్గొన్నారు.

ట్రాక్టర్ రోటవేటర్లో పడి ఒకరికి తీవ్ర గాయాలు   

0

ట్రాక్టర్ రోటవేటర్లో పడి ఒకరికి తీవ్ర గాయాలు   

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర మండలంలోని టాక్లి గ్రామానికి చెందిన శివ అనే రైతు ప్రమాదవశాత్తు ట్రాక్టర్ రోటవేటర్లో పడి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం ఎప్పటిలాగే తన వ్యవసాయంలో ట్రాక్టర్ రోటవేటర్ తో పనులు చేస్తుండగా అందులో కాలు ఇరుక్కుంది. స్థానికులు గమనించి శివను బయటకు తీయగా అప్పటికే రోటవేటర్లో  కాలు ఇరుక్కుని తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

దీపావళి పండగ ఎందుకు జరుపుకుంటారు

0

దీపావళి పండగ ఎందుకు జరుపుకుంటారు 

చిత్రం న్యూస్, హైదరాబాద్: చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే  ముఖ్యమైన పండగ దీపావళి. ఈ పండగను వెలుగుల పండగగా కూడా పిలుస్తారు.  సాధారణంగా ఇళ్లను దీపాలతో, పూలతో, విద్యుద్దీపాల కాంతులతో అలంకరించి, బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంటారు. బహుమతులు, స్వీట్లు ఇచ్చిపుచ్చుకుంటూ వేడుకలు జరుపుకుంటారు. “దీపావళి” అనే పదం సంస్కృత పదం.”దీపావళి”  అంటే “దీపాల వరుస” అని అర్థం. చీకటిపై వెలుగు, అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి విజయం సాధించిన రోజుగా చెబుతుంటారు. ఈ పండగను హిందూ మతంతో పాటు జైన మతం, సిక్కు మతాలలో కూడా నిర్వహిస్తారు.

దీపావళి ప్రాముఖ్యత: శ్రీకృష్ణుడు నరకాసురుడిని ఓడించిన విజయం ద్వారా చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారు. రావణుడిని ఓడించి 14 సంవత్సరాల వనవాసం తర్వాత రాముడు తిరిగి వచ్చిన సందర్భంగా కూడా దీపావళిని జరుపుకుంటారు.

బాసరలో ఘనంగా చంద్రమౌళీశ్వర ఆలయ ప్రతిష్ట, కుంభాభిషేక మహోత్సవం

0

బాసరలో ఘనంగా చంద్రమౌళీశ్వర ఆలయ ప్రతిష్ట, కుంభాభిషేక మహోత్సవం

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని చంద్రమౌళీశ్వర ఆలయంలో శృంగేరి పీఠం జగద్గురువు శ్రీశ్రీశ్రీ విదుశేఖర భారతి మహాస్వామి వారిచే శ్రీ లలిత చంద్రమౌళీశ్వర ఆలయ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవం మహాపూజా కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ద్వాదశ జ్యోతిర్లింగాలు ,స్పటిక లింగం ప్రాణప్రతిష్ట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ విశేష పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శనంతో పాటు శృంగేరి విదుశేఖర భారతి స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదలను స్వీకరించి ఆశీస్సులను తీసుకున్నారు. కార్యక్రమంలో ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దండారీ ఉత్సవాల్లో పాల్గొన్న సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదివాసీల ప్రధాన పండగ అయిన దండారి ఉత్సవాలు ఏజెన్సీ ప్రాంతాలలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ రూరల్ మండలం వాన్వట్ గ్రామంలో నిర్వహించిన దండారీ ఉత్సవాల్లో సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం తలమడుగు మండలం నందిగామ గ్రామంలో మాజీ డీసీసీబీ చైర్మన్ దామోదర్ రెడ్డితో కలిసి దండారి ఉత్సవాల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పటేల్ లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మొక్క జొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

0

మొక్క జొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

చిత్రం న్యూస్, బోథ్ : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో మొక్క జొన్న కొనుగోలు కేంద్రాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల మీద ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు. మొక్క జొన్నతో పాటు సోయాబీన్, పత్తి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని అన్నారు.  కిసాన్ కపాస్ యాప్ ద్వారా రైతులకు చాలా ఇబ్బందులు వస్తున్నాయని, ఆ యాప్ ఇప్పుడే అమలు చేయకుండా క్రమ క్రమంగా యాప్ మొదలు పెట్టాలని అన్నారు. చాలా మంది రైతుల వద్ద ఆండ్రాయిడ్ సెల్ ఫోన్లు లేవు.. ఉన్న నెట్వర్క్ ఉండవు. ఒకటి రెండు సంవత్సరాలు పాత పద్ధతి ద్వారానే పత్తి కొనుగోలు చేయాలని అన్నారు. పత్తి, సోయా,మొక్క జొన్న, శనగ, వేరు శనగ పంటలకు కూడా బోనస్ ఇవ్వాలన్నారు. అదేవిధంగా రైతులు ఎవరుకూడా దళారులకు పంటలు అమి మోసపోవద్దని, అని ప్రభుత్వంతో పోరాడి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించే విధంగా చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల BRS పార్టీ నాయకులు, అధికారులు, రైతులు,  కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా

0

శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా

చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వెంకట రమణాచార్యులు కలెక్టర్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ఆలయ ప్రాశస్త్యాన్ని  వివరించారు.  కలెక్టర్ కుటుంబ సభ్యులకు ప్రసాదం అందజేసి ఆశీర్వచనాలు అందించారు. ఆలయ కమిటీ చైర్మన్ అడ్డి రుకేష్ రెడ్డి, మార్కెట్ ఛైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి కలెక్టర్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్ బీసీ సంఘాల బంద్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు 

0

ఆదిలాబాద్ బీసీ సంఘాల బంద్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు 

తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణుల బైక్ ర్యాలీ 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:

తెలంగాణ రాష్ట్ర బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో, 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం శనివారం చేపట్టిన బంద్ విజయవంతం అయ్యింది. ఇందులో భాగంగా ప్రజలు స్వచ్చందంగా బంద్ పాటించి బీసీ బిల్లుకు తమ మద్దతును  తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత  ఆధ్వర్యంలో బంద్ కు మద్దతు తెలుపుతూ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో ధర్నా చేపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ..సీఎం రేవంత్ రెడ్డీ అగ్రకులానికి చెందినప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముందుకు వెళుతున్నారని అన్నారు. బీసీ బిల్లు రిజర్వేషన్ ఆమోదం చెందితే ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వ ఖాతాలో పడుతుందో అని, బీసీల జీవితాలను మార్చడానికి కాంగ్రెస్ చిత్తశుద్ధితో తీసుకుంటున్న నిర్ణయాలకు అడుగడుగునా బీజేపీ, బీఆర్ఎస్ లు అడ్డుపడుతున్నాయని అన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని మునుముందు మరిన్ని ఆందోళనలు చేపట్టి బిల్లు ఆమోదం సాధించి తీరుతామని అన్నారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ బీసీ సంఘాల నాయకులు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చిక్కాల దత్తు, ప్రధాన కార్యదర్శి కలాల శ్రీనివాస్, బండారి సతీష్ , కాంగ్రెస్ మండల నాయకులు, మావల మండల కాంగ్రెస్ అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్ మాజీ ఎంపీపీ ఆట్ల గోవర్ధన్ రెడ్డి, బీసీ నాయకులు సురేష్ కుమార్, రేండ్ల రాజన్న, గౌతమ్, టౌన్ వైస్ ప్రెసిడెంట్ అలీం, శము,రహీమ్, బషీర్, ఫహీం, రాజ్ మొహమద్, రహీమ్ ఖాన్, రావుల ప్రవీణ్, అఫ్సర్, అజీమ్, అఫ్సర్ ఖాన్, హలీమ్, రాజేశ్వర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.