Home Blog Page 36

నూతన వధూవరులను ఆశీర్వదించిన డీసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి, లోక ప్రవీణ్ రెడ్డి 

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్ : ప్రముఖ వ్యాపార వేత్త, ఆదిలాబాద్ హోండా షోరూమ్ యజమాని రవీందర్ రెడ్డి కూతురు వివాహ వేడుకలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో ఘనంగా జరిగాయి. బుధవారం జరిగిన ఈ వివాహ వేడుకల్లో డీసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు, ప్రముఖ న్యాయవాది లోక ప్రవీణ్ రెడ్డి  పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరి వెంట పలువురు ఉన్నారు.

Cyber crime: సైబర్ నేరాలపై అవగాహన

0

చిత్రం న్యూస్, ముథోల్: నిర్మల్ జిల్లా ముథోల్ మండలం చించాల గ్రామంలో మంగళవారం రాత్రి పోలీసు శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, మూఢనమ్మకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  ఎస్ఐ బిట్ల పెర్సిస్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసినప్పుడు వారి మాటలను నమ్మి వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ సమాచారం, ఓటీపీ వంటి వివరాలు ఇవ్వకూడదని తెలిపారు. సదస్సులో సైబర్ నేరాల తీరుపై వీడియో రూపంలో ప్రదర్శన ఇస్తూ ప్రజలకు అవగాహన కలిగించారు. అదే విధంగా ప్రముఖ మెజీషియన్ సుధాకర్ మూఢనమ్మకాల వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ప్రదర్శనలు చేశారు. గ్రామస్థులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Aadhaar Update: నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి!

0

చిత్రం న్యూస్, హైదరాబాద్: ఆధార్ సంస్థ UIDAI నవంబర్ 1 నుంచి కొన్ని కొత్త రూల్స్ అమలు చేయనుంది. ఇందులో భాగంగా ఇంటి నుంచే ఆధార్ కార్డుకు సంబంధించిన వివరాలు అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆధార్ సెంటర్ల వద్ద క్యూలో నిల్చొనే పని లేకుండా అప్‌డేటింగ్ ప్రాసెస్ ఇప్పుడు సింపుల్ అయింది. మీ పేరు, చిరునామా, పుట్టిన తేదీ లేదా మొబైల్ నంబర్.. ఇలా ప్రతిదీ ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. దీంతోపాటు మరికొన్ని రూల్స్ కూడా మారబోతున్నాయి. అవేంటంటే..

*గవర్నమెంట్ ఐడీ ఉపయోగించి..ఆధార్ లో ఏవైనా కరెక్షన్స్ చేసుకోవాలంటే.. దానికోసం మీరు ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉండేది. ఇప్పుడు, మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్‌లో చేయవచ్చు. కార్డుదారులు తమ వివరాలు మార్చుకోవడం కోసం ప్రభుత్వ గుర్తింపు కార్డులను ఉపయోగించాల్సి ఉంటుంది. పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్, జనన ధృవీకరణ పత్రం వంటి అధికారిక ప్రభుత్వ పత్రాలు సాయంతో మీరు మీ ఆధార్ వివరాలను అప్ డేట్ చేసుకోవచ్చు. అలాగే అప్ డేట్ ఛార్జీలు కూడా కొన్ని మారాయి. పేరు, చిరునామా లేదా మొబైల్ నంబర్‌ అప్ డేట్ కి రూ. 75,  వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ లేదా ఫొటో అప్ డేట్ కి రూ.125,  5 ఏళ్ల నుంచి 7 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు, 15 నుండి 17 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు బయోమెట్రిక్ అప్ డేట్ ఉచితం. ఆధార్ రీప్రింట్ అభ్యర్థనలకు రూ.40గా నిర్ణయించారు.

*ఆధార్– పాన్ లింక్: నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ తమ పాన్ కార్డుని ఆధార్ కార్డుతో లింక్ చేయాలి. ఈ ప్రాసెస్ డిసెంబర్ 31, 2025 కల్లా పూర్తి చేయాలి. ఒకవేళ లింక్ చేయకపోతే జనవరి 1, 2026 నుండి పాన్ కార్డ్ చెల్లదు.

*ఈజీ కేవైసీ: నవంబర్ 1 నుంచి కేవైసీ ప్రాసెస్ చాలా ఈజీ అవ్వనుంది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు కెవైసీ(KYC) చేయడానికి ఇక నుంచి ఆధార్ నెంబర్ సరిపోతుంది. ఆధార్ నెంబర్ ఉపయోగించి ఓటీపీ ద్వారా ధృవీకరించి కెవైసీ పూర్తి చేయొచ్చు. అలాగే వీడియో కన్ఫర్మేషన్ లేదా ఫేస్ టు ఫేస్ వెరిఫికేషన్ ద్వారా కూడా కేవైసీ పూర్తి చేయొచ్చు.

బోథ్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మౌలిక వసతులు కరవు

0

గాజు సీసా కుచ్చుకొని రైతుకు గాయం

చిత్రం న్యూస్, బోథ్ : రైతులు పండించిన పంటను అమ్మడానికి వచ్చిన రైతులకు బోథ్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మౌలిక వసతులు కరవయ్యాయి. తాగడానికి నీరు, మరుగుదొడ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్ యార్డు ఆవరణలో  మందు బాబులు తాగి సీసాలను పగలగొట్టడంతో  రైతులు పంటను ఆరబెట్టలేని స్థితి నెలకొంది.పశువులు లోనికి రావడంతో వల్ల చాలా ఇబ్బంది ఏర్పడుతోందని రైతులు పేర్కొంటున్నారు. ప్రతి యేటా కొనుగోళ్లు జరుగుతున్నా  మార్కెట్ అధికారులు మౌలిక వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు.మంగళవారం పంటను ఆరబెట్టడానికి వచ్చిన రైతుకు గాజు సీసా కుచ్చుకోవడంతో గాయం అయింది. వెంటనే అతన్ని హాస్పిటల్ కు తరలించారు. మార్కెట్ యార్డులో  మౌలిక వసతులు కల్పించాలని రైతులు కోరుతున్నారు.

 

బోథ్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మౌలిక వసతులు కరవు

0

గాజు సీసా కుచ్చుకొని రైతుకు గాయం

చిత్రం న్యూస్, బోథ్ : రైతులు పండించిన పంటను అమ్మడానికి వచ్చిన రైతులకు బోథ్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మౌలిక వసతులు కరవయ్యాయి. తాగడానికి నీరు, మరుగుదొడ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్ యార్డు ఆవరణలో  మందు బాబులు తాగి సీసాలను పగలగొట్టడంతో  రైతులు పంటను ఆరబెట్టలేని స్థితి నెలకొంది.పశువులు లోనికి రావడంతో చాలా ఇబ్బంది ఏర్పడుతోందని రైతులు పేర్కొంటున్నారు. ప్రతి యేటా కొనుగోళ్లు జరుగుతున్నా  మార్కెట్ అధికారులు మౌలిక వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు.మంగళవారం పంటను ఆరబెట్టడానికి వచ్చిన రైతుకు గాజు సీసా కుచ్చుకొని  గాయం అయింది. వెంటనే అతన్ని హాస్పిటల్ కు తరలించారు. మార్కెట్ యార్డులో  మౌలిక వసతులు కల్పించాలని రైతులు కోరుతున్నారు.

 

సోయాబీన్ పంట కొనుగోలుపై కలెక్టర్ కు రైతుల విజ్ఞప్తి

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ పంట కొనుగోలుకు సంబంధించి కిసాన్ మోర్చా జైనథ్ మండల అధ్యక్షులు ఏనుగు రాకేష్ రెడ్డి జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా కు వినతి పత్రం సమర్పించారు. జిల్లాలో అత్యధికంగా పండించే సోయాబీన్ పంటను ప్రైవేట్ వ్యాపారులు క్వింటాల్‌కు ₹3,900 నుండి ₹4,200 వరకు కొనుగోలు చేస్తుండగా, ప్రభుత్వ మద్దతు ధర ₹5,360గా ఉందన్నారు. రైతుల తరపున మార్క్‌ఫెడ్ అధికారులు రెండు, మూడు రోజుల్లో పంట కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. గతంలో ముంపుకు గురైన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని, ఈ సంవత్సరం అధిక వర్షాలతో నష్టపోయిన రైతులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలని కోరారు. వారి వెంట రైతులు సాయిప్రసాద్, అడ్డి అనిల్ రెడ్డి, గంగం స్వామి రెడ్డి, పబ్బు స్వామి, శబ్బష్ ఖాన్, ఆస్ర వేంకన్న తదితరులు ఉన్నారు.

అఖిల్ రెడ్డి చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించిన లోక ప్రవీణ్ రెడ్డి

0

చిత్రం న్యూస్, బేల: కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డి బావ మరిది అఖిల్ రెడ్డి ఇటీవల హఠాన్మరణం చెందారు. కాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు లోక ప్రవీణ్ రెడ్డి బేల మండలంలోని సిర్సన్న గ్రామానికి వెళ్లి అఖిల్ రెడ్డి చిత్రపటానికి సోమవారం పుష్పాంజలి ఘటించారు.  ఆయన మృతి తీరని లోటని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. లోక ప్రవీణ్ రెడ్డితో  పాటు సయ్యద్ ఇమ్రాన్, గడ్డం శ్రీకాంత్ రెడ్డి, రాం రెడ్డి తదితర కాంగ్రెస్ శ్రేణులు పుష్పాంజలి ఘటించిన వారిలో ఉన్నారు.

బేల నూతన ఎంపీడీవోగా ఆంజనేయులు

0

బేల నూతన ఎంపీడీవోగా ఆంజనేయులు

చిత్రం న్యూస్, బేల : ఆదిలాబాద్ జిల్లా బేల మండలం నూతన ఎంపీడీవోగా ఆంజనేయులు బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో  బాధ్యతలు స్వీకరించిన ఆయనకు కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

 

బేలలో సోయా కొనుగోలు చేయకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ఆందోళన

0

బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పాల్గొన్న మాజీమంత్రి జోగు రామన్న

చిత్రం న్యూస్, బేల :ఆదిలాబాద్ జిల్లా బేల మండలం కేంద్రంలో సబ్ మార్కెట్ యార్డులో మార్కెట్ అధికారులు సోమవారం సోయా కొనుగోలు ప్రారంభిస్తామని చెప్పి మాట తప్పడంతో  బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సోయా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాజీ మంత్రి జోగు రామన్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి సోయా పంటను చూపిస్తూ బేల జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి రైతు సమస్యలు పరిష్కరించాలని రహదారి దిగ్బంధం చేశారు. తక్షణం పంట కొనుగోలు ప్రారంభించకుంటే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కళ్లెం ప్రమోద్ రెడ్డి,  యువ నాయకుడు సతీష్ పవార్, నాయకులు గంభీర్ ఠాక్రే, విపిన్ ఖోడే, మస్కె తేజరావు, ఆకాశ్ గుండావార్, మిలింద్ నాగ్పురే తదితరులు పాల్గొన్నారు.

సోయా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రైతుల ధర్నా 

0

*రోడ్డుపైనే వంట వార్పు

*అధికారుల హామీతో ధర్నా విరమించిన రైతులు

చిత్రం న్యూస్, సొనాల:కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని కోరుతూ సొనాల మండల కేంద్రంలో సోమవారం రైతులు ధర్నాను నిర్వహించారు. వంట వార్పు చేసి అక్కడే భోజనం తిన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. రైతులు పండించిన సోయా, మొక్కజొన్న పంట చేతికొచ్చి ఒకపక్క తడిచి పోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు చూస్తుందన్నారు. గత పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం సొనాల మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు పంటలను కొనుగోలు చేసి, రైతుల ఖాతాల్లో  డబ్బులు జమచేసేవారని, ఇప్పుడు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవడం సిగ్గుచేటన్నారు. అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని ఎటువంటి నిబంధన లేకుండా కొనుగోలు చేయాలని, రైతులకు రావలసిన రైతుబంధు విడుదల చేయాలని, పత్తి పంటను పాత పద్ధతి ద్వారానే కొనుగోలు చేయాలని అన్నారు.  విషయం తెలుసుకున్న మండల తహసీల్దార్ ఇమ్రాన్ ఖాన్, సీఐ గురుస్వామి,  ఏవో అక్కడకు చేరుకొని సముదాయించారు. అధికారుల హామీతో రైతులు ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు ముత్తన్న, జనార్ధన్ ,ఇర్ల అభిలాష్, భీంరావు పాటిల్, యాల్ల సుధీర్ రెడ్డి, హరీష్, లంక లలిత, రామ్ కిషన్, వినోద్, సంజీవరెడ్డి, సుగుణాకర్ తుల, అభిలాష్, రాజన్న, ప్రదీప్, కృష్ణ, ఈశ్వర్, సంతోష్ ఇర్ల శ్రీధర్, నవీన్, శ్రీకాంత్, విట్టల్, మహేష్, ఆసిఫ్ షేక్, శ్రీనివాస్, వివిధ గ్రామాల రైతులు ,తదితరులు పాల్గొన్నారు.