Home Blog Page 35

రిజిస్టర్ లో సంతకం పెట్టి.. పాఠశాలకు డుమ్మా కొట్టిన హెచ్ఎం 

0

రిజిస్టర్ లో సంతకం పెట్టి.. పాఠశాలకు డుమ్మా కొట్టిన హెచ్ఎం

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం చప్రాల గ్రామం లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాఠశాలకు వచ్చి రిజిస్టర్ లో సంతకం పెట్టి పెళ్లి ఉందని డుమ్మా కొట్టి వెళ్ళిపోయాడు. సోమవారం విద్యార్థులు పాఠశాల ఆరు బయట ఎందుకు తిరుగుతున్నారని గమనించిన గ్రామ సర్పంచ్ మెస్రం దౌలత్ రావ్, ఉప సర్పంచ్ ఠాక్రె సాగర్ పాఠశాలకు వచ్చి విద్యార్థులను అడిగారు. ప్రధానోపాధ్యాయుడు జైవంత్ రావ్ బడికి వచ్చి సంతకం పెట్టి నేను వెళ్తున్నాను. మీలో ఒకరు చూసుకోవాలని చెప్పి వెళ్ళిపోయాడని విద్యార్థులు సర్పంచ్, ఉపసర్పంచ్ లకు సమాధానం ఇచ్చారు. మా ప్రధానోపాధ్యాయులు బడికి వచ్చి ఎలాంటి పాఠాలు చెప్పకుండా కేవలం ఫోన్ చూస్తూ ఉంటాడని ఈ ప్రధానోపాధ్యాయుడు మాకు వద్దని సర్పంచ్ కి విద్యార్థులు చెప్పారు.

ఈ సందర్బంగా ఉప సర్పంచ్ ఠాక్రె సాగర్ మాట్లాడుతూ ప్రభుత్వ బడులను బలోపేతం కోసం కొన్ని కోట్లు ఖర్చు చేస్తుందని కానీ ఇలాంటి ఉపాధ్యాయులు ఉంటే విద్యార్థుల భవిష్యత్తు ఏం బాగుపడుతుందని అన్నారు. ఇక్కడ ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారని ఒక్కరు ట్రైనింగ్ కోసం వెళ్లారని ఉన్న ప్రధానోపాధ్యాయులు కూడా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని అన్నారు. ఇలా చేయడం ఒక్కసారి కాదు పలుమార్లు ప్రధానోపాధ్యాయుడు వచ్చి సంతకం పెట్టి వెళ్లిపోయిన దాఖలాలు ఉన్నాయన్నారు. ప్రైవేట్ బడి వద్దు ప్రభుత్వ బడి ముద్దు అని మేము ప్రచారం చేసి ప్రభుత్వ పాఠశాలను బలోపేతానికి కృషి చేస్తే ఈ ప్రధానోపాధ్యాయుడి పనితీరు ఇలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి హెచ్ఎం రాథోడ్ జైవంత్ రావ్ ని వెంటనే సస్పెండ్ చేయాలనీ కోరారు.

బాసరలో ఘనంగా అక్షయ తృతీయ వేడుకలు 

0

బాసరలో ఘనంగా అక్షయ తృతీయ వేడుకలు 

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో అక్షయ తృతీయ పురస్కరించుకుని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. సోమవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది తరలివచ్చారు. అమ్మవారికి వైదిక బృందం ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. బంగారు లక్ష్మిగా దర్శనమిచ్చిన అమ్మవారి సన్నిధిలో తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక నామస్మరణతో మార్మోగింది. అక్షయ తృతీయ రోజున గురుపూజోత్సవం సకల శుభాలను ఇస్తుందని,  మంత్ర అనుష్టానం చేస్తే సకల శుభాలు కలుగుతాయని వైదికులు వెల్లడించారు. అయితే భక్తుల రద్దీ కారణంగా అమ్మవారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతోందని ఆలయ ఏఈఓ శ్రీనివాస్ వెల్లడించారు.

బేలలో అక్షయ తృతీయ విత్తన కొనుగోళ్ల జోరు

0

బేలలో అక్షయ తృతీయ విత్తన కొనుగోళ్ల జోరు

చిత్రం న్యూస్,బేల: మండల కేంద్రంలోని విత్తన మరియు ఎరువుల దుకాణాలు రైతులతో కిటకిటలాడుతున్నాయి. అక్షయ తృతీయ రోజున విత్తనాలు కొనుగోలు చేస్తే పంటలు సమృద్ధిగా పండుతాయని, లక్ష్మీదేవి కటాక్షం కలిగి ఆర్థికంగా అభివృద్ధి చెందుతామని ఈ ప్రాంత రైతుల ప్రబల విశ్వాసం. ఈ నేపథ్యంలో, ఆదిలాబాద్ జిల్లాలోని బేల మండల రైతులు ఉదయాన్నే దుకాణాల వద్ద క్యూ కట్టారు. సాధారణంగా ప్రజలు బంగారం కొనుగోలుకు మొగ్గు చూపితే, అన్నదాతలు మాత్రం వ్యవసాయానికి పునాది అయిన విత్తనాలనే ‘పచ్చని బంగారం’గా భావిస్తారు. ముఖ్యంగా పత్తి, సోయాబీన్ వంటి ఖరీఫ్ పంటల విత్తనాలను కొనుగోలు చేయడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. అక్షయ తృతీయ రోజున విత్తన సేకరణ చేయడం ద్వారా ఆ ఏడాది సాగు పనులు లాభసాటిగా సాగుతాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే వర్షాకాలం (ఖరీఫ్ సీజన్) కోసం ముందస్తుగానే మేలైన విత్తనాలను సేకరించి పెట్టుకుంటున్నారు. దుకాణదారుల వద్ద లభించే వివిధ రకాల హైబ్రిడ్ విత్తనాల ప్యాకెట్లను పరిశీలిస్తూ, తమ పొలాలకు తగిన వాటిని రైతులు ఎంచుకుంటున్నారు. ఈ సందర్భంగా బేల విత్తన విక్రయ కేంద్రాల వద్ద పండగ వాతావరణం కనిపించింది.

ఆదిలాబాద్‌లో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్‌కు ఘన స్వాగతం

0

ఆదిలాబాద్‌లో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్‌కు ఘన స్వాగతం

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్ కల్వ సుజాత గుప్తా ను ఆదిలాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష సతీష్ దంపతులు, అత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. అదేవిధంగా, కొత్తగా ఎన్నికైన మున్సిపల్ చైర్‌పర్సన్ దంపతులను కూడా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్ కల్వ సుజాత గుప్తా శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల డిప్యూటేషన్లను రద్దు చేయాలి

0

 ఉపాధ్యాయుల డిప్యూటేషన్లను రద్దు చేయాలి

*పీఆర్టీయూ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి డిమాండ్

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో:  2023లో వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో జరిపిన డిప్యూటేషన్లలోనే ఉపాధ్యాయులు నేటికీ కొనసాగుతున్నారని ఉపాధ్యాయుల డిప్యూటేషన్లను రద్దు చేయాలని పీఆర్టీయూ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ గతంలో సర్దుబాటు ప్రక్రియ అవసరం లేనప్పటికీ ఉపాధ్యాయుల్ని మరో పాఠశాలకు తరలించారనే ఆరోపణలు ప్రస్తుత డీఈఓ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, కలెక్టర్ నిర్ణయం తీసుకోవాల్సిందని దాటవేశారన్నారు. అప్పటి కలెక్టర్ కి  పీఆర్టీయూ తెలంగాణ ప్రాతినిధ్యం చేసినప్పటికీ డీఈఓ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకుండా దాటవేశారని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రయోజనాలు పక్కకు పెట్టి ఉపాధ్యాయులు, సంఘాల ప్రయోజనాల మేరకు ఉత్తర్వులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. బదిలీలు, పదోన్నతులు పూర్తిచేసి నూతన డీఎస్సీతో కొత్త ఉపాధ్యాయులను నియమించినప్పటికీ అయినా సర్దుబాటు చేసిన వారు యథాస్థానాలకు రాకుండా అక్కడే కొనసాగుతున్నారన్నారు. తక్షణమే ఈ విద్యా సంవత్సరం ఆఖరి నాటికి ఉపాధ్యాయులను వారి సొంత పోస్టింగ్ లో పంపాలని, అన్ని కేటగిరీల డిప్యూటేషన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు

ఘనంగా అగ్నిమాపక శాఖ వాహన ర్యాలీ

0

ఘనంగా అగ్నిమాపక శాఖ వాహన ర్యాలీ

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ నగరంలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వాహన ర్యాలీ ఘనంగా జరిగింది. ఫైర్ స్టేషన్ నిజామాబాద్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ పులాంగ్ చౌరస్తా, ఆర్‌ఆర్ చౌరస్తా, నెహ్రూ పార్క్, గాంధీ చౌక్, దేవి రోడ్, ఆర్టీసీ డిపో-1, రైల్వే స్టేషన్, ఎన్‌టీఆర్ సర్కిల్, జిల్లా కోర్టు మార్గంగా కొనసాగి తిరిగి ఫైర్ స్టేషన్‌కు చేరుకుంది. ప్రజల్లో అగ్నిప్రమాదాలపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. అధికారులు, సిబ్బంది సమన్వయంతో ర్యాలీ సజావుగా సాగింది.

మహిళా బిల్లు విషయంలో మోదీ సర్కార్‌ది కుట్ర: డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్

0

మహిళా బిల్లు విషయంలో మోదీ సర్కార్‌ది కుట్ర: డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడానికి బీజేపీ ప్రభుత్వమే కారణమని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళా బిల్లు చట్టం ముసుగులో 131 సవరణలతో డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల సవరణ చట్టం తీసుకురావడమే కేంద్ర ప్రభుత్వ అసలు లక్ష్యమని ఆయన ఆరోపించారు. కులగణన చేయకుండా డీలిమిటేషన్ చట్టాన్ని ఎలా తీసుకువస్తారని ఆయన ప్రశ్నించారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంలో బీజేపీకి చిత్తశుద్ధి లేదని, మోదీ మరియు బీజేపీ నాయకులు మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్లు కల్పించిందని, మహిళలను దేశ ప్రధానిగా, రాష్ట్రపతిగా, లోక్ సభ స్పీకర్‌గా గౌరవించిందని గుర్తుచేశారు. నిజంగా మోదీకి చిత్తశుద్ధి ఉంటే, కేవలం మహిళా రిజర్వేషన్ కల్పించే చట్టాన్ని తీసుకురావాలి. డెలిమిటేషన్‌తో ముడిపెడితే కాంగ్రెస్ పార్టీ సహకరించదాని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ గండ్రత్ సుజాత, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజ రెడ్డి, బోరంచు శ్రీకాంత్ రెడ్డి మరియు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ముందుగానే వికసించిన మే పుష్పం

0

ముందుగానే వికసించిన మే పుష్పం

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: పత్రి సంవత్సరం మే లో వికసించే మే పుష్పం ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉండటం వలన ఏప్రిల్ నెలలోనే వికసించింది. నగరంలోని ఎల్లమ్మ గుట్టలో నివాసముండే రిటైర్డ్ ప్రభుత్వ హెడ్ మాస్టర్ మాడవేడి పవన్ కుమార్ స్వగృహంలోని పూల కుండీ లో ఆదివారం రెండు మే పుష్పాలు వికసించాయని ఆయన తెలిపారు. ఈ విషయం తెలిసిన కాలనీ వాసులు పుష్పాలను ఉత్సాహంగా తిలకిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

0

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. జిల్లా వాసులంతా సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు ఆయన  తెలిపారు.

స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాలలో ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం

0

స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాలలో ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లో గల సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో ఇమోఫిలియా సొసైటీ నిజామాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో రోచ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ముంబై సహకారంతో స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాలలొ ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం సందర్భంగా హీమోఫిలియా వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్:గంగారం మరియు ఇన్నమురీ రవితేజ,డాక్టర్:రఘు, డాక్టర్:సంతోష్ దంత వైద్యులు డాక్టర్: జగదీష్ ఫిజియోథెరపిస్ట్ , స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్. సిద్దయ్య హిమఫిలియా సొసైటీ అధ్యక్షులు దాసరి విజయనందరావు లు పాల్గొని హిమోఫిలియా వ్యాధి గురించి పలు సలహాలు, సూచనలు తెలియజేశారు. అయితే హిమోఫిలియా వ్యాధి అనేది ఒక రాజవంశపు వ్యాధిగా పేర్కొంటారన్నారు. కొందరికి జన్యుపరంగా వచ్చే ఆస్కారం ఉంటుందన్నారు. ఇది అన్ని వ్యాధుల మాదిరిగానే ఈ వ్యాధి కూడా ఒకటని సూచించారు. అయితే ఏ వ్యాధికైనా వైద్యులు చెప్పినట్టు జాగ్రత్తలు పాటిస్తే తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జీవితాన్ని ఆహ్లాదంగా ఆస్వాదించవచ్చు అన్నారు.అలాగే వ్యాధి వచ్చిందని మానసిక కుంగుబాటుకు గురైనట్లయితే శారీరక దృఢత్వం కోల్పోవడం జరుగుతుందని దాంతోపాటు అనారోగ్యం బారిన మరింత ఎక్కువ పడతారని సూచించారు.మీరు ఎప్పుడైతే మానసిక దృఢత్వంతో ఉంటారో వ్యాధిని అధిగమించవచ్చని హీమోఫిలియా వ్యాధిగ్రస్తులు మరియు వారి తల్లిదండ్రుల్లో మానసిక ధైర్యాన్ని నింపారు.అలాగే జాగ్రత్తలు పాటించాలని సూచించారు.అలాగే దంత వైద్య నిపుణులు మాట్లాడుతూ హిమోఫిలియా బారిన పడ్డవారు దంతాలు, చిగురుల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా బ్రష్ చేయాలి. ఎప్పుడు రక్తస్రావం జరుగుతుంది అలా జరగకుండా ఎలా ఉండాలని క్లుప్తంగా వివరించారు.అలాగే ఫిజియోథెరపీ వైద్యుడు జగదీష్ మాట్లాడుతూ.. దినచర్యలో భాగంగా వ్యాయామం ఏ విధంగా చేయాలి ఆటలు ఏ విధంగా ఆడుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో క్లుప్తంగా వివరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా విచ్చేసిన వైద్యులను హిమోఫిలియా సొసైటీ చాప్టర్ నిజామాబాద్ అధ్యక్షులు దాసరి విజయ్ నంద రావు మరియు చాప్టర్ సభ్యులు అంబరీష్, యజాస్ హిమోఫిలియా సొసైటీ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో శాలువలు జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు.