Home Blog Page 32

ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: భారత దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లోక ప్రవీణ్ రెడ్డి నెహ్రూ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి నెహ్రూ చేసిన సేవలను  ఆయన కొనియాడారు.  ఆయా వెంట కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారు.

సిరిసిల్ల రాజయ్య”ను కలిసిన లోక ప్రవీణ్ రెడ్డి

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ “సిరిసిల్ల రాజయ్య”ను  కాంగ్రెస్ సీనియర్ నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి, తలమడుగు మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి కలిశారు. బుధవారం ఉదయపు నడకకు వచ్చిన ఆయన్ను కలిశారు. ఆదిలాబాద్ లో జడ్పీ సీఈవోగా పనిచేసిన రోజులను గుర్తు చేసుకుంటూ సరదాగా ముచ్చటించారు. వీరి వెంట డేరా కృష్ణారెడ్డి,  మేకల మల్లన్న తదితరులు ఉన్నారు.

 

 

ప్రభుత్వ పాఠశాలకు పూర్వ విద్యార్థి చేయూత

0

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలం ఓని గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థుల కోసం పూర్వ విద్యార్ధి కదం యోగేష్ పాఠశాలకు  canon colour printer ను విరాళంగా అందజేసి ఉదారత చాటుకున్నాడు. ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్, టీచర్ మౌనిక చేతుల మీదుగా అందజేశాడు. సుమారు వీటి విలువ రూ.6,500 వరకు ఉంటుందని అన్నారు. ఇక్కడే ప్రభుత్వ పాఠశాలలో 20 సంవత్సరాల క్రితం చదివి ఇదే పాఠశాలకు తనకు తోచిన కాడికి ఆర్థిక సాయం అందించినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉందని యోగేష్ అన్నారు. గ్రామస్తులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతికి కారణమైన నిందితుడు అరెస్టు

0

చిత్రం న్యూస్, బోథ్ : బోథ్ పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలోని బజార్ హత్నూర్ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం చెందిన ఘటనలో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు బోథ్ సీఐ గురు స్వామి తెలిపారు. ఎస్ఐ శ్రీ సాయితో కలిసి వివరాలు ఆయన వెల్లడించారు. ఈ నెల 9న సాయంత్రం సుమారు 6:30 గంటలకు బజార్ హత్నూర్ గ్రామానికి చెందిన చేవుల రత్నమాల (48) తన కుమారుడు చేవుల లక్ష్మణ్ (22) తో కలిసి వ్యవసాయ పనులు ముగించుకొని ఎడ్లబండిపై గ్రామానికి వెళ్తుండగా..అదే సమయంలో తరడపు ప్రదీప్ కుమార్ అనే వ్యక్తి తన కారును మద్యం మత్తులో అత్యంత నిర్లక్ష్యంగా, వేగంగా నడుపుతూ గ్రామ శివారులో ఎడ్లబండిని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో బాధితురాలు చేవుల రత్నమాల గాయాలతో అక్కడికక్కడే మరణించగా.. కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న  పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మద్యం తాగి వాహనాన్ని నిర్లక్ష్యంగా నడిపినట్లు నిర్ధారణ కావడంతో బోథ్ సీఐ గురు స్వామి పర్యవేక్షణలో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.

ఈ నెల 18 నుంచి డిగ్రీ పరీక్షలు

0

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం కేంద్రం లోని కాకతీయ  యూనివర్సిటీ పరిధిలో మొదటి, మూడవ, అయిదవ సెమిస్టర్ విద్యార్థులకు పరీక్షలు ఈ నెల 18 నుంచి ఉంటాయని కీర్తన డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్ డా. వేముగంటి వరప్రసాద్ రావు ఒక ప్రకటన లో తెలిపారు. మొదటి సెమిస్టర్ వాళ్లకు 5 సబ్జెక్టు లు మాత్రమే ఉంటాయని, సమయం తక్కువ ఉందని విద్యార్థులు కష్టపడి ప్రిపేర్ కావాలన్నారు. పూర్తి వివరాలకు అనికేత్ సాగర్ ను సంప్రదించాలి అని ఆయన  పేర్కొన్నారు.

ఫీజు అధికంగా వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోండి-AISF బోథ్ మండల అధ్యక్షులు మున్సిఫ్

0

చిత్రం న్యూస్, బోథ్ :ఆదిలాబాద్ జిల్లా బోథ్ పట్టణంలో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు పదో తరగతి విద్యార్థుల నుండి ప్రభుత్వం నిర్ణయించిన ₹125 ఎగ్జామ్ ఫీజు బదులు ₹700 నుండి ₹1000 వరకు వసూలు చేస్తున్నాయని AISF మండల అధ్యక్షుడు మున్సిఫ్ ఆరోపించారు. ఈ అంశంపై బోథ్ ఎంఈఓ కు AISF ప్రతినిధులతో కలిసి మంగళవారం మెమొరాండం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విద్యార్థుల తల్లిదండ్రులపై అదనపు భారం మోపుతూ, అన్యాయంగా అధిక ఫీజులు వసూలు చేయడం దోపిడీగా పేర్కొన్నారు. ఈ అన్యాయ వసూళ్లపై వెంటనే తనిఖీలు జరిపి, సంబంధిత పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  నాయకులు పి.కార్తీక్, L.నరేష్, R.ప్రేమ్ పాల్గొన్నారు.

ఉదారత చాటిన  ప్రధానోపాధ్యాయుడు మహేందర్ 

0

చిత్రం న్యూస్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని నక్కలవాడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న రావుల మహేందర్, పాఠశాలలోని పిల్లందరికి టై, బెల్ట్ ఉచితంగా అందజేసి తన ఉదారతాను చాటుకున్నాడు. పాఠశాలలోని పిల్లలందరికి MEO  మహాముద్ హుస్సేన్ చేతుల మీదుగా టై, బెల్ట్ అందజేశారు.ఈ సందర్బంగా M. E.O మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు ఆర్థికంగా చాలా వెనకబడిన వారని, వారికి చదువుతో పాటు ఇలాంటి కార్యక్రమాల ద్వారా వారి ఉన్నతికి సహాయ పడుతున్న రావుల మహేందర్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయడు సంగు స్వామి, PRTUTS మీడియా ఇంచార్జ్ R.రవిరాజ్, గ్రామస్తులు పాల్గొన్నారు.

తెలంగాణకు చలి హెచ్చరిక: రాబోయే పది రోజులు గజగజే!

0

చిత్రం న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత గణనీయంగా పెరగనుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నవంబర్ 11 నుండి 19 వరకు, ముఖ్యంగా నవంబర్ 13 నుండి 17 మధ్య కాలంలో, రాష్ట్రవ్యాప్తంగా బలమైన శీతల వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఇది గత ఏడేళ్లలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సుమారు 8 నుండి 10 రోజుల పాటు చలి ప్రభావం అధికంగా ఉండనుంది.

మ్యాప్‌లో పింక్ రంగుతో గుర్తించిన ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుము రంభీం, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి వంటి జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు (10°C కంటే తక్కువ) పడిపోవచ్చు. బ్లూ రంగుతో గుర్తించిన హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఉదయం ఉష్ణోగ్రతలు 11°C నుండి 14°C మధ్య నమోదయ్యే అవకాశం ఉంది.

గ్రీన్ రంగుతో గుర్తించిన దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో (ముఖ్యంగా ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో) ఉష్ణోగ్రతలు 14°C నుండి 17°C వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది.

చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారు చలి నుండి రక్షణ పొందేందుకు వెచ్చని దుస్తులు ధరించడం ఉత్తమం.

సాయిలింగి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం

0

చిత్రం న్యూస్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సాయిలింగి వృద్ధాశ్రమంలో ఆదివారం అడప లచ్చన్న ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆయన సతీమణి గౌరు బాయి జ్ఞాపకార్థం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు తదితరులున్నారు.

భారత హాకీకి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంబరాలు 

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: భారత హాకీకి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శనివారం ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు లోక్ ప్రవీణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భారత హాకీ సమాఖ్య (IHF)కు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (FIH) గుర్తింపు లభించి 7 నవంబర్  2025తో వందేళ్ల మైలురాయిని చేరిందన్నారు. గ్రామీణ ప్రాంతంలో  ఉన్న క్రీడాకారులు ఇతర క్రీడలతో పాటు హాకీలోను రాణించి జాతీయ స్థాయికి ఎదగాలన్నారు. క్రీడలతో శారీరక ధారుడ్యంతో పాటు మానసికోల్లాసం  కలుగుతుందన్నారు. హాకీలో గెలిచిన క్రీడాకారులకు లోక ప్రవీణ్ రెడ్డి ట్రోఫీలను అందజేశారు. కార్యక్రమంలో  గిరిజన క్రీడల అధికారి కోరెడ్డి పార్థ సారథి, కోచ్ రాజు తదితరులు పాల్గొన్నారు.