Home Blog Page 124

దుర్గామాత సేవలో మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి

0

దుర్గామాత సేవలో మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి

చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని దేగాం గ్రామంలో శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన దుర్గామాత పూజ లో మాజీ ఎమ్మెల్యే విఠల్  రెడ్డి పాల్గొన్నారు. త్రినేత్ర యూత్ సభ్యులు, గ్రామస్థులు ఆహ్వానం మేరకు ఆయన గ్రామానికి వచ్చి పూజలో పాల్గొన్నారు. స్థానిక త్రినేత్ర యూత్ సభ్యులు , గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం దుర్గామాత పూజలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తర్వాత ఆయన్ను త్రినేత్ర యూత్ సభ్యులు, గ్రామస్తులు పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి బీ.శ్రీను, వీడిసీ అధ్యక్షుడు లింగన్న, గడోళ్ల నరేష్, భోజన్న, జయందర్, గణేష్, మహేష్, సంతోష్, శ్రీకాంత్, అచ్యుత్, సతీష్, నవీన్, సోను తధితరులు పాల్గొన్నారు.

బాసర ఆలయానికి పోటెత్తిన భక్త జనం  

0

బాసర ఆలయానికి పోటెత్తిన భక్త జనం 

* ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిట

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం బాసర ఆలయానికి భక్తులు శుక్రవారం పోటెత్తారు. సరస్వతీ దేవి స్కంద మాత అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు అమ్మవారి దర్శనానికి క్యూ కట్టారు.  సుమారు రెండు గంటల సమయం వేచి ఉండాల్సి వచ్చింది.

తెలంగాణలోని వివిధ ప్రాంతాల ప్రజలతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వివిధ రాష్ట్రాల నుండి భక్తులు తరలివస్తున్నారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. అక్షరాభ్యాసం చేయించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో అంజనీదేవి, ఎస్సై శ్రీనివాస్  ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.

తనిఖీల్లో పట్టుబడి బైండోవర్ అయిన మద్యం బాటిళ్లు ధ్వంసం

0

తనిఖీల్లో పట్టుబడి బైండోవర్ అయిన మద్యం బాటిళ్లు ధ్వంసం

చిత్రం న్యూస్, బోథ్ :  ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం ఎక్సైజ్ శాఖ, బోథ్ పోలీసుల ఆధ్వర్యంలో రూ.2 లక్షల విలువ గల మద్యం బాటిళ్లను గురువారం రాత్రిధ్వంసం చేశారు. ఇటీవల ధన్నూర్, కౌట, మర్లపెల్లి గ్రామాలలో తనిఖీల్లో పట్టుబడ్డ మద్యం బాటిళ్లను స్టేషన్ ఆవరణలో జేసీబీతో గుంత తవ్వి అందులో వేసి నిబంధనల మేరకు ధ్వంసం చేసినట్లు ఎస్సై శ్రీసాయికుమార్ తెలిపారు.

స్కంద మాత అలంకారంలో భక్తులకు దర్శనం

0

స్కంద మాత అలంకారంలో భక్తులకు దర్శనం

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు స్కంద మాత రూపంలో శుక్రవారం  భక్తులకు దర్శనమిచ్చారు.  అమ్మవారిని వేద పండితులు వేద మంత్రోచ్ఛారణాలతో, ప్రత్యేక పూజలతో అమ్మవారిని కొలిచారు. వైదిక బృందం వేకువ జామున చతుషష్టి ఉపచార పూజలు, మహా హారతి ఇచ్చారు. అనంతరం పెరుగు అన్నంను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. వేకువ జాము నుంచే భక్తులు గోదావరి నదిలో స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకోవడానికి వరుసలో బారులు తీరారు. అమ్మవారిని దర్శించుకొని  మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, పోలీస్ సిబ్బంది ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

నేరాల నియంత్రణ కే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రొగ్రాం:ముథోల్ సీఐ మల్లేష్

0

నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రొగ్రాం:ముథోల్ సీఐ మల్లేష్

*జిల్లా ఎస్పీ డా.జానకి షర్మిల ఆదేశాల మేరకు కార్డన్ సర్చ్

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని శారద నగర్ లో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. సుమారు 37 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు సరైన పత్రాలు లేకపోవడంతో పోలీసులు సీజ్ చేశారు. జిల్లా SP జానకి షర్మిల, ASP అవినాష్ కుమార్ ఆదేశాల మేరకు ముథోల్ సర్కిల్ పరిధిలోని 4 పోలీస్ స్టేషన్ ల నుంచి 45 మంది కార్డన్ సర్చ్ లో పాల్గొన్నారు. సీఐ మల్లేష్ మాట్లాడుతూ..నేరాల నియంత్రణకే కమ్యూనిటీ ప్రొగ్రాం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. వాహనదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలన్నారు.  తక్కువ ధరకు వచ్చే వాహనాలను ఎవరూ కొనుగోలు చేయవద్దని,  ఇవి దొంగతనం చేసినవని గుర్తుంచుకోవాలన్నారు. ఇలాంటి వాహనాలతో పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు.  బాసర, తానూర్, ముథోల్, లోకేశ్వరం ఎస్సై లు శ్రీనివాస్, హన్మాండ్లు, బిట్ల పెర్సిస్, అశోక్, పోలీసు సిబ్బంది ఉన్నారు.

ఉగ్రరూపం దాల్చిన బాసర గోదావరి 

0

ఉగ్రరూపం దాల్చిన బాసర గోదావరి 

*లోతట్టు ప్రాంతాలు జలమయం

*ఇబ్బందుల్లో భక్తులు, స్థానికులు

చిత్రం న్యూస్, బాసర:  నిర్మల్ జిల్లా బాసరలోని గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువనున్న మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి వరదనీరు భారీగా చేరుతుండగా బాసర వద్ద గోదావరి వరద ప్రవాహం మళ్లీ పెరిగింది. గురువారం గంట గంటకూ ఉధృతి పెరగడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బాసర ఆలయం నుంచి గోదావరి పుష్కర ఘాటు కు వెళ్లే రోడ్డు ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ తో నిండి రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు ఆయా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గోదావరి బ్యాక్ వాటర్ కారణంగా 16 రోజులుగా బాసర, ఓని, కీర్గుల్ (కె), కౌట, సాలాపూర్, సవర్గం.గ్రామాల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. కూరగాయల మార్కెట్ వెళ్లాలన్న,  బ్యాంకుకు వెళ్లాలన్న వెళ్ళలేని పరిస్థితి. ఐదు గ్రామ ప్రజలు ఇప్పటికే వేల ఎకరాల్లో పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వ్యవసాయాధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి నివేదించినా ఇప్పటికీ పరిహారం అందలేదు.

ఘనంగా కొన సాగుతున్న దేవీ శరన్నవరాత్రులు

0

 ఘనంగా కొనసాగుతున్న దేవీ శరన్నవరాత్రులు

*పెద్దమ్మ తల్లి  ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి రోజు అన్నదాన కార్యక్రమం 

చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని దేగాం గ్రామ పెద్దమ్మ తల్లి ఆలయంలో  నాలుగో రోజు గురువారం నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారికి కుంకుమార్చనలు, ఒడిబియ్యం పోసి మొక్కలు చెల్లించుకున్నారు. ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. పెద్దమ్మ ఆలయ కమిటీ అధ్యక్షుడు కోనేరు పోతన్న మాట్లాడుతూ..ప్రతి సంవత్సరం పెద్దమ్మ తల్లి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలలో  ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తొమ్మిది రోజులు అన్నదానాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సట్ల కిష్టన్న, బీజేపీ నాయకులు బాలాపురం లింగం, సందుల రమేష్, గన్నారం సాయిలు, ఆలయ కమిటీ సభ్యులు యువకులు, పెద్దలు తదితరులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

కూష్మాండ మాత అలంకారంలో బాసర సరస్వతీ అమ్మవారు

0

కూష్మాండ మాత అలంకారంలో బాసర సరస్వతీ అమ్మవారు

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శ్రీ శారదియ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సరస్వతి అమ్మవారు రోజుకొక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. గురువారం  నాలుగో రోజు సరస్వతి అమ్మవారు భక్తులకు కూష్మాండ మాత అలంకారంలో దర్శనమిచ్చారు. అమ్మవారికి నైవేద్యంగా  అల్లం గారెలు సమర్పించారు. భక్తులు పాటించవలసిన పూజ నియమాలను సూర్యుడికి అర్ఘ్యం అర్పిస్తే వ్యాధులు, దోషాలు మరియు దారిద్య్రం తొలగిపోతాయని ఆలయ అర్చకులు బాలకృష్ణ తెలిపారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వివిధ రాష్ట్రాలు, వివిధ ప్రాంతాల నుంచి భక్తులు రోడ్డు, రైలు మార్గాల ద్వారా వస్తున్నారు. పవిత్రమైన గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి మొక్కలు చెల్లించుకుంటున్నారు ఆలయ అధికారులు, పోలీస్ సిబ్బంది, ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ముథోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే  భోస్లె నారాయణ్ రావు పటేల్

0

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ముథోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే  భోస్లె నారాయణ్ రావు పటేల్

చిత్రం న్యూస్, ముథోల్: నిర్మల్ జిల్లా భైంసా డివిషన్ లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా చూడాల‌ని, న‌దులు, వాగులపై ఉన్న లోత‌ట్టు, క‌ల్వ‌ర్టుల‌పై నుంచి నీటి ప్ర‌వాహాలు ఉంటే అక్క‌డ రాక‌పోక‌లు నిషేధించాల‌ని ముథోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే  భోస్లె నారాయణ్ రావు పటేల్ సూచించారు. చెరువులు, కుంటలకు గండి ప‌డే ప్ర‌మాదం ఉన్నందున నీటి పారుద‌ల శాఖ అధికారులు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. అంటువ్యాధులు ప్ర‌బ‌లే ప్ర‌మాదం ఉన్నందున న‌గ‌ర పాల‌క‌, పుర‌పాల‌క‌, గ్రామ పంచాయ‌తీ పారిశుద్ధ్య సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండి నిల్వ నీటిని తొలగించ‌డంతో పాటు ఎప్ప‌టిక‌ప్పుడు పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని సూచించారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఆసుప‌త్రుల్లో స‌రిప‌డా మందులు అందుబాటులో ఉంచుకోవ‌డంతో పాటు అవ‌స‌ర‌మైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల‌ని ఆయన పేర్కొన్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ముథోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి మాజీ ఎమ్మెల్యే,  భోస్లె నారాయణ్ రావు పటేల్ గ

0

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ముథోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి మాజీ ఎమ్మెల్యే  భోస్లె నారాయణ్ రావు పటేల్

చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా డివిషన్లో  ఎటువంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా చూడాల‌ని, న‌దులు, వాగులపై ఉన్న లోత‌ట్టు, క‌ల్వ‌ర్టుల‌పై నుంచి నీటి ప్ర‌వాహాలు ఉంటే అక్క‌డ రాక‌పోక‌లు నిషేధించాల‌ని ముథోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే  భోస్లె నారాయణ్ రావు పటేల్ సూచించారు. చెరువులు, కుంటలకు గండి ప‌డే ప్ర‌మాదం ఉన్నందున నీటి పారుద‌ల శాఖ అధికారులు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. అంటువ్యాధులు ప్ర‌బ‌లే ప్ర‌మాదం ఉన్నందున న‌గ‌ర పాల‌క‌, పుర‌పాల‌క‌, గ్రామ పంచాయ‌తీ పారిశుద్ధ్య సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండి నిల్వ నీటిని తొలగించ‌డంతో పాటు ఎప్ప‌టిక‌ప్పుడు పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని సూచించారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఆసుప‌త్రుల్లో స‌రిప‌డా మందులు అందుబాటులో ఉంచుకోవ‌డంతో పాటు అవ‌స‌ర‌మైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల‌ని ఆయన పేర్కొన్నారు.