Home Blog Page 21

నిర్మల్ కలెక్టర్ భవేష్ మిశ్రాను కలిసిన భైంసా మార్కెట్ ఛైర్మన్ సిందే ఆనంద్ రావు పటేల్ 

0

నిర్మల్ కలెక్టర్ భవేష్ మిశ్రాను కలిసిన భైంసా మార్కెట్ ఛైర్మన్ సిందే ఆనంద్ రావు పటేల్ 

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ కలెక్టర్ భవేష్ మిశ్రా ను బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ సిందే ఆనంద్ రావు పటేల్ మర్యాదపూర్వకంగా కలిశారు . అనంతరం కలెక్టర్ తో మాట్లాడుతూ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు సాఫీగా కొనసాగుతున్నాయని, గన్నీ సంచులు సరిపడేంత కావాలని, లారీల గురించి వివరించారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ త్వరలో భైంసాకు వచ్చి రైతుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు. చైర్మన్ తో పాటు ఆత్మ కమిటీ చైర్మన్లు సిద్ధం వివేకానంద, గన్న నర్సారెడ్డి, తదితరులు ఉన్నారు.

ఆదిలాబాద్ అభివృద్ధికి రూ.30 కోట్లు: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం – ఎమ్మెల్యే పాయల్ శంకర్

0

ఆదిలాబాద్ అభివృద్ధికి రూ.30 కోట్లు: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం – ఎమ్మెల్యే పాయల్ శంకర్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో, ఆదిలాబాద్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. ఆదిలాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రూ.30 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు ప్రకటించారు. ఈ నిధులను నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు సమానంగా పంపిణీ చేసి, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని ఆయన తెలిపారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించే విషయంలో రాజకీయం చేయకూడదని, అందరినీ సమానంగా చూస్తూ అభిప్రాయాలను గౌరవించాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించి, సమన్వయంతో పనిచేస్తేనే ప్రగతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రజా సమీక్షా సమావేశాలను నిర్వహించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని, వాటికి గౌరవం ఇవ్వాలని తెలిపారు.ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష, టీజీ ఎస్సీపీసీఆర్ సభ్యురాలు ప్రేమలత అగర్వాల్, అదనపు ఎస్పీ సురేందర్ రావు, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్ రావు, డీపీఓ రమేష్, అదనపు డీఎంహెచ్‌ఓ డాక్టర్ సాధన, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

జొన్నలు కొనుగోలు చేయాలని జాతీయ రహదారిపై బీఆర్ఎస్, రైతుల ధర్నా

0

జొన్నలు కొనుగోలు చేయాలని జాతీయ రహదారిపై బీఆర్ఎస్, రైతుల ధర్నా

చిత్రం న్యూస్, జైనథ్: రైతులు పండించిన జొన్న పంటను తక్షణమే ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం జైనథ్ మండలం బెల్గాం గ్రామ సమీపంలోని 353 బీ జాతీయ రహదారి పై బీఆర్ఎస్ నాయకులు అడ్డి పురుషోత్తం రెడ్డి, జంగిలి విలాష్, సోమ రాంరెడ్డి,మాదస్తు వెంకన్న, నితిన్ రెడ్డి, బొల్లి గంగన్న, బండి స్వామి, రైతులు శ్రీకాంత్ , సుశాంత్ రెడ్డి,సునీల్ తదితరులు భారీ ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు జాతీయ రహదారిపై ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు పెట్టి రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీనివల్ల ఆదిలాబాద్ – మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయి వాహనాలు నిలిచిపోయాయి. మార్క్‌ఫెడ్ ద్వారా జొన్నలు, శ,నగ పంటలను వెంటనే కొనుగోలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన రూ. 3,699 మద్దతు ధరను రైతులకు అందించాలన్నారు. బహిరంగ మార్కెట్‌లో దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా పంటను కొనుగోలు చేసేవారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంలో తీవ్ర జాప్యం చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.ఘటనా స్థలానికి చేరుకున్న ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి, ఎస్ఐ గౌతమ్ పోలీసులు ఆందోళనకారులతో చర్చలు జరిపి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బోరంచు శ్రీకాంత్ రెడ్డి బాధ్యతల స్వీకారణ 

0

ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బోరంచు శ్రీకాంత్ రెడ్డి బాధ్యతల స్వీకారణ 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నియమితులైన బోరంచు శ్రీకాంత్ రెడ్డి శనివారం జిల్లా కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఘనంగా బాధ్యతలు స్వీకరించారు. ముందుగా అధికారులు ఆయనతో బాధ్యతలు స్వీకరింపజేసిన అనంతరం, వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య కుటుంబ సభ్యుల సమక్షంలో శ్రీకాంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ..తనపై విశ్వాసం ఉంచి ఈ కీలక బాధ్యతను అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, జిల్లా ఇంచార్జ్ మంత్రి  జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు పెద్ది సుదర్శన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేముల నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

మార్కెట్ కమిటీ అభివృద్ధికి, రైతుల సమస్యల పరిష్కారానికి తాను కట్టుబడి పనిచేస్తానని, రైతులకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధికారులు, సిబ్బంది, వివిధ రైతు, కుల రాజకీయ సంఘాల నాయకులు, రైతులు పాల్గొని శ్రీకాంత్ రెడ్డిని శాలువాలు, పుష్పగుచ్చాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

జొన్న,శనగ పంటలు కొనుగోలు చేయాలని జాతీయ రహదారిపై రైతుల ధర్నా

0

జొన్న,శనగ పంటలు కొనుగోలు చేయాలని జాతీయ రహదారిపై రైతుల ధర్నా

* రైతులకు మద్దతుగా మాజీ మంత్రి జోగు రామన్న, బీఆర్ఎస్ నేతలు 

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సిర్సన్న, కొబ్బయి గ్రామాల రైతులు జొన్న, శనగ పంటలు కొనుగోలు చేపట్టాలని కోరుతూ 353బీ జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. దాదాపుగా రెండు గంటల వరకు రైతులు ధర్నా చేపట్టడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్థంభించింది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని రైతులకు నచ్చజెప్పిన వినిపించుకోలేదు. మాజీ మంత్రి జోగు రామన్న, బీఆర్ఎస్ పార్టీ నేతలు రైతులకు మద్దతుగా సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ. గత వారం రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయిస్తానని చెప్పడంతో తాము పంటలను మార్కెట్ కు తీసుకొచ్చామని కానీ వారం రోజుల నుండి రైతులందరు మార్కెట్ లో పడిగాపులు కాస్తున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. ప్రభుత్వం పంటలు కొనుగోలు చేస్తారా లేదా కొనుగోలు చేయకపోతే చెప్పండి తక్కువ ధరకు ప్రైవేట్ కు అమ్ముకుంటామని అన్నారు. మార్క్ ఫెడ్ డీఎం మాట్లాడుతూ 3 నుంచి జొన్న, 4వ తేదీ నుండి శనగ పంటను కొనుగోలు చేస్తామని చెప్పడంతో రైతులు ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమం కళ్లెం ప్రమోద్ రెడ్డి, అడానేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్, యువ నాయకుడు సతీష్ పవర్, గంబీర్ టాక్రె, విపిన్ ఖోడే, మంగేష్ టాక్రె, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి హామీ కూలీలకు పని

0

చిత్రం న్యూస్’ కు స్పందన 🙏

ఉపాధి హామీ కూలీలకు పని 

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో ఉప్పుకుంట గల్లీ, దోబి గల్లీ కాలనీవాసులకు ఎట్టకేలకు ఉపాధి హామీ కూలీ పని దొరికింది. ఉపాధి పని లేక బిక్కు బిక్కు మంటున్న ప్రజలు అని ‘చిత్రం న్యూస్‘ లో  వార్త ప్రచురితమైంది. స్పందించిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ వాజిద్ శుక్రవారం కాలనీవాసుల దగ్గరకు వెళ్లారు. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు పని ఉంటుందని, సోమవారం నుండి అందరూ పనికిరావాలని వాజిద్ తెలిపారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన చిత్రం న్యూస్ కు  ఈ సందర్భంగా  ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

 

ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బోరంచు శ్రీకాంత్ రెడ్డి 

0

ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బోరంచు శ్రీకాంత్ రెడ్డి 

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు  బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఇతర రాష్ట్ర మంత్రులు పార్టీ ముఖ్య నేతలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన మార్కెట్ కమిటీలలో భాగంగా శ్రీకాంత్ రెడ్డిని ఈ పదవికి ఎంపిక చేసింది. కాంగ్రెస్ పార్టీలో క్షేత్రస్థాయి కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించిన శ్రీకాంత్ రెడ్డి, పార్టీ పట్ల తన విధేయతకు దక్కిన గౌరవంగా దీనిని అభివర్ణించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పెద్ది సుదర్శన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డిలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా, ఆదిలాబాద్ మార్కెట్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు. ఆదిలాబాద్ మార్కెట్ చైర్మన్ నియామకంపై గత కొంతకాలంగా ఉత్కంఠ నెలకొనగా, అధిష్టానం శ్రీకాంత్ రెడ్డి వైపు మొగ్గు చూపింది. జిల్లా రాజకీయాలలో ఈ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.

జైనథ్‌లో భక్తిశ్రద్ధలతో ‘శ్రీరామకోటి లిఖిత మహాయజ్ఞం’ 

0

జైనథ్‌లో భక్తిశ్రద్ధలతో ‘శ్రీరామకోటి లిఖిత మహాయజ్ఞం’ 

చిత్రం న్యూస్, జైనథ్: ధర్మ ప్రచారంలో భాగంగా ‘శ్రీరామకోటి లిఖిత మహాయజ్ఞం’ కార్యక్రమం జైనథ్‌ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు . ఆదిలాబాద్ టీచర్స్ కాలనీకి చెందిన ఏ.ఎం. ఉమాశంకర్ ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. శుక్రవారం  జైనథ్‌లోని చారిత్రాత్మక లక్ష్మీనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో భక్తులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉమాశంకర్ మాట్లాడుతూ.. ప్రతి ఇంటికీ రామనామాన్ని చేరవేయడమే ఈ యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రతి గ్రామానికి వెళ్తూ గ్రామస్తులతో చర్చిస్తూ, వారిని ఈ రామకోటి లిఖిత యజ్ఞంలో సభ్యులుగా చేరుస్తున్నట్లు వివరించారు. రామనామ జపంతో పాటు దానిని లిఖితపూర్వకంగా రాయడం వల్ల కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలను భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో చిలుకూరి లింగారెడ్డి, దేవన్న, పిడుగు స్వామి యాదవ్, నిపుంగే దివ్య గంగమణి, గట్టు దేవకి, లక్ష్మీనారాయణ స్వామి సేవకులు, గ్రామ సభ్యులు, భక్తులు పాల్గొని రామ కార్యంలో తాము కూడా భాగస్వాములమవుతామని ఉత్సాహంగా ముందుకు వచ్చారు.

ఘనంగా మే డే వేడుకలు: పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్, కలెక్టర్ రాజర్షి షా

0

 ఘనంగా మే డే వేడుకలు: పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్, కలెక్టర్ రాజర్షి షా

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని మేస్త్రి సంఘ భవనంలో శుక్రవారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవ (మే డే) వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. శ్రమ శక్తికి గౌరవం దక్కాలన్నదే మే డే ఉద్దేశమని, కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

అనంతరం కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో కార్మికుల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని, వాటిని ప్రతి కార్మికుడు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్మికులకు వివిధ అంశాల్లో శిక్షణ అందిస్తున్న పలువురు సిబ్బంది సేవలను గుర్తించిన కలెక్టర్, ఎమ్మెల్యే, వారికి ప్రశంసా పత్రాలను, మెమెంటోలను అందజేసి అభినందించారు. ఈ వేడుకల్లో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ దాసరి గంగారాం, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అరుగుల అశోక్, ఉట్నూర్ ఐటీఐ ఏటీఓ ఆర్.శ్రీనివాస్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ రాజేశ్వరి, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ చందన్ కుమార్ పాల్గొన్నారు. మేస్త్రీ సంఘం నాయకులు బండారి పోశన్న, సామల సత్యనారాయణ, రమేష్‌తో పాటు ఇతర అధికారులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

నిర్మల్ కలెక్టర్‌ భవేష్ మిశ్రాను కలిసిన ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ 

0

 నిర్మల్ కలెక్టర్‌ భవేష్ మిశ్రాను కలిసిన ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ 

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ కలెక్టర్‌ భవేష్ మిశ్రాను ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ను సన్మానించి పూలమొక్క అందజేశారు. ముథోల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. రైతులు పండించిన పంటలను విక్రయించుకునేందుకు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు, సబ్ సెంటర్లలో గన్నీ బ్యాగులు, లారీల (రవాణా సౌకర్యాల) లోపం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గానికి సంబంధించిన పలు ముఖ్య సమస్యలను ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, వాటిపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్ భవేష్ మిశ్రా, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.