Home Blog Page 149

సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన  బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

0

సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన  బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలో  సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే  అనిల్ జాదవ్ శుక్రవారం అందజేశారు. సొనాల మండలంలోని ఫుల్సింగ్ నాయక్ తాండ గ్రామానికి చెందిన కచివార్ శశికళకు మంజూరు అయిన రూ.20,500 ల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే  తన నివాసంలో బాధిత కుటుంబీకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ. పేదవారు ఎవరైనా హాస్పిటల్ బిల్లు తీసుకుని తన కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సదానంద్, రాథోడ్ సజన్, శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రవి, సకారం, వసంత్ తదితరులు ఉన్నారు.

ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో  ఉచిత మెకానిక్ శిక్షణ

0

ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెకానిక్ శిక్షణ

చిత్రం న్యూస్, నేరడిగొండ: మెకానిక్ రంగంలో ఆసక్తిగల యువత ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వారు ఉచితంగా అందించే ఫోర్ వీలర్ మరియు టూ వీలర్ సర్వీస్ అసిస్టెంట్ కోర్సులో చేరాలని mentor రమణ తెలిపారు. శుక్రవారం మండలంలోని కుమారి గ్రామ పంచాయతీ లోని కుప్టి, గాజలి, గాందారి యువకులకు ప్రథమ్ ఎడ్యుకేషన్ ఉచిత శిక్షణ ఇస్తున్నటువoటి అంశాలను వివరించారు. ఆసక్తి గల యువకులు ఈ అవకాశాన్ని  వినియోగించుకోవాలని  ఆయన కోరారు. శిక్షణ సమయంలో భోజనం, హాస్టల్ వసతి ఉచితంగా అందిస్తామన్నారు. శిక్షణ హైదరాబాద్ లోని నాగోల్ లో ఉంటుందాని, కనీసం పదో తరగతి పాసై, 18 నుండి 30  ఏళ్లు  వయస్సు కలిగి ఉండాలన్నారు. కోర్సు వ్యవధి 45 రోజులు ఉంటుందని, మరిన్ని వివరాలకు 9959346423 నెంబర్ సంప్రదించాలన్నారు. హైదరాబాద్ శిక్షణ పూర్తయిన తర్వాత ప్లేస్‌మెంట్ కూడా ఇవ్వబడుతుందని చెప్పారు.

 

 

యశోదా ఫౌండేషన్ ఆధ్వర్యంలో టైలరింగ్ శిక్షణ కేంద్రం ప్రారంభం

0

యశోదా ఫౌండేషన్ ఆధ్వర్యంలో టైలరింగ్ శిక్షణ కేంద్రం ప్రారంభం

చిత్రం న్యూస్, నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం లోని గుత్పాల గ్రామంలో యశోదా ఫౌండేషన్ ఆధ్వర్యంలో టైలరింగ్ శిక్షణ కేంద్రం గురువారం ప్రారంభించారు. టైలరింగ్, శిక్షణ అనంతరం మహిళలకు ఉపాధి అవకాశాలు, ప్రభుత్వం  అమోదం పొందిన సర్టిఫికెట్  ఇవ్వడం జరుగుతుందని ఇంఛార్జి సంధ్యారాణి తెలిపారు. 30% సబ్సిడీ పైన కుట్టు మిషన్ లు ఇవ్వడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని గ్రామ మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీచర్ అర్జున్, అంగన్వాడీ టీచర్ తిరుపతమ్మ,  టైలరింగ్ టీచర్ షాహిదా, గ్రామ మహిళలు పాల్గొన్నారు.

వాటర్ ఫాల్ లో పడి వైమానిక జవాన్ మృతి

0

వాటర్ ఫాల్ లో పడి వైమానిక జవాన్ మృతి

*తరోడ గ్రామంలో విషాద ఛాయలు

*కేంద్ర మంత్రి బండి సంజయ్ కి ఫోన్ చేసిన ఎమ్మెల్యే  రామారావు పటేల్

చిత్రం న్యూస్, ముథోల్ : నిర్మల్ జిల్లా ముథోల్  మండలంలోని తరోడ గ్రామానికి చెందిన లక్ష్మీ ఈశ్వర్ ప్రసాద్ అనే వైమానిక జవాన్ ఆగ్రాలోని దమ్మోహ వాటర్ ఫాల్ కు బుధవారం స్థానిక సహోద్యోగులతో వెళ్లారు. అక్కడే ప్రమాదవశాత్తుపడి మృతి గల్లంతయ్యాడు. స్థానిక పోలీసులు  జాలర్లతో వాటర్ ఫాల్ లో గాలించగా మృతదేహం గురువారం బయటపడింది. ఈ విషయం తెలియడంతో తన స్వగ్రామం తరోడ గ్రామంలో విషాద ఛాయలు అలుము కున్నాయి. దేశం కోసం వైమానిక దళంలో పనిచేసి ఇలా ప్రమాదవశాత్తు చనిపోవడం తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. మృతదేహాన్ని రప్పించడానికి గ్రామస్తులు, తరోడ మాజీ సర్పంచ్ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ను కలవడంతో ఆయన కేంద్ర మంత్రి బండి సంజయ్ తో మాట్లాడారు. ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరారు. కేంద్రమంత్రి స్పందించి సత్వర ఏర్పాటు చర్యలు ప్రారంభించారు.

ఛలో భైంసా.. వికలాంగుల చేయూత పెన్షన్ దారుల సన్నాక సదస్సు విజయవంతం చేయండి 

0

ఛలో భైంసా.. వికలాంగుల చేయూత పెన్షన్ దారుల సన్నాక సదస్సు విజయవంతం చేయండి

*రేపు భైంసాకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ రాక

చిత్రం న్యూస్,భైంసా: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని సుర్ లోక్ గార్డెన్స్ లో 3 గంటలకు (SURLOK GARDENS) వికలాంగుల, చేయూత పెన్షన్ దారుల సన్నాహక గర్జన సదస్సును శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Mandakrishna Madiga) హాజరు కానున్నారు. ఈ సందర్బంగా వికలాంగులకు 6 వేలు వృద్ధులు, వితంతువలు, ఒంటరి మహిళలకు 4 వేలు పెంచాలని డిమాండ్ చేస్తూ  ఎంఎస్పీ అంబేకర్ సాయిచంద్ మాదిగ మాట్లాడారు. సమావేశం (SURLOK GARDENS) ఫంక్షన్ హాల్‌ భైంసా పట్టణం లో నిర్వహించనున్నారు. ఈ సభను ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని గురువారం ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో ఎమ్మార్పీఎస్ నిర్మల్ ఇచ్చార్జ్ గాంధిమల నాగభూషణ్ మాదిగ,ఎమ్మార్పీఎస్, ఎమ్మేస్పీ జాతీయ నాయకుడు నందుకుమార్ మాదిగ, ఎమ్ఇ యఫ్ రాష్ట్ర ఉప అధ్యక్షులు గాయక్ గంగాధర్ మాదిగ,ఎమ్మార్పీఎస్,  ఎమ్మెస్పీ నిర్మల్ జిల్లా నాయకుడు దిగంబర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు గోనెకర్ శంకర్, శేల్లె ఆనంద్ పాల్గొన్నారు.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

0

అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య

చిత్రం న్యూస్, నేరడిగొండ: అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన  కుమారి గ్రామంలో  చోటుచేసుకుంది  నేరడిగొండ ఎస్సై ఇమ్రాన్ ఖాన్ , తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కుమారి గ్రామానికి చెందిన పోతగంటి లస్మన్న (38) ఈ మధ్య కురిసిన భారీ వర్షాల కారణంగా తనకున్న మూడు ఎకరాలు పూర్తిగా నీటమునిగి పోయాయి. అప్పులు ఎక్కవగా ఉండడంతో ఇక పంట నష్టం జరిగిందని మనస్థాపానికి గురై తన ఇంట్లోనే ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. లస్మన్నకు ఓ కుమార్తె, ఓ కుమారుడు ఉన్నారు.

 

ఉల్లాస్ (అక్షర ఆంధ్ర) శిక్షణా తరగతులు

0

ఉల్లాస్ (అక్షర ఆంధ్ర) శిక్షణా తరగతులు

చిత్రం న్యూస్, సామర్లకోట: నిరక్షరాస్యులను గుర్తించి వారిని అక్షరాస్యులుగా మార్చుటకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అక్షరాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా మండలానికి వచ్చే 1000 మంది లెర్నర్స్ ను గుర్తించి వారిని అక్షరాస్యులుగా మార్చుట కోసం ఉల్లాస్ (అక్షర ఆంధ్ర) శిక్షణా తరగతులను వాలంటీర్లకు ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం సామర్లకోట మండలంలో  గురువారం మధ్యాహ్నం 2 గం.టలకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో కె.హిమమహేశ్వరి, మండల విద్యాశాఖాధికారి శ్రీ వై.శివరామ కృష్ణయ్య, APM జగదీశ్వరి, పి.పనయ్య -Deputy Director ,Adult Education, అనిశెట్టి వెంకటరావు, Nodal Officer, Eastgodavari, వి.సునీల్ ఆనంద్ బాబు, Statistical Assistant (i/c) , Samalkot R/U , పి.రాజేష్, Statistical Assistant, Adult Education, Kakinada, యం.నాగేశ్వరరావు , PS HM ,Samalkot U-RP , డి. వీరన్న, SGT, Samalkot U-RP, యస్.రాజు. SGT, Samalkot U-RP తదితరులు పాల్గొన్నారు.

నష్టపోయిన రైతులకు పరిహారం అందజేస్తాం_ డీసీసీబీ చైర్మన్  అడ్డి భోజారెడ్డి

0

 నష్టపోయిన రైతులకు పరిహారం అందజేస్తాం_ డీసీసీబీ చైర్మన్  అడ్డి భోజారెడ్డి

చిత్రం న్యూస్,బేల ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను ఆదిలాబాద్ జిల్లా డిసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. మండలంలో మనియార్ పూర్, గూడ గ్రామంలో భారీ వర్షాలు, వరదలతో నీట మునిగి నష్టపోయిన పంటలను పరిశీలించి ఎంతమేరకు నష్టం వాటిల్లిందో రైతులను అడిగి తెలుసుకున్నారు. ఆరుగాలం కష్టపడి పంటలను కంటిరెప్పలా కాపాడితే భారీ వర్షాలు, వరదలకు నీళ్ళ పాలయిందని నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని పలువురు రైతులు చైర్మన్ ని కోరారు.ఈ సందర్బంగా డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ.. ప్రకృతి విపత్తు వల్ల మండలంలో వేల ఎకరాల్లో పత్తి, సోయా, కంది పంటలు చాలా వరకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించడం జరిగిందన్నారు. రైతులు ఎవరూ కూడా అధైర్యపడొద్దని , కాంగ్రెస్ ప్రభుత్వం మానవతా దృక్పథంతో ముందుకు వచ్చిందని చెప్పారు. వరద బాధితులకు అన్ని విధాలా సహాయం అందిస్తామని జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణ రావ్ చెప్పారన్నారు. అయితే గతంలో ఉన్న ప్రభుత్వం భారీ వర్షాలు, వరదలకు నష్ట పోయిన రైతులకు ఎప్పుడు పరిహారం ఇవ్వలేదని కానీ ఇప్పుడు ఉన్న ప్రతిపక్ష నాయకులు రైతుల తరపున మాట్లాడం చాలా విడ్డురంగా ఉందన్నారు. త్వరలో వ్యవసాయ అధికారులతో సర్వే చేపట్టి నివేదిక అందిన వెంటనే రైతులకు పరిహారం అందజేయడం జరుగుతుందని రైతులకు భరోసా నిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ విస్తరణ అధికారి వినయ్ కుమార్,మండల మాజీ జడ్పీటీసీ రాందాస్ నాక్లే, కాంగ్రెస్ పార్టీ యూత్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు సామ రూపేష్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల కిసాన్ సెల్ అధ్యక్షులు ఘన్ శ్యామ్, సీనియర్ నాయకులు సంతోష్, సాగర్, విపిన్, అవినాష్, సూర్యభాన్, కరీం తదితరులు పాల్గొన్నారు.

సొనాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ  చేసిన  డీఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్

0

సొనాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ  చేసిన  డీఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్

చిత్రం న్యూస్, సొనాల : ఆదిలాబాద్ జిల్లా సొనాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా మలేరియా అధికారి డా.శ్రీధర్ తో కలిసి  డీఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్ తనిఖీ చేశారు. ఆస్పత్రిలో పలు రికార్డులను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని, సమయపాలన పాటించాలని సూచించారు. ఆసుపత్రిలో ఓపి విభాగంలో ఎక్కువగా కేసులు నమోదవుతున్న గుట్ట పక్క తండా, గుర్రాల తండా గ్రామాలలో శానిటేషన్ పరిశీలించి ఫీల్డ్ సిబ్బందికి తగు సూచనలు చేశారు. మండల కేంద్రంలోని ఆర్ఎంపీ కేంద్రాలను పరిశీలించారు. ఆర్ఎంపీలు ప్రాథమిక చికిత్స మాత్రమే చేయాలని, అర్హతకు మించి వైద్యం చేయరాదన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నవీన్ రెడ్డి, సూపర్వైజర్ కవిత, హెల్త్ అసిస్టెంట్ లింగారెడ్డి, ఏఎన్ఎం అనసూయ, ఆశా కార్యకర్తలు ఉన్నారు.

శాశ్వత పోస్టులు భర్తీ 

0

           శాశ్వత పోస్టులు భర్తీ 

చిత్రం న్యూస్, సొనాల: ఆదిలాబాద్ జిల్లా కొత్తగా ఏర్పడిన సొనాల మండల  తహసీల్దార్ కార్యాలయంలో క్యాడర్ పూర్తి స్ట్రెంత్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాంక్షన్ చేసిన సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు తహసీల్దార్, సిబ్బందికి శాలువా తో సత్కరించి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ..కొత్త మండలంలో అన్ని శాశ్వత పోస్టులు భర్తీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, బోథ్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆడే గజేందర్, ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా కు ధన్యవాదాలు తెలిపారు. సొనాల మండలం మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కాబట్టి రక్షణ కోసం  పోలీస్ స్టేషన్ ను త్వరలో ఏర్పాటుచేయాలని ఆశాభావం  వ్యక్తం చేశారు.  కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాజుల పోతన్న, కాంగ్రెస్ పార్టీ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ రమేష్ బత్తుల, పట్టణ అధ్యక్షులు చెట్లపెళ్లి అనిల్, రామాయి రాము, కసిరే పోతన్న, బాశెట్టి సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.