Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

బాజీరావ్ బాబా సప్తాహ వేడుకలో రక్తదాన శిబిరం

చిత్రంన్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని చప్రాల గ్రామంలో బాజీరావ్ బాబా సప్తాహ వేడుకలో భాగంగా భక్తులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమంతో పాటు ఇతరులకు ప్రాణదాతలుగా నిలవాలనే ఉద్యేశ్యంతో బాజీరావ్ బాబా శిష్యులు, భక్తులు కలిసి ఈ కార్యక్రమన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా భక్తులు మాట్లాడుతూ.. గ్రామంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం అత్యవసర సమయంలో సమయానికి రక్తం లభించక చాలా మంది తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారన్నారు. ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ ఇతరులకు ప్రాణదాతలుగా ఉండాలనే ఉదేశ్యంతో ఈ రోజు వంద మంది స్వచ్చందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారని పేర్కొన్నారు. రక్తదానం పట్ల అవగాహన పెంచడానికి, ప్రాణాలను రక్షించడానికి ఇటువంటి శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. స్వచ్చందంగా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ దౌలత్ మేస్రం, ఉప సర్పంచ్ టాక్రే సాగర్, గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments