-Advertisement-

గాంధీ భవన్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

గాంధీ భవన్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

చిత్రం న్యూస్, హైదరాబాద్: గాంధీ జయంతి సందర్భంగా నాంపల్లిలోని గాంధీ భవన్‌లో వేడుకలు ఘనంగా జరిగాయి. జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ, టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ వైస్ చైర్మన్ దుర్గం శేఖర్, రాష్ట్ర మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజహరుద్దీన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి, సామరస్యం, సామాజిక సమానత్వం వంటి విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ రాష్ట్ర నాయకులు, సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు జితేందర్, మహిళా కాంగ్రెస్, NSUI, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments