-Advertisement-

బాసరలో బీజేపీ నాయకుల రాస్తారోకో.. 

బాసరలో బీజేపీ నాయకుల రాస్తారోకో.. 

చిత్రం న్యూస్, బాసర : ​తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారత ప్రధాని నరేంద్ర మోడీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు మంగళవారం భారీ రాస్తారోకో, నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు, జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ ల పిలుపు మేరకు బాసర మండల అధ్యక్షులు పుట్నాల సాయినాథ్ పటేల్ నాయకత్వంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు.

​ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ. దేశ ప్రధానిపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.  కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.​ ఈ కార్యక్రమంలో బీజేపీ బాసర మండల అధ్యక్షులు పుట్నాల సాయినాథ్ పటేల్, ఉపాధ్యక్షులు కొండాపురం గంగాధర్, లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ పోగుల రాజేశ్వర్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు బలాపురం మనోహర్ రావు, ఓబీసీ మోర్చా జిల్లా నాయకులు సుద్ద సాయిబాబా, కిసాన్ మోర్చా జిల్లా నాయకులు దేవునే శంకర్, నాయకులు బిద్దుర్ రమేష్, సి.హెచ్. సాయినాథ్, కొదటి భగవంత్ రావు, బీజేవైఎం (BJYM) ఆఫీస్ జనరల్ సెక్రటరీ చౌహాన్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments