తరోడలో ఘనంగా భగత్‌సింగ్ జయంతి వేడుకలు
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా ముథోల్ మండలం తరోడ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో స్వాతంత్ర్య సమరయోధుడు భగత్‌సింగ్ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నీలిమ భగత్‌సింగ్ జీవిత విశేషాలను, దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన ప్రాణత్యాగాన్ని, పోరాట పటిమను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో గడపాలే గణేష్, పవన్, ఆవేష్, నవమన్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.
