MPPS మంజ్రి పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ
చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బైంసా స్థానిక MPPS మంజ్రి పాఠశాలలో విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి AMC చైర్మన్ శ్రీ షిందే ఆనందరావు పటేల్, గ్రామ సర్పంచ్ మారుతి ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా AMC చైర్మన్ షిందే ఆనందరావు పటేల్ మాట్లాడుతూ.. విద్యార్థుల సంక్షేమం, గ్రామీణ విద్యారంగ అభివృద్ధికై నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, విద్యా కార్యక్రమాలను ఈ సందర్భంగా గ్రామస్తులకు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అన్ని వసతులు కల్పిస్తున్నందున, ప్రతి పేద విద్యార్థి కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చేరి చదువుకోవాలని వారు సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, మహిళా సమాఖ్య సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ యువకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
