గణేష్ నిమజ్జోత్సవాలను శాంతి యుతంగా జరుపుకోవాలి: ఎమ్మెల్యే పవార్ రామరావు పటేల్
చిత్రం న్యూస్, బాసర : గణేష్ నిమజ్జన ఉత్సవాలను ప్రశాంత వాతవారణం లో జరుపుకోవాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచించారు. భైంసా లో గణేష్ నిమజ్జనం సందర్భంగా మున్నూరు కాపు సంఘ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఆయన మాట్లాడారు. మున్నూరుకాపు సంఘం, గణేష్ నగర్, గోపాల్ కృష్ణ మందిర్ లో వినాయక నిమజ్జనాన్ని ప్రారంభించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుండి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవడం అభినందనీయమన్నారు. మున్నూరు కాపు సంఘ భవనం లో 20,100 రూపాయల కు గణేష్ లడ్డును దక్కించుకున్నారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ తుమొల్ల దత్తాత్రి, మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, కౌన్సిలర్ లు, నాయకులు, సర్పంచ్ లు మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.
నిమజ్జనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రామారావు పటేల్: గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ లో గణనాథుని నిమజ్జనాన్ని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ప్రారంభించారు. ఎమ్మెల్యే వెంట జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అడిషనల్ ఎస్పీ సాయికిరణ్ పాటు పలువురు నాయకులు ఉన్నారు.
