గణపతి పూజలో పాల్గొన్న యూత్ కాంగ్రెస్ నేత సామ రూపేష్ రెడ్డి
చిత్రం న్యూస్, బేల: మండలంలోని సిర్సన్న గ్రామంలో యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి గణపతి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ పోచక్క సురేష్ రెడ్డి, శివ మార్కండేయ ఆలయ కమిటీ అధ్యక్షుడు బేతా రాఘవేందర్, గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు సామ రూపేష్ రెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా మీడియా కోఆర్డినేటర్ మేకల జితేందర్, శివ మార్కండేయ ఆలయ కమిటీ అధ్యక్షుడు బేతా రాఘవేందర్, ఆర్టీఐ మండల ఉపాధ్యక్షుడు ఉరాడే సాహిల్, ఉరాడే రవీందర్ తో పాటు గ్రామస్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
