కంప్యూటర్ సైన్స్ లెక్చరర్ కె.దివ్యకు ఉత్తమ లెక్చరర్ అవార్డు
చిత్రం న్యూస్, భైంసా: భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్న కె.దివ్యకు ఉత్తమ లెక్చరర్ అవార్డు (Best Lecturer Award) లభించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 2026 ఆగస్టు 15న చీఫ్ విప్ వేముల వీరేశం, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా చేతుల మీదుగా ఆమె ఈ ఉత్తమ లెక్చరర్ ప్రశంసా పురస్కారాన్ని అందుకున్నారు.
విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడంతో పాటు, కళాశాల అభివృద్ధి, విద్యార్థుల ప్రగతికి ఆమె అందిస్తున్న సేవలను గుర్తించి ఈ Best Lecturer Awardను అందజేశారు.
ఈ సందర్భంగా కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ డా.భీమా రావు, వైస్ ప్రిన్సిపాల్ డా. రఘునాథ్, IQAC కోఆర్డినేటర్ డా.రవి కుమార్, సీనియర్ అధ్యాపకులు డా. పవన్ పాండే, డా. ఎం. శంకర్, రాజు, ఆర్.ఈ., డా. ఓం ప్రకాశ్, డా. కల్పన, డా. నహీదా, రాజయ్య, సురేందర్ తదితర అధ్యాపకులు కె. దివ్యను అభినందించారు.
