మహంకాళి ఆలయానికి సరికొత్త శోభ: కుంట రఘుకుల్ రెడ్డి ఉదారత
చిత్రం న్యూస్, జైనథ్: జైనథ్ మండలం ఖాప్రి గ్రామంలోని మహంకాళి ఆలయం సరికొత్త రూపును సంతరించుకుంది. ఆలయ సుందరీకరణ, పెయింటింగ్ పనుల కోసం మాజీ ఎంపీపీ (బేల) కుంట రఘుకుల్ రెడ్డి అందించిన సహకారంతో గ్రామస్థులు, ఆలయ కమిటీ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆలయ ప్రాంగణం, గోపురానికి రంగులు వేయించి, భక్తులకు కనువిందు చేసేలా ఆధ్యాత్మిక శోభను పెంచడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కుంట రఘుకుల్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆయన చేసిన ఈ ధార్మిక సేవ ఆలయ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుందని, ఇలాంటి సేవా కార్యక్రమాలతో భక్తులకు మరింత మెరుగైన వసతులు లభిస్తాయని వారు పేర్కొన్నారు. శుక్రవారం రోజున మహంకాళి ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈ సుందరీకరణ పనులు పూర్తి కావడంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.




