-Advertisement-

కరంజి (కె) పాఠశాలలో శుద్ధ జల ప్లాంట్ ప్రారంభం: ఎల్టి దశరథ్ రాంరెడ్డి దాతృత్వం

కరంజి (కె) పాఠశాలలో శుద్ధ జల ప్లాంట్ ప్రారంభం: ఎల్టి దశరథ్ రాంరెడ్డి దాతృత్వం

చిత్రం న్యూస్, జైనథ్: జైనథ్ మండలం కరంజి (కె) గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఎంపీపీఎస్) విద్యార్థుల కోసం ప్రముఖ దాత ఎల్టి దశరథ్ రాం రెడ్డి ముందుకు వచ్చి తన ఉదారతను చాటుకున్నారు. విద్యార్థుల ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, సుమారు రూ.లక్ష నిధులు సొంత ఖర్చుతో ఏర్పాటు చేసి తాగునీటి ప్లాంట్ (RO Plant),  వాటర్ కూలర్‌ను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు, పాఠశాల సిబ్బంది మాట్లాడుతూ.. ఎల్టి దశరథ్ రాం రెడ్డి సేవలను కొనియాడారు. వేసవి కాలంలో, సాధారణ రోజుల్లో కూడా విద్యార్థులకు స్వచ్ఛమైన, చల్లని తాగునీరు అందుబాటులో ఉండటం వల్ల వారి ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, పాఠశాలలో మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని వారు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సామాజిక సేవా కార్యక్రమం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఎల్టి దశరథ్ రాంరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెందరికో స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గొంటిముక్కుల అనిత పొచ్చన్న , ఉప సర్పంచ్ సూర్య ప్రకాష్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు చిన్నయ్య, శ్రీనివాస్, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments