-Advertisement-

ఆర్టీసీ సమ్మెతో ఎక్కడికక్కడ నిలిచిపోయిన బస్సులు: ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు

ఆర్టీసీ సమ్మెతో ఎక్కడికక్కడ నిలిచిపోయిన బస్సులు: ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెతో బుధవారం రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఆదిలాబాద్ జిల్లాలో సమ్మె ప్రభావం తీవ్రంగా ఉంది, డిపోలకే పరిమితమైన బస్సులతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ (JAC) ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. ఆదిలాబాద్‌లోని ప్రధాన డిపోల వద్ద కార్మికులు ప్లకార్డులతో నిరసన తెలుపారు. దీనివల్ల జిల్లాలోని మారుమూల గ్రామాల నుంచి వచ్చే ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు, మహిళలు, రోగులు గమ్యస్థానాలకు చేరుకోలేక బస్టాండ్లలో పడిగాపులు కాశారు. సమ్మెను ఆసరాగా చేసుకుని ప్రైవేట్ వాహనదారులు భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments