పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించండి: ఎంఈవో మహాలక్ష్మి
చిత్రం న్యూస్, బేల:
పిల్లలను ప్రయివేట్ పాఠశాలల్లో కాకుండా ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని మండల విద్యాధికారిణి (ఎంఈవో) మహాలక్ష్మి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సిర్సన్న గ్రామంలో గురువారం బడిబాట కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం, కిచెన్ గార్డెన్, నిష్ణాతులైన ఉపాధ్యాయులు, విద్యార్థులకు సౌకర్యవంతమైన తరగతి గదులు పాఠశాలలో అందుబాటులో ఉన్నాయని వివరిస్తూ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఉపాధ్యాయ బృందం ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల ఇంటికి వెళ్లి మా పాఠశాలలో చేర్పించాలని, చేర్పించినట్లయితే నాణ్యమైన విద్యను అందించడం మా బాధ్యత అని గ్రామస్తులకు హామీ ఇచ్చారు . బడిబాట కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని, పాఠశాలలో చేరిన విద్యార్థులకు కచ్చితంగా నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తామన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు గ్రామాలు, వీధుల్లో ఇంటింటీ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ క్యాతం సురేష్ రెడ్డి, ఉపాధ్యాయులు,సిద్రప్ ప్రవీణ్, దినేష్, దేవిదాస్, అన్విత, జ్యోతి, మమత, యువకులు ఊరడే సాహిల్, మోహన్ రెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.




