తెలంగాణ విశ్వవిద్యాలయం పాలక మండలి నియామకం
*డైరెక్టర్ గా కాకతీయ రజనీకాంత్
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: తెలంగాణ విశ్వవిద్యాలయం ద్వితీయ శ్రేణి సభ్యులతో కుడిన పాలక మండలిని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి తరుపున ప్రభుత్వ ప్రధాన ప్రధాన కార్యదర్శి డా. యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ యూనివర్సిటీస్ యాక్ట్ 1991 ప్రకారం నూతనంగా పాలక మండలి సభ్యులను నియమిస్తు అదేశాలు జారీ చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయం నుంచి నామినేటేడ్ కోటాలో డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మెనేజ్ మెంట్ ప్రొపేస్తర్ అంజనేయులు, యూనివర్సిటీ పరిధిలోని ఒక విభాగం ప్రిన్సిపాల్ ను నామినేట్ చేయాల్సిన కోటా జియో ఇన్ఫర్మేటిక్స్ డిపార్ట్ మెంట్ అసోసియేట్ ప్రొఫేసర్ డా.సుధాకర్ గౌడ్, అఫిలియేటెడ్ కాలేజ్ ల తరుపున ఒక ప్రిన్సిపాల్ గా గౌతమి కాలేజీ ప్రిన్సిపాల్ డా. కే. సంజీవ రావు, యూనివర్సిటీ పరిధిలోని ఓక కాలేజీ లెక్చరర్ గా గిరిరాజ్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ దండు స్వామిని, అప్లియేటేడ్ కాలేజీల నుంచి ఓక అధ్యాపకుడిగా ఇందూర్ పిజీ కాలేజ్ ఆప్ బిజినేస్ మెనేజ్ మెంట్ కాలేజీ ప్రో. మదన్ మోహన్ ను నామినేట్ చేశారు.

