ఆదిలాబాద్‌కు ‘జాతీయ రోడ్డు భద్రత’ పురస్కారం: అభినందించిన కలెక్టర్
చిత్రం, న్యూస్, ఆదిలాబాద్: బెంగుళూరులో జరిగిన కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా రవాణా శాఖకు ‘2వ జాతీయ రోడ్డు భద్రతా ఎక్సలెన్స్ అవార్డు-2026’ లభించింది. ఈ సందర్భంగా సోమవారం కలెక్టర్ రాజర్షి షా ను అధికారులు మర్యాదపూర్వకంగా కలవగా, ఆయన వారిని అభినందించారు. ఏప్రిల్ 13 నుంచి 18 వరకు నిర్వహించనున్న ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత వారోత్సవాల వాల్ పోస్టర్లు, కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారి రవీందర్ కుమార్, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ శ్రీనివాస్, మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ కె. హరీంద్ర కుమార్, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు, ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎం, డీఎం, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
-Advertisement-
