భైంసా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఘనంగా డా. బీ.ఆర్.అంబేడ్కర్ జయంతి వేడుకలు
చిత్రం న్యూస్, నిర్మల్ బ్యూరో: భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో B. R. అంబేద్కర్ ముందస్తు జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు . ప్రభుత్వ పాలన, రాజనీతి శాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో కొత్త ఉత్తేజాన్ని నింపింది.
ఈ సందర్భంగా కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ డా.రఘునాథ్ మాట్లాడుతూ, అంబేడ్కర్ జీవితం నేటి యువతకు గొప్ప ప్రేరణ అని పేర్కొన్నారు. ఎన్నో కష్టాలు ఎదురైనా పట్టుదలతో చదివి ప్రపంచ స్థాయికి ఎదిగి, భారతదేశానికి గౌరవం తెచ్చిన మహానుభావుడని కొనియాడారు.
అస్పృశ్యత నిర్మూలన, సమానత్వం, మహిళాభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని రచించి దేశ స్థిరత్వానికి బలమైన పునాది వేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్ క్యూ ఏసి సమన్వయకర్త డా.రవికుమార్, డా. జే.భీమారావు, డా. శంకర్, డా. కొసరి సంతోష్, డా. ఓం ప్రకాష్, రామ్ మోహన్ తదితర అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

