-Advertisement-

ప్రణాళికతోనే లక్ష్య సాధన

      ప్రణాళికతోనే లక్ష్య సాధన

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: విద్యార్థులు చిన్ననాటి నుంచే జీవిత లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటి సాధనకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ రీజియన్–19 ప్రధాన కార్యదర్శి జి.వినోద్ కుమార్ సూచించారు. శుక్రవారం కోలం బాలుర ఆశ్రమోన్నత పాఠశాలలో వ్యక్తిత్వ వికాసంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమయపాలన, క్రమశిక్షణ, నిరంతర కృషి, ఆత్మవిశ్వాసంతో లక్ష్యాలను సాధించవచ్చన్నారు. పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు ఇప్పటి నుంచే ప్రణాళికతో సిద్ధం కావాలని, పట్టు తక్కువగా ఉన్న సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. మోటివే షనల్ స్పీకర్లు జాదవ్ అమిత్, వెంకట్, విజయ్ ప్రకాష్, రాములు, శంభు, హేమలత, మణిపాల్, మెస్రం నాగేశ్వర్ రావు పలు అంశాల పై అవగాహన కల్గించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పవార్ లక్ష్మణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments