-Advertisement-

కరంజి అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం

 కరంజి అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం

చిత్రం న్యూస్, జైనథ్: పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జైనథ్ మండలం కరంజి గ్రామ అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం ప్రాముఖ్యతపై అంగన్వాడీ సిబ్బంది అవగాహన కల్పించారు. బలవర్థకమైన ఆహారం తీసుకోవడం ద్వారా రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించవచ్చని సూచించారు. అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శైలజ-పొచ్చన్న, ఉప సర్పంచ్ సూర్య, కార్యదర్శి నర్సింగ్, హెడ్ మాస్టర్ చిన్నయ్య, అంగన్వాడీ టీచర్ సంగీత, వర్కర్ భూమక్కతో పాటు వివిధ గ్రామాల అంగన్వాడీ టీచర్లు, తల్లులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments