-Advertisement-

గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు

గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి

పెన్‌గంగా, చాంద వాగు నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: గణేష్ నిమజ్జనోత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. శుక్రవారం భోరజ్ మండల పరిధిలోని పెన్‌గంగా నది తీరంతో పాటు ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని చాంద వాగు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను కలెక్టర్, ఎస్పీ కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భద్రత, పారిశుద్ధ్యం, విద్యుత్, తాగునీరు, రహదారులు, ట్రాఫిక్ నియంత్రణ తదితర ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్  రాజర్షి షా మాట్లాడుతూ..నిమజ్జన కార్యక్రమం సజావుగా జరిగేలా ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. నిమజ్జన ప్రాంతాల్లో అవసరమైన బారికేడింగ్ ఏర్పాటు చేసి, ప్రమాదాలు జరగకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. వెలుతురు, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. నిమజ్జనానికి వచ్చే వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని, వాహనాల పార్కింగ్‌కు అనువైన ప్రదేశాలను గుర్తించాలని పోలీసు, ఆర్టీఓ అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేలా వైద్య, అగ్నిమాపక, రెవెన్యూ తదితర శాఖల సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెన్‌గంగా నది వద్ద విగ్రహాల తరలింపు, నిమజ్జన ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. చాంద వాగు వద్ద నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించి భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ..గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం సూచించిన భద్రతా, పర్యావరణ నిబంధనలను పాటిస్తూ ఉత్సవాలను ప్రశాంతంగా, సంతోషకర వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు.మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డీఎస్పీ జీవన్ రెడ్డి, ఆర్టీఓ జగదీశ్వర్ రావు, రెవెన్యూ, పోలీసు, నీటిపారుదల, పంచాయతీరాజ్, విద్యుత్ తదితర శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments