ఘనంగా ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు
బాసర ఆలయంలో ప్రత్యేక పూజలు, యాచకులకు పండ్లు పంపిణీ చేసిన పుట్నాల సాయినాథ్
చిత్రం న్యూస్, బాసర : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి సన్నిధిలో బీజేపీ అధ్యక్షులు పుట్నాల సాయినాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు పుట్నాల సాయినాథ్ నాయకులు, అభిమానులు ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు జరిపించారు. ప్రధాని మోదీ ఆయురారోగ్యాలతో, దీర్ఘాయుష్షుతో తలపెట్టిన ప్రతి కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని, దేశాన్ని మరింత ప్రగతి పథంలో నడిపించాలని అమ్మవారిని వేడుకున్నారు. అనంతరం ఆలయ పండితులు వారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు.
పూజా కార్యక్రమాల అనంతరం సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఉన్న యాచకులకు, పేదలకు పండ్లను పంపిణీ చేశారు. ప్రధాని జన్మదినం సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సతీష్ రావు, జిడ్డు సుభాష్, సాకలి సాయినాథ్, బిద్దు రమేష్ , పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
