Home Blog Page 96

గాలిపటం ఎగురవేస్తూ విద్యుత్ షాక్‌కు గురైన విద్యార్ధి

0

చిత్రం న్యూస్, భోరజ్: వినోదం కోసం ఎగురవేసే గాలిపటం ఓ విద్యార్థి జీవితంలో తీరని విషాదాన్ని నింపింది. ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం బాలాపూర్‌ గ్రామంలో గాలిపటం ఎగురవేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి బాలయోగి అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. బాలయోగి తన ఇంటిపై గాలిపటం ఎగురవేస్తుండగా, గాలిపటం దారం పక్కనే ఉన్న విద్యుత్ తీగలకు తగిలింది. విద్యుత్ ప్రవాహం దారం ద్వారా విద్యార్థి కి సోకడంతో ఒక్కసారిగా షాక్‌కు గురై కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో  శరీరం తీవ్రంగా కాలిపోయింది. వెంటనే గమనించిన కుటుంబీకులుకి చి త్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భజన పోటీలకు ఆహ్వానం

0

చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కూర గ్రామంలో శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి పంతొమ్మిదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భజన పోటీలు నిర్వహిస్తున్నారు. 24-01-2026 శనివారం రాత్రి 8:00 గంటల నుండి పోటీలు ప్రారంభం కానున్నాయి. ప్రథమ బహుమతి రూ.11 వేలు, రెండోబహుమతి రూ.5 వేలు, మూడో బహుమతి రూ.3 వేలు, ఉత్తమ గాయకుడు రూ.వేయి, ఉత్తమ వాద్య సంగీతానికి రూ.వేయి నగదు అందజేయనున్నారు. ప్రతి భజన మండలిలో ఏడుగురు సభ్యులు ఉండాలని,భక్తి గీతాలు, తత్వగీతాలు పాడవచ్చని (చూసి పాడకూడదు)  పేర్కొన్నారు. ప్రదర్శించే బృందమునకు 30 నిమిషములు సమయం ఉంటుందన్నారు.భజన మండలి వారు 5 పాటలు పాడాలని (సమయ పాలన పాటించాలి), ఈ 5 పాటలలో శ్రీ వేంకటేశ్వరుని గురించి ఒక భక్తి గీతం పాడాలని తెలిపారు.భజన సామాగ్రి (హార్మోనియం, తబలా, తాలాలు) ఎవరివి వారే తెచ్చుకోవాలన్నారు.  తుది నిర్ణయంన్యాయ నిర్ణేతలదేనని, భజన కళాకారులకు భోజన సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు.పాల్గొనేవారు ఫోన్ నంబర్లు 9441015240, 9441239091 కి సంప్రదించాలని సూచించారు.

ఆపదలో అండగా అభిమన్యు గ్రూప్

0

మడావి రూప్ దేవ్ కుటుంబానికి రూ.85 వేలు ఆర్థికసాయం అందజేత

చిత్రం న్యూస్, నార్నూర్: నార్నూర్ మండలం బాబేఝారీ గ్రామంనికి చెందిన నిరుపేద విద్యార్థి మడావి  రూప్ దేవ్ తండ్రి రాజు, తల్లి లక్ష్మిబాయి కిడ్నీ స్టోన్ తో బాధపడుతున్న సమయంలో రూప్ దేవ్ కుటుంబం సభ్యులకు ధైర్యం ఇస్తూ అండగా నిలిచారు అభిమన్యు సభ్యులు. విద్య, వైద్యం, పేదల కోసం ఎల్లప్పుడూ నిరంతరం సహాయసహకారాలు అందిస్తూ అండగా ఉంటామని గ్రూప్ సభ్యుడు మెస్రం శేఖర్ బాబు అన్నారు. దాతలు అందజేసిన రూ. 85 వేల నగదును కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు పెందోర్ దాదిరావు, ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పెందోర్ సంతోష్, సామాజిక సేవకుడు, ఉపాధ్యాయుడు మెస్రం లింగు, తుడుందెబ్బ మండల అధ్యక్షులు మడావి చంద్రహరీ, రాజ్ గోండు విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు కుంరం చత్రుశావ్, జిల్లా నాయకులు మరప గంగారాం, ఆదివాసీ విద్యార్థి సంఘం మండల అధ్యక్షులు పెందోర్ మధు, మరప గంగారాం,  విద్యార్థి సంఘం నాయకులు మెస్రం కేశోరావు, కోట్నాక్ శ్రీరామ్, ఆత్రం అజేయ్, తుంరం సంతోష్,  గ్రామ పటేల్ మాడావి లింగు, నూతన సర్పంచ్ పెందోర్ లింగు, గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు.

సాంగిడి  గ్రామ పంచాయితీ పాలకవర్గానికి సన్మానం

0

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సాంగిడిలో ఆ గ్రామ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఫంక్షన్ హాల్లో నూతన పాలకవర్గ సభ్యులను సన్మానించారు. సర్పంచ్ భూపతి రెడ్డి, ఉప సర్పంచ్ శేఖర్ తో పాటు సభ్యలను సన్మానించి శాలువాతో సత్కరించారు.ఈ  సందర్బంగా ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు చిప్ప రమేష్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో భాగంగా పాలకవర్గ సభ్యులందరు కలిసి కట్టుగా పని చేయాలని కోరారు.గ్రామంలో గల సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని ఈ సందర్బంగా కోరారు.ముఖ్యంగా పచ్చదనం, పరిశుభ్రత, పారిశుధ్యం, మురుగు కాలువల నిర్వహణ చేపట్టాలన్నారు.ఈ  కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

బీజేపీతోనే సమస్యల పరిష్కారం: స్లాటర్ హౌస్ తొలగింపులో ఎమ్మెల్యే పాయల్ శంకర్ 

0

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: బీజేపీకి ఓటు వేస్తేనే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని దశాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను సైతం మేము చేసి చూపిస్తున్నాం” అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పష్టం చేశారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణం నుంచి కచ్‌కంటి గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న స్లాటర్ హౌస్ (కబేళా)ను మున్సిపల్ అధికారుల సమన్వయంతో ఆయన దగ్గరుండి తొలగింపజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

దశాబ్దాల సమస్యకు విముక్తి: గత 30 ఏళ్లుగా ఈ స్లాటర్ హౌస్ నుంచి వస్తున్న దుర్వాసనతో స్థానిక ప్రజలు నరకయాతన అనుభవించారని, దీనిపై గతంలో ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, మున్సిపల్ చైర్మన్లకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని విమర్శించారు.దశాబ్దాల నాటి సమస్య పరిష్కారం కావడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మాట నిలబెట్టుకున్న బీజేపీ: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు, ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఈ తొలగింపు కార్యక్రమం చేపట్టామని తెలిపారు.రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అండర్ బ్రిడ్జ్ నిర్మాణాలతో పాటు పట్టణంలో తోపుడు బండ్ల క్రమబద్ధీకరణ వంటి పనులు బీజేపీ పనితీరుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.అన్ని శాఖల అధికారుల సమన్వయంతో, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ స్లాటర్ హౌస్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు లాలా మున్న, కృష్ణ, మున్సిపల్ అధికారులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

కంది పంటపై క్షేత్ర దినోత్సవం

0

Scientist చిత్రం న్యూస్, బేల :ఆదిలాబాద్ జిల్లా సీతగొంది మండలం మల్కాపూర్ గ్రామంలో  వ్యవసాయ పరిశోధన స్థానం ఆదిలాబాద్ ఆధ్వర్యంలో కంది పంట పై క్షేత్ర దినోత్సవం నిర్వహించారు. శాస్త్రవేత్తలు డా.కె. రాజశేఖర్, డా.డి మోహన్ దాస్లు మాట్లాడుతూ..కంది రకం ‘WRGE-97’ ను రాబోయే కాలంలో ఎక్కువ మంది రైతులు ఈ విత్తనాలను వాడుకోవాలని సూచించారు. ఈ కంది రకం తక్కువ కాల పరిమితి కలిగి, ఎండు తెగుళ్లను తట్టుకొని అధిక దిగుబడి ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమనేది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విద్యాలయం చేపడుతున్న ” నాణ్యమైన విత్తనం- రైతన్నలు నేస్తం”(Quality seed at every village) కార్యక్రమంలో భాగమన్నారు. Aeo శ్రీధర్, రైతులు పాల్గొన్నారు.

బైరందేవ్, మహాదేవ్ ఆలయంలో ప్రారంభమైన జాతర

0
బైరందేవ్, మహాదేవ్ ఆలయం
బైరందేవ్, మహాదేవ్ ఆలయం

చిత్రం న్యూస్,బేల:ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సదల్ పూర్ గ్రామంలో అతిపురాతనమైన బైరందేవ్,మహాదేవ్ ఆలయంలో మంగళవారం నుండి జంగి జాతర ప్రారంభమైంది.కోరంగే వంశస్థులు, గ్రామ సర్పంచ్ దంపతులు గిరిజన సంప్రదాయం ప్రకారం డప్పుచప్పులు,భజనల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు.మహాదేవ్,భైరందేవ్ విగ్రహాలకు ప్రత్యేక పూలతో  అభిషేకం చేశారు.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కోరంగే సోనేరావ్ మాట్లాడుతూ బేల మండలంలోని సదల్ పూర్ బైరందేవ్,మహాదేవ్ ఆలయానికి ఎంతో విశిష్టత ఉందని, మహాదేవ్ ఆలయంలో కొలువైఉన్న శివలింగానికి భక్తులు తాము కోరిన కోరికలు నెరవేరతాయని ప్రఘాడ విశ్వాసంగా నమ్ముతారని పేర్కొన్నారు.జాతర వచ్చే భక్తుల కొరకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు.ఈ ఆలయానికి చుట్టు పక్కల గ్రామాల నుండే కాకుండా మహారాష్ట్ర, ఛత్తిస్ ఘడ్, మధ్యప్రదేశ్ నుండి భక్తులు భారీగా తరలివస్తారని పేర్కొన్నారు. శ్రీ మహాదేవుని ఆశీర్వాదాలు ఎల్లవేళలా భక్త జనులపై ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కొరంగే వంశస్థుల కోరుకున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బైరందేవ్,మహాదేవ్ ఆలయ కమిటీ చైర్మన్ శ్యామ్ రావ్,సర్పంచ్ మర్సకోలా మంగేష్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

భైరందేవ్, మహాదేవ్ ఆలయంలో శ్రీ సదలేశ్వర్ పుస్తక ఆవిష్కరణ

0
Chindam aashanna
Chindam aashanna

శ్రీ భైరందేవ్, మహాదేవ్ ఆలయంలో శ్రీ సదలేశ్వర్ పుస్తక  ఆవిష్కరణ

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సదల్ పూర్ గ్రామంలో శ్రీ భైరందేవ్,మహాదేవ్ ఆలయంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు చిందం ఆశన్న రచించిన శ్రీ సదలేశ్వర పుస్తక ఆవిష్కరణను ఆలయ కమిటీ చైర్మన్ కోరంగే శ్యామ్ రావ్ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరణ చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆశన్న శ్రీ భైరందేవ్,మహాదేవ్ ఆలయ చరిత్ర విశిష్ట గురించి తన సువర్ణ అక్షరాలతో చాలా చక్కగా రాశారని ప్రముఖులు, ఆలయ కమిటీ సభ్యులు కొనియాడారు.ఈ సందర్బంగా చిందం ఆశన్న మాట్లాడుతూ. వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన శ్రీ భైరందేవ్,మహాదేవ్ ఆలయ చరిత్ర తన ఒక్కరి వల్ల సాధ్యం కాలేదని దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపపారు. శాతవాహనుల కాలంలో నిర్మించిన పురాతన ఆలయంలో శ్రీ భైరందేవ్, మహాదేవ్ ఆలయం ఒకటి అని అన్నారు.శ్రీ సదలేశ్వర పుస్తకం తన మనవడికి అకింతం చేస్తున్నానని పేర్కొన్నారు.ఈ పుస్తకంలో ముఖ్యంగా గొండ్వాన చరిత్ర, స్వయంబుగా వెలసిన ఆ పరమేశ్వరని విశిష్ట, కాలభైరవుని విగ్రహం గురించి రచించడం జరిగిందన్నారు.

క్రీడా పోటీలకు ఎల్లప్పుడూ తమ వంతు సహకారం అందిస్తాం_అడనేశ్వర్ చైర్మన్ సతీష్ పవార్

0
Satish pawar
about satish pawar

 

చిత్రం న్యూస్,బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం హస్నాపూర్ గ్రామంలో గత మూడు రోజులుగా జై సేవాలాల్, జై కుమురంభీం యూత్ క్రీడామండల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ ముగింపు పోటీలు ముగింపుకు చేరాయి. ఈ బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ యువ నాయకుడు, అడానేశ్వర్ ఫౌండేషన్ ఛైర్మన్ సతీష్ పవార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సతీష్ పవార్ మాట్లాడుతూ..మండలంలో కబడ్డి, క్రికెట్ పోటీలు నిర్వహించినా తనవంతు సహకారం అందించామన్నారు. రానున్న రోజుల్లో మా సహాయ సహకారాలు ఎప్పుడైనా అందిస్తామన్నారు.గెలుపొందిన జట్టును అభినందించారు. మొదటి బహుమతి 21 వేలు మంగేష్ సర్పంచ్,  నాయక్ లింబాజీ  ఆధ్వర్యంలో, రెండో బహుమతి 15 వేలు అడానేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ సతీష్ పవార్, 10 వేలు, అరుణ్ కొడప మాజీ ఎంపీటీసీ రూ.5వేలు , మూడో బహుమతి 7 వేలు, నాలుగో బహుమతి రూ.5,555  అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మంగేష్ మరస్కోలే, మాజీ ఎంపీటీసీ అరుణ్ కొడప,పోహార్ సర్పంచ్ జంగు, గ్రామ నాయక్ లింబాజీ,మాజీ ఉప సర్పంచ్లు మహదవ్ ,సంజయ్ గ్రామస్తులు యువకులు తదితరులు పాల్గొన్నారు.

చికాగో సర్వమత సమ్మేళనం – భారత ఆధ్యాత్మిక విజయం

0

1893లో అమెరికాలోని చికాగో నగరంలో సర్వమత సమ్మేళనం (World’s Parliament of Religions) నిర్వహించబడింది. ఈ సమ్మేళనం ప్రపంచంలోని వివిధ మతాల ప్రతినిధులు ఒక వేదికపైకి వచ్చి తమ మత సిద్ధాంతాలను వివరించిన చారిత్రక ఘట్టం.

ఈ సమ్మేళనంలో భారత్ తరఫున పాల్గొన్న స్వామి వివేకానంద గారి ప్రసంగం ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. ఆయన “సోదరులు మరియు సోదరీమణులారా” అనే మాటలతో ప్రసంగాన్ని ప్రారంభించగానే సభ మొత్తం చప్పట్లతో మార్మోగింది.

స్వామి వివేకానంద తన ప్రసంగంలో వేదాంతం, సర్వమత సమానత్వం, మానవత్వం, సహనం వంటి భారతీయ ఆధ్యాత్మిక విలువలను ప్రపంచానికి తెలియజేశారు. అన్ని మతాల సారాంశం ఒకటేనని, మతాల మధ్య ద్వేషం కాక ఐక్యత అవసరమని ఆయన బలంగా పేర్కొన్నారు.

ఈ సమ్మేళనం ద్వారా భారతదేశ ఆధ్యాత్మిక గొప్పతనం ప్రపంచానికి తెలిసింది. అప్పటి వరకు వెనుకబడిన దేశంగా భావించబడిన భారత్, ఒక ఆధ్యాత్మిక గురువుగా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

చికాగో సర్వమత సమ్మేళనం స్వామి వివేకానంద జీవితంలోనే కాదు, భారతదేశ చరిత్రలో కూడా ఒక మైలురాయి. ఇది నేటికీ సహనం, శాంతి, మానవ ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోంది.