Home Blog Page 97

స్వామి వివేకానంద క్విజ్ (MCQs)

0

1. స్వామి వివేకానంద గారి అసలు పేరు ఏమిటి?
A) రవీంద్రనాథ్ దత్తా
B) నరేంద్రనాథ్ దత్తా
C) సుభాష్ చంద్ర దత్తా
D) అరవింద్ దత్తా
సరైన జవాబు: B

2. స్వామి వివేకానంద జన్మించిన సంవత్సరం ఏది?
A) 1856
B) 1861
C) 1863
D) 1870
సరైన జవాబు: C

3. స్వామి వివేకానంద గారి జన్మస్థలం ఎక్కడ?
A) ముంబై
B) చెన్నై
C) కోల్‌కతా
D) వారణాసి
సరైన జవాబు: C

4. స్వామి వివేకానంద గురువు ఎవరు?
A) దయానంద సరస్వతి
B) రామానుజాచార్యులు
C) రామకృష్ణ పరమహంస
D) శంకరాచార్యులు
సరైన జవాబు: C

5. స్వామి వివేకానంద ప్రసిద్ధ చికాగో ఉపన్యాసం ఏ సంవత్సరంలో జరిగింది?
A) 1890
B) 1891
C) 1893
D) 1895
సరైన జవాబు: C

6. చికాగో ఉపన్యాసం ప్రారంభంలో స్వామి వివేకానంద పలికిన మాటలు ఏమిటి?
A) నా దేశ ప్రజలారా
B) సోదరులు మరియు సోదరీమణులారా
C) గౌరవనీయులైన అతిథులారా
D) నా మిత్రులారా
సరైన జవాబు: B

7. స్వామి వివేకానంద స్థాపించిన సంస్థ ఏది?
A) ఆర్య సమాజం
B) బ్రహ్మ సమాజం
C) రామకృష్ణ మిషన్
D) భారత సేవా సంఘం
సరైన జవాబు: C

8. రామకృష్ణ మిషన్ స్థాపించిన సంవత్సరం ఏది?
A) 1893
B) 1895
C) 1897
D) 1901
సరైన జవాబు: C

9. స్వామి వివేకానంద జయంతిని ఏ రోజున జాతీయ యువజన దినోత్సవంగా జరుపుతారు?
A) జనవరి 10
B) జనవరి 11
C) జనవరి 12
D) జనవరి 15
సరైన జవాబు: C

10. “లేచి నిలబడి లక్ష్యాన్ని చేరేవరకు ఆగకండి” అనే సూక్తి ఎవరిది?
A) మహాత్మా గాంధీ
B) స్వామి వివేకానంద
C) రవీంద్రనాథ్ టాగూర్
D) సుభాష్ చంద్రబోస్
సరైన జవాబు: B

స్వామి వివేకానంద – భారత యువతకు ప్రేరణ

0
swamy vivekananda
about swamy vivekananda

స్వామి వివేకానంద భారతదేశపు గొప్ప ఆధ్యాత్మిక గురువులలో ఒకరు. ఆయన భారత సంస్కృతి, ఆధ్యాత్మిక విలువలను ప్రపంచానికి పరిచయం చేసిన మహానుభావుడు. యువతకు ఆత్మవిశ్వాసం, కర్తవ్య నిబద్ధత, దేశభక్తి వంటి గుణాలను నేర్పిన గొప్ప నాయకుడు.

జననం మరియు బాల్యం

స్వామి వివేకానంద 1863 జనవరి 12న కోల్‌కతాలో జన్మించారు. ఆయన అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. చిన్నప్పటి నుంచే నరేంద్రుడు తెలివైనవాడు, ధైర్యవంతుడు మరియు సత్యాన్వేషణలో ఆసక్తి కలిగినవాడు.

రామకృష్ణ పరమహంస శిష్యుడు

నరేంద్రనాథ్ దత్తా రామకృష్ణ పరమహంసను తన గురువుగా స్వీకరించారు. గురువు మార్గదర్శకత్వంతో ఆయన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందారు. తరువాత ఆయనకు “స్వామి వివేకానంద” అనే పేరు ప్రసిద్ధి చెందింది.

చికాగో ఉపన్యాసం

1893లో అమెరికాలో జరిగిన ప్రపంచ మత పార్లమెంట్‌లో స్వామి వివేకానంద ప్రసంగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. “సోదరులు మరియు సోదరీమణులారా” అనే మాటలతో ప్రారంభమైన ఆయన ఉపన్యాసం ప్రపంచాన్ని ఆకట్టుకుంది. భారతదేశ ఆధ్యాత్మిక గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేశారు.

యువతకు సందేశం

స్వామి వివేకానంద యువతను ఉద్దేశించి ఎన్నో ప్రేరణాత్మక మాటలు చెప్పారు.
“లేచి నిలబడి లక్ష్యాన్ని చేరేవరకు ఆగకండి” అనే ఆయన మాటలు నేటికీ యువతకు మార్గదర్శకంగా ఉన్నాయి. ఆయన శరీర బలం, మానసిక బలం, ఆత్మబలం అవసరమని చెప్పారు.

రామకృష్ణ మిషన్

1897లో స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్‌ను స్థాపించారు. ఈ మిషన్ సేవా భావంతో విద్య, వైద్యం, సమాజ సేవలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది.

ముగింపు

స్వామి వివేకానంద జీవితం ప్రతి భారతీయుడికి ఒక ఆదర్శం. ఆయన ఆలోచనలు యువతను శక్తివంతంగా మారుస్తాయి. దేశాభివృద్ధికి కృషి చేయాలంటే ఆయన బోధనలు అనుసరించాల్సిందే. స్వామి వివేకానంద భారతదేశానికి గర్వకారణం.

సాంగిడి ఉప సర్పంచ్ జిమ్మ శేఖర్ ఉదారత

0

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం కొత్త సాంగిడి గ్రామానికి చెందిన యువ ఉప సర్పంచ్ జిమ్మ శేఖర్ జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకొని సోమవారం జై హనుమాన్ యూత్ కు క్రికెట్ కిట్ అందజేసి ఉదారత చాటారు. జిమ్మ శేఖర్ అతి చిన్న వయసులోనే ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. గ్రామ అభివృద్ధితో పాటు యువతను క్రీడలలో ప్రోత్సహిస్తూ తన ప్రత్యేకతను చాటుతున్నారు. క్రీడల పట్ల ఆసక్తి కలిగిన ఈ యువ నాయకుడు, యువతలో ఆత్మవిశ్వాసం, ఆరోగ్యశీలతను పెంపొందించేందుకు క్రీడలను ప్రోత్సహిస్తూ ఇటీవల గ్రామ యువకులకు క్రీడా సామగ్రి (బాల్స్, కిట్లు, జెర్సీలు) అందజేశారు. యువతే గ్రామ భవిష్యత్తు. వాళ్లను శారీరకంగా, మానసికంగా బలంగా తీర్చిదిద్దడం నా బాధ్యత అని జిమ్మ శేఖర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు సామ శ్రీపాల్ రెడ్డి, గోహార్ కార్ సూరజ్, గోహర్ కర్ సచిన్, రాహుల్, ప్రశాంత్ రెడ్డి, వెంకటేష్, అభి గన్నే, గుమ్మడి రాహుల్, సుంకరి గజానన్,  పు రుషోత్తం, జైమని,వేదాంత్ రెడ్డి, గణేష్, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా రాజమాత జిజియాబాయి,స్వామి వివేకానంద జయంతి వేడుకలు

0
Loka praveen reddy
Loka praveen reddy

చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా  బేల మండల కేంద్రంలోని శివాజీ చౌక్ వద్ద ఘనంగా రాజమాత జిజియాబాయి, స్వామి వివేకానంద జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు, విశ్వహిందూ పరిషత్ సభ్యులు రాజమాత జిజియాబాయి, స్వామి వివేకానంద చిత్రపటాలకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బేల మండల మరాఠా సంఘం అధ్యక్షుడు విఠల్ రావుత్ మాట్లాడుతూ..ప్రతి సంవత్సరం జనవరి 12న రాజమాత జిజౌ జయంతిని సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. భారతదేశం వీరమాతలకు పేరుగొన్నది అని అటువంటి వారిలో ఛత్రపతి శివాజీ మాతృమూర్తి వీరమాత జిజియాబాయి అని అన్నారు. మరాఠా యోధుల కుటుంబంలో పుట్టిన ఆమె హిందు ధర్మ పరిరక్షణకు కృషి చేశారని అన్నారు. అదేవిధంగా స్వామి వివేకానంద జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా పాటిస్తారు అని అన్నారు.వివేకానంద బోధనలు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ ఉత్తేజ పరుస్తునే ఉన్నాయని పేర్కొన్నారు. నేటి యువత వారి అడుగు జాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీ లకు చెందిన ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలి

0

చిత్రం న్యూస్, బేల: స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలని ఏబీవీపీ నేత మాడవార్ హరీష్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని ఏబీవీపీ ఆధ్వర్యంలో వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు. యువతీ,యువకులు అన్ని రంగాల్లో రాణిస్తూ వివేకానందుని స్పూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.నిరంతరం విద్యార్థుల సమస్యలపై పోరాటం చేసే ఏకైక సంఘం ఏబీవీపీ అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఇంద్ర శేఖర్, నాయకులు దత్తా నిక్కం,సందీప్ ఠాక్రే, రాము బర్కడే, నవీన్ పోత్ రాజ్, ఏబీవీపీ నాయకులు శివానీత్ వార్ ఓం ప్రకాష్, రేసు మనోజ్ రెడ్డి, తరుణ్, కట్కార్ల సాయి రెడ్డి, బాలాజీ, రేసు శివ రెడ్డి, ఉప్పల్ వార్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

స్వామ

న్యాయవాద పరిషత్ 2026 క్యాలెండర్ ఆవిష్కరణ

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్.జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ ఆవరణలో న్యాయవాద పరిషత్ 2026 క్యాలెండర్ ను ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండ్రాల నగేష్, ఆదిలాబాద్ ప్రభారి మంగులాల్ తో కలిసి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంగులాల్ మాట్లాడుతూ.. న్యాయవాద పరిషత్ న్యాయవాద సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుందని నిరుపేదలకు, న్యాయసేవలు అందించడానికి కృషి చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు చంద్ర మోహన్, ఉమేష్ రావు డోలె, న్యాయవాదులు పాల్గొన్నారు.

గ్రామీణ క్రీడాకారులకు పూర్తి సహకారం అందిస్తాం_మున్సిపల్ మాజీ ఛైర్మన్ జోగు ప్రేమేందర్

0

చిత్రం న్యూస్, సాత్నాల:  గ్రామీణ క్రీడలను ప్రోత్సహిస్తూ మాజీమంత్రి జోగు రామన్న క్రీడాకారుల దాగి ఉన్న ప్రతిభను గుర్తించేలా వివిధ క్రీడలకు సంబంధించిన పోటీలకు పూర్తి సహకారాన్ని అందిస్తూ వస్తున్నారని మున్సిపల్ మాజీ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. సోమవారం సాత్నాల మండలం సైద్ పూర్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రికెట్ టోర్నమెంట్ పోటీలను మున్సిపల్  మాజీ చైర్మన్ ప్రేమేందర్ ప్రారంభించారు. క్రీడాకారులు పరిచయం చేసుకొని అభినందనలు తెలిపారు.. క్రికెట్ ఆడుతూ క్రీడా స్ఫూర్తిని చాటారు. ముందుగా గ్రామస్తులు పూల పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.జోగు ప్రేమేందర్.. మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.. జోగు ఫౌండేషన్ ప్రత్యేక క్రీడా పోటీలను ప్రోత్సహిస్తూ క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను గుర్తించడం జరుగుతుందన్నారు. ఈ క్రీడాల ద్వారా యువకులలో స్నేహపూర్వ సంబంధాలతో పాటు శారీరక మానసిక దృఢత్వం బలపడుతుందన్నారు.. ఈ కార్యక్రమంలో  దేవన్న, రోహిదాస్, దేవన్న,చరణ్ శిగ్, జాదవ్, అంకుష్, ఆత్రం అంబదాస్, అంకుష్ గీత, ప్రతాప్, రోహిదాష్ తదితరులు పాల్గొన్నారు.

 

తెలంగాణలో పదో తరగతి ప్రీ-ఫైనల్ పరీక్షల షెడ్యూల్ విడుదల

0

చిత్రం న్యూస్,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను పదో తరగతి ప్రీ-ఫైనల్ పరీక్షల టైమ్ టేబుల్‌ను పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ డాక్టర్ ఇ.నవీన్ నికోలస్( IAS ) విడుదల చేశారు. ఈ పరీక్షలు ఫిబ్రవరి 17_ 2026 నుండి ఫిబ్రవరి 24,_2026 వరకు ఉదయం సెషన్‌లో జరగనున్నాయి. పరీక్షల వివరాలు: ఉదయం 9.30 నుండి 12.30 వరకు (కొన్ని పేపర్లకు 11.00 వరకు) పరీక్షలు: 17.02.2026 (మంగళవారం): ఫస్ట్ లాంగ్వేజ్, 18.02.2026 (బుధవారం): సెకండ్ లాంగ్వేజ్, 19.02.2026 (గురువారం): థర్డ్ లాంగ్వేజ్,  20.02.2026 (శుక్రవారం): మ్యాథమెటిక్స్, 21.02.2026 (శనివారం): ఫిజికల్ సైన్స్, 23.02.2026 (సోమవారం): బయోలాజికల్ సైన్స్, 24.02.2026 (మంగళవారం): సోషల్ స్టడీస్ ఉంటుందని విద్యార్థులు ఈ షెడ్యూల్ ప్రకారం పరీక్షలకు సన్నద్ధం కావాలని అధికారులు సూచించారు.

రేవంత్ అన్న బస్తీ బాట పోస్టర్ ఆవిష్కరణ

0

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:  మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ అన్న బస్తీ బాట కంది శ్రీనన్న పాదయాత్ర కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి కంది శ్రీనివాస రెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో పెద్ద ఎత్తున హాజరైన కాంగ్రెస్ శ్రేణుల మధ్య పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సోయం బాపురావు, డీసీసీబీ మాజీ  ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి,  మున్సిపల్ మాజీ చైర్మన్ దిగంబార్ రావు పాటిల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు  లోక ప్రవీణ్ రెడ్డి, సాయి చరణ్ గౌడ్, సెడ్మకి ఆనందరావు, మునిగెల నర్సింగ్, గుడిపెల్లి నగేష్, మునిగెల విఠల్, షకీల్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు..

జైనథ్ లో  ఘనంగా స్వామి వివేకానంద జయంతి

0

చిత్రం న్యూస్, జైనథ్: జైనథ్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు, గ్రామ యువకులు స్వామి వివేకానంద జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. భారతదేశ ఆధ్యాత్మిక ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పి, నేటి యువకులకు స్పూర్తి ప్రదాత మహానుభావుడు స్వామి వివేకానంద అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చిలుకూరి లింగారెడ్డి, జైనథ్ గ్రామ ఉప సర్పంచ్ పిడుగు సంతోష్ యాదవ్, సత్యనారాయణ, ప్రతాప్ యాదవ్, అన్నెల అశోక్, రమేష్ యాదవ్ గ్రామ యువకులు సాయి, ప్రవీణ్, శరత్ తదితరులు పాల్గొన్నారు.